Suman TV Digital News | తెలుగు ప్రేక్షకులకు, ముఖ్యంగా యూట్యూబ్ చూసే వారికి సుమన్ టివి భాగా పరిచయం అయిన ఛానెల్. ఈ ఛానెల్ ఎండీ సుమన్. యూట్యూబ్‌లో ఒక వ్యక్తితో ప్రారంభమైన ఈ సుమన్ టివి ఛానెల్ ఇప్పుడు 400 నుంచి 500 మంది కి ఉపాధి కల్పిస్తుంది. 2 కోట్లకు పైగా సబ్స్క్రైబర్స్తో తెలుగులో ప్రజలకు సమాచారాన్ని చేరవేస్తోంది. శాటిలైట్ ఛానెల్‌కు ధీటుగా ఈ యూట్యూబ్ ఛానెల్ ప్రజల వద్దకు చేరింది.
Suman TV Digital News
ఇటీవల సుమన్ (SUMAN)టివి డిజిటల్ న్యూన్ ఛానెల్ ఓపెనింగ్ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెగస్టార్ చిరంజీవి హాజరై మాట్లాడారు. ఈ ఛానెల్ అధినేత సుమన్ తనకు ఎప్పటి నుంచో తెలుసని అన్నారు. తన కుటుంబంతో తనకు స్నేహ బంధం ఉందని పేర్కొన్నారు. ఈ ఛానెల్‌ను నడిపేందుకు సుమన్ ఎంతో కష్టపడ్డారని అన్నారు. ఛానెల్‌ను మరింత అభివృద్ధి చేయడంలో తనకు సహకరిస్తున్న స్టాఫ్ ను అభినందించారు. సుమన్ టివిని ప్రతి ఒక్కరూ ఆధరించాలని కోరారు.
ఈ ఛానెల్లో మంచి జర్నలిస్టులు ఉన్నారని, వారి డిబెట్స్, న్యూస్ అప్పుడప్పుడు చూస్తుంటానని అన్నారు. ఈ ఛానెల్ లో తనకు నచ్చిన, తెలిసిన జర్నలిస్టులు ప్రభు,జాఫర్ గురించి కొద్దిగా మాటల ద్వారా వివరించారు. ప్రభు తాను చెన్నైలో ఉన్నప్పుడు ఒక స్టోరీని రాశారని, ఆ స్టోరీ చూసిన తర్వాత ప్రభూను ఈ రంగంలోకి అడుగు పెట్టమనది తానేనని ఇప్పుడు గర్వంగా చెప్పుకుంటానని అన్నారు. అలాగే జాఫర్ అంటేనే రాజకీయా నాయకులకు, అవినీతి, తప్పు చేసిన నాయకులకు వంటిలో వణుకు పుడుతుందని సరదాగా వ్యాఖ్యానించారు. ఇలాంటి జర్నలిస్టులు ఈ ఛానెల్‌కు ఉండటం అదృష్టమని సుమన్ డిజిటల్ న్యూస్ ఛానెల్‌ను ఆదరించాలని ముగించారు.
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్‌లెస్ మటన్ బిర్యానీ తయారీ