suez canal story: అంతర్జాతీయ వాణిజ్యానికే జీవనాడైన సూయిజ్ కాలువ ప్రత్యేకత ఏమిటంటే?
suez canal story సూయజ్ కాలువ (Suez Canal) ఈజిప్టులోని ఒక కాలువ. 1869 లో ప్రారంభింపబడినది. యూరప్, ఆసియాల మధ్య జల రవాణా కొరకు ఆఫ్రికాను చుట్టి రాకుండా దగ్గరి మార్గానిరి అనువైనది. మధ్యధరా సముద్రాన్ని, ఎర్ర సముద్రాన్ని కలిపే ఓ కృత్రిమ జలసంధి లాంటిది. ఆఫ్రికా, ఆసియాలను విడదీ స్తుంది. దీనికి ఉత్తర కొసన సైద్ రేవు, దక్షిణ కొసన సూయెజ్ నగరంలోని టివ్ఫిక్ రేవు ఉన్నాయి. దానికి రెండు వైపులా ఉన్న అప్రోచ్ కాలువలతో కలిపి ఈ కాలువ పొడవు 193.3 కి.మీ ఉంది. ఈ కాలువను ఈజిప్టు కు చెందిన సూయజ్ కెనాల్ అథారిటీ (SCA) చే నిర్వహిస్తోంది. 2020లో, 18,500 పైచిలుకు నౌకలు ఈ కాలువ(suez canal story) గుండా (రోజుకు సగటున 51.5) ప్రయాణించాయి.

1858లో కాలువ నిర్మాణానికి ఎక్రైస్ ప్రయోజనం కోసం ఫెర్టినాండ్ డి లెస్సెప్స్ సూయజ్ కెనాల్ కంపెనీని స్థాపించారు. కాలువ నిర్మాణం 1859 నుండి 1869 వరకు కొనసాగింది. ఒట్టోమన్ సామ్రాజ్యపు ప్రాంతీయ అధికారం క్రింద దీని నిర్మాణం జరిగింది. ఈ కాలువను అధికారికంగా 1869 నవంబర్ 17న ప్రారం భించారు. ఇది ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రం, ఉత్తర భారత మహాసముద్రాల మధ్య మధ్యధరా సముద్రం ఎర్ర సముద్రాల ద్వారా నేరుగా జల మార్గ సౌకర్యాన్ని అందిస్తుంది. తద్వారా దక్షిణ అట్లాంటిక్ మహా సముద్రం, దక్షిణ భారత మహాసముద్రాల గుండా ప్రయాణించాల్సిన అవసరాన్ని తప్పిస్తుంది. అరేబియా సముద్రం నుండి లండన్‌కు ఉన్న ప్రయాణ దూరాన్ని సుమారు 8,900 కిలోమీటర్ల మేర తగ్గిస్తుంది.
సూదీర్ఘ కాలంగా కాలువ మూసివేత
అంతర్జాతీయ వాణిజ్యానికి జీవనాడి లాంటిదైన సూయిజ్ కాలువలో రాకపోలు నిలిచిపోయాయిన సంఘటన ఎదురైంది. కొన్ని నెలల కిందట ఓ భారీ కంటైనర్ నౌక కాలువలో అడ్డం తిరిగి ఇరుక్కు పోయింది. కోట్లాది డాలర్ల వాణిజ్యానికి నష్టం వాటిల్లింది. ప్రపంచంలోనే అత్యంత కీలక షిప్పింగ్ మార్గమైన సూయిజ్ లో ఇలా రవాణా బంద్ అవడం ఇదే తొలిసారి కాదు. దాదాపు 5 దశాబ్ధాల కిందట ఈ కెనాల్ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘంగా ట్రాఫిక్ నిలిచిపోయింది ఫలితంగా 14 నౌకలు 8 ఏళ్లపాటు సూయిజ్ జలాల్లో నిలిచిపోవాల్సా వచ్చింది.
ఎర్ర సముదం మీదుగా మధ్యధరా సముద్రం, హిందూ మహా సముద్రాలను కలిపే మానవనిర్మితమైన సన్నని కాలువే సూయిజ్. ఆసియా, ఆఫ్రికాల మధ్య ఉన్న ఈ కాలువ పొడవు 193 కిలోమీటర్లు. ఈజిప్టులో ఉండే ఈ కీలక జల మార్గాన్ని 1869లో ప్రారంభించారు. 1967లో ఈజిప్టు – ఇజ్రాయెల్ ల మధ్య పరిస్థితులు ఉద్రిక్తంగా మారి యుద్దానికి దారితీశాయి. 1967 జూన్ 5న ఇరుదేశాల మధ్య యుద్ధం మొదలైంది. సరిగ్గా అదే సమయంలో 14 కార్గో ఓడలు సూయిజ్ జలాల్లోకి ప్రవేశించాయి. అయితే ఈ కాలువను యుద్ధ జోన్‌గా ప్రకటించిన ఈజిప్టు..నౌకలను గ్రేట్ బిట్టర్ సరస్సు వద్ద నిలిచిపోవాలని ఆదేశించింది. దీంతో నౌకలు అక్కడే ఆగిపోయాయి.
ఆరు రోజుల యుద్ధం తర్వాత సూయిజ్ కాలువ తూర్పు తీరాన్ని ఇజ్రాయెల్ స్వాధీనం చేసుకుంది. పశ్చిమప్రాంతం మాత్రం ఈజిప్టు ఆధీనంలో ఉంది. అయితే ఇజ్రాయెల్ ఈ కెనాల్ ను ఉపయోగించు కోకూడదనే ఉద్దేశంతో ఈజిప్టు దీన్ని పూర్తిగా మూసేసింది. నౌకల రాకపోకలు జరగకుండా కాలువ చివర్లో పెద్ద పెద్ద లాండ్మైన్లు, పాత ఓడలను నిలిపింది. దీంతో ఆ 14 నౌకలు సూయిజ్ నుంచి బయటకు రాలేకపోయాయి.
ఎనిమిది ఏళ్లుగా జలాల్లోనే..
అలా రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచినా సూయిజ్‌ను తిరిగి ప్రారంభించకపోవడంతో నౌకలు కాలువను దాటలేకపోయాయి. 1973లో ఈజిప్టు, ఇజ్రాయెల్ మధ్య రెండోసారి యుద్ధం జరిగింది. ఈ సారి రెండువైపులా భారీ ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. దీంతో రెండు దేశాలు ఒప్పందానికి వచ్చాయి. కెనాల్ కు ఇరువైపులా బలగాల ఉపసంహరణ మొదలైంది. అయితే కాలువను మూసివేసేందుకు ఉపయోగించిన శిథిలాలు, పాత ఓడలను తొలగించేందుకు దాదాపు రెండేళ్లు పట్టింది. అలా 1975 జూన్5న అంటే సరిగ్గా కెనాల్ ను మూసేసిన 8ఏళ్ల తర్వాత తిరిగి సూయిజ్‌ను తెరిచారు. దీంతో మళ్లీ రాకపోకలు మొదలయ్యాయి. ఓడల కోసం సిబ్బందిని మారుస్తూ కాలువలో మూడు నెలలు ఉన్న తర్వాత నౌక సిబ్బంది ఇంటికి వెళ్లేందుకు ఈజిప్టు ప్రభుత్వం అనుమతి కల్పిచింది.

అయితే ఓడలను మాత్రం అక్కడే ఉంచాలని ఆదేశించింది. కానీ నౌక యజమానులు మాత్రం అందుకు సుముఖత చూపించలేదు. ఓడల రక్షణ కోసం సిబ్బందిని రోటేషన పద్ధతిలో పంపించాయి. ఆ సమ యంలో ఈ నౌకల్లో ఉన్న సిబ్బంది గ్రేట్ బిట్టర్ లేక్ అసోసియేషన్ పేరుతో ఓ సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఒక నౌకను థియేటర్, ఒక నౌకలో చర్చి, ఒక నౌకను హాస్పిటల్‌గా మార్చుకున్నారు.
ఆటపాటలతో సేదతీరుతూ..
సూయిజ్ కాలువలో ఉన్న సమయంలో నౌకా సిబ్బంది ఆటపాటలతో సేద తీరేవారు. 1968లో సొంతంగా ఒలింపిక్స్ పేరుతో ఆటల పోటీలు పెట్టుకున్నారు. రికార్డుల ప్రకారం.. దాదాపు 3 వేల మంది సిబ్బంది ఈ నౌకల్లో దశలవారీగా విధులు నిర్వహించినట్టు తెలుస్తోంది. సూయిజ్‌లో చిక్కుకుపోయిన నౌకలు బల్గేరియా, చెకొస్లోవేకియా, ఫ్రాన్స్, పోలాండ్, స్వీడన్, పశ్చిమ జర్మనీ, యూకే, అమెరికా దేశాలకు చెందినవి. తదనంతరకాలంలో వీటిని ఎల్లో ఫ్లీట్‌గా పిలిచారు. ఏళ్ల తరబడి సూయిజ్ కెనాల్ లో ఉండిపోవడంతో ఎడారి ఇసుక నౌకలను పూర్తిగా కప్పేసింది. చూడటానికి పసుపురంగులో ఉండటంతో వీటిని ఆ పేరుతో పిలిచారు. ఎనిమిదేళ్ల తర్వాత వీటిల్లో చాలా నౌకలు స్వయంగా కాలువను దాటలేకపోయాయి. ఒక్క జర్మనీకి చెందిన రెండు ఓడలను సిబ్బంది నడుపుతూ బయటకు రాగా, మిగతా వాటిని ఇతర నౌకల సాయంతో లాక్కుని రావాల్సి వచ్చింది.
ఎవర్ గివెన్లో మొత్తం భారతీయ సిబ్బందే
ఈజిప్ట్ లోని సూయిజ్ కాలువ వద్ద చిక్కుకున్న భారీ నౌకలో మొత్తం సిబ్బంది అంతా భారతీయులే! ఈ ఎవర్ గివెన్ ఓడలో 25 మంది పనిచేస్తున్నారని, వారంతా క్షేమంగానే ఉన్నారని..నిర్వహణ సంస్థ ఎవర్గ్రీన్ మెరైన్ వెల్లడిం చింది. కాగా, ఈ నౌక మట్టిలో కూరుకుపోయిన కారణంగా గంటకు సుమారు రూ.2,896 కోట్ల వ్యాపారంపై ప్రభావం పడుతున్నట్టు నిపుణులు అంచనా వేశారు. అధిక బరువు కారణంగా ఈ నౌకను కదల్చడం కష్టతరంగా మారింది. దీంతో బడా నౌకాయాన సంస్థలు ప్రత్యామ్నాయ మార్గాలను ఆశ్రయిస్తున్నాయి. ఐరోపా, ఆశియాలను కలిపే సూయిజ్ కాలువ పొడవు 193 కిలోమీటర్లు. ఈజిప్టు వద్ద ఈ కీలక జలమార్గాన్ని 1859- 69 మధ్య ఏర్పాటు చేశారు. సరిగ్గా ఇక్కడే ఎవర్ గివెన్ ఇరుక్కుపోవడం.. ప్రపంచ వాణిజ్యంపై ప్రభావం చూపుతోంది.

ఇక్కడ రెండు వైపులా నిత్యం 9.6 బిలియన్ డాలర్ల విలువైన సరుకులు, చమురు, గ్యాస్ రవాణా అవుతుంటాయి. ఈ లెక్కన గంటకు సగటున 400 మిలియన్ డాలర్లు (రూ.2,896 కోట్ల) విలువైన సరుకులను తరలిస్తారు. ఎవర్ గివెన్ చిక్కుకున్న కారణంగా ఇక్కడ మరో 160 నౌకలు కూడా నిలిచిపోయాయి. వీటిలో 41 ఓడలు భారీవి కాగా, 24 చము రును తరలిస్తున్నవి. కాలువ వద్ద జరిగే ఒక్కరోజు ఆలస్యాన్ని అధిగమిం చాలంటే ఆ తర్వాత రెండు రోజుల అదనంగా కృషి చేయాల్సి ఉంటుందని రవాణా రంగ నిపుణులు అలెన్ బేర్ పేర్కొన్నారు.