suicide son storie | చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలో ఓ ప్రైవేటు lodgeలో మనస్థాపంతో ఉరి వేసుకుని యవుకుడు మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే బజారు వీధికి చెందిన ఓ ప్రముఖ జ్యూవలరీ యజమాని నాగరాజు కుమారుడు తరుణ్ (26) సోమవారం రాత్రి ఓ ప్రైవేటు లాడ్జిలోని రూము అద్దెకు తీసుకున్నాడు. అదే రూములోని ఫ్యాన్‌కి ఉరివేసుకుని Suicide చేసుకున్నట్టు తెలుస్తోంది. లాడ్జి యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి మృతుడిని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి (suicide son storie) తరలించారు.
నన్ను తల్లిదండ్రులే చంపేశారు?


ఇది ఆత్మహత్య కాదు…మర్డర్ అని తన ఫోన్‌లో ఓ status పెట్టుకున్నాడు తరుణ్. తన తల్లిదండ్రుల ధన దాహంతో తన ప్రాణం బలి అయిందని స్టేటస్‌లో చెప్పుకొచ్చాడు. తన తల్లిదండ్రులు చిత్రహింసలు పెట్టే మానసిక క్షోభ భరించ లేక తరుణ్ ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. తన సొంత వ్యాపారానికి తల్లిదండ్రులను అవకాశం ఇవ్వమన్నందుకే నాకు ఇంత శిక్ష అంటు స్టేటస్లో చెప్పుకొచ్చాడు. నువ్వు చచ్చిపో…పట్టించుకోమన్నారు…ఇక నేను భరించలేక వెళ్లిపోతున్నా.. అందరికీ నమస్కారాలు అంటూ ఆత్మహత్య చేసుకున్నాడు.
డబ్బుల మోజులో కన్న కొడుకు పట్ల వేధింపులు
డబ్బుల మోజులో పడి కన్న బిడ్డను అతిహీనంగా వేధించి డబ్బులకు బలిచేసిన ఈ సంఘటన పుంగనూరు పట్టణంలో సంచలనం సృష్టించింది. బంగారు వ్యాపారి దంపతుల కుమారుడు Tarun Kumar ఇంజనీరింగ్ చదివాడు. గత ఏడాది ఓ యువతితో వివాహం నిశ్చయమైంది. లగ్న పత్రిక కార్యక్రమంను వైభవంగా నిర్వహించారు. అకస్మాత్తుగా తల్లిదండ్రుల మనసు మారి ఆ సంబంధాన్ని రద్దు చేసుకున్నారు.ప్రతి రోజూ ఇంటిలో తరుణ్ కుమార్‌ను తల్లిదండ్రులు సూటిపోటి మాటలతో వేధించడం చేసేవారని తెలుస్తోంది.


పట్టణంలో బంధుమిత్రులు పలు మార్లు పంచాయతీలు నిర్వహించి, తల్లిదండ్రులను మందలించారు. కానీ డబ్బు మోజులో పడ్డ తల్లిదండ్రులకు కన్నబిడ్డ మమకారం కానరాలేదు. డబ్బే శాశ్వతమని, కన్నబిడ్డ లేకపోయినా డబ్బుంటే చాలనే ఖర్కశ మనస్థత్వంతో తరుణ్ కుమార్‌ను ఏ వ్యాపారంలోను పెట్టకుండ, స్నేహితులతో కలవనివ్వకుండ మానసిక క్షోభకు గురి చేసి, తల్లిదండ్రుల పదాలకు అర్థం మార్చేశారు. ఈ వేధింపులకు తాళలేక తరుణ్ కుమార్ తన ఫోన్‌లో స్టేటస్ పెట్టి తన తల్లిదండ్రులే తన చావుకు కారణమని పెట్టాడు. డబ్బే వారికి ప్రధానమని ఆవేదన చెందాడు. సారీ చెబుతామని ఇంటికి వెళ్లినా ఇంటిలోనికి రానివ్వలేదని మనస్థాపానికి గురయ్యాడు. లాడ్జిలో రూము తీసుకుని ఆత్మహత్య పాల్పడ్డాడు.