sugarcane juice for skinమనం రోడ్డు మీద నడుస్తున్నప్పుడు దాహం వేస్తే వెంటనే ఫుట్‌పాత్‌లపై ఉండే చెరుకురసం(sugarcane juice) ఎక్కడ ఉందా? అని వెతుకుతుంటాం కదా!. 10 నిమిషాలు లేటైనా సరే ఆ చెరుకురసం తాగే కదులుతాం. వాస్తవానికి అన్నికాలాలో అందుబాటులో ఉండే పండ్ల రసాల్లో చెరుకురసం ఒకటి. అయితే దీనిని తాగడానికే కాదండోయ్.. చర్మ సౌందర్య సాధనంగా కూడా(sugarcane juice for skin) ఉపయోగించుకోవచ్చట.
ముఖం అందంగా కనిపించడానికి షాపుల్లో దొరికిన క్రీములల్లా రాయడం వల్ల ఉన్న అందం పోయి ఇంకా అంధవికారంగా కనిపించే కన్నా ప్రకృతి ద్వారా లభించే పదార్థాలను ఉపయోగించడం చర్మానికి ఎంతో మంచిదంటున్నారు మన పెద్దవారు. ప్రకృతిలో లభించే కొన్ని పండ్లు, ఇతర ఆహార పదార్థాల ద్వారా సహజత్వంతో మెరుగైన అందాన్ని సొంం చేసుకోవచ్చు.
చెరకులో సౌందర్యాన్ని పెంపొందించే సహజమైన రసాయనాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా గ్లైకోలిక్ యాసిడ్(glycolic acid) ఎక్కువుగా ఉంటుంది. ఇది చర్మాన్ని కాంతివంతం చేయడంతో పాటు మృదువుగా, సాఫ్ట్‌గా ఉండేలా చేస్తుంది.
చెరకు రసాన్ని ముఖానికి రాసుకోవడం వల్ల ముఖంపై మచ్చలు, మొటిమలు మాయమవుతాయి. అయితే చెరకులోని గ్లైకోలిక్ యాసిడ్‌తో ఎలాంటి హాని కలగదని వైద్యులు అంటున్నారు. అంతేకాదు, అలసిపోయిన చర్మానికి తిరిగి శక్తిని అందిస్తుందట. చర్మంలో సమతూకం ఉండేలా చేస్తుందట. మొహం మీద గీతలు, ముడతలు పడకుండా చేస్తుంది. మృతకణాలని తొలగిస్తుంది.
- MLA Seethakka: తెలంగాణలో నీళ్లేవూ..నిధులూ లేవూ!
- Nelluri Nerajana Song lyrics:నెల్లూరి నెరజానా నీ కుంకుమల్లె మారిపోనా లిరిక్స్ | Oke Okkadu Movie
- surface tension: వర్షపు బిందువుల, Soap bubble, పాదరస బిందువులు గోళాకారంలోనే ఎందుకుంటాయి?
- Viscosity: రక్తం వేగాన్ని నియంత్రించుకోవాలన్నా, సముద్రంలో కెరటాలు తాకిడి తగ్గాలన్నా స్నిగ్థతే కారణం!
- Hands: అందమైన చేతుల తళతళా మెరవాలంటే ఇలా చేయండి!