Success Steps : గెలుపు ఎవరి సొత్తు కాదు..జీవితంలో ఎవరు ఎంత కష్టపడితే వారికి అంత ప్రతిఫలం దక్కుతుంది. సక్సెస్ అయిన వారందరూ కేవలం అదృష్టంపైనే ఆధారపడలేదు. వారి విజయం వెనుక ఎన్నో రాత్రులు, పగళ్లూ నిద్రహారాలు మాని కష్టపడిన సందర్భాలు ఎన్నో ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ విజయం సాధించాలంటే ప్రతి ఒక్కరికీ ఏదో ఒక గోల్ తప్పనిసరిగా ఉండాలి.
Success Steps : చిన్న వయసులో ఉన్నతంగా చదువుకుని, కోరుకున్న రంగంలో అడుగుపెట్టాలనే ఆశ చాలా మంది యువకుల్లో ఉంటుంది. అయితే అక్కడ రాణించి గుర్తించు తెచ్చుకోవాలంటే ఏం చేయాలనేది తెలుసు కోవాలి. అంశం ఏదైనా సరే దానిపై మీరు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలి. అంతకన్నా ముందు మనకంటూ లక్ష్యాలను రూపొందించుకోవాలి. వాటిని సాధించుకునేందుకు ఏం చేయాలనే స్పష్టతను పెంచుకోవాలి. లక్ష్యాలు కూడా ఎక్కువుగా రూపొందించుకుని అన్నింటినీ సాధించుకోవాలనుకోవడం కేవలం అవగాహనాలేమి అవుతుంది. దీంతో పాటు సాధించాలన్న ఆసక్తి కూడా మనలో తగ్గిపోకుండా చూసుకోవాలి.
- ఈ రోజుల్లో ఎవరైనా సరే, నేర్చుకోవడాన్ని నిరంతరం కొనసాగించాలి. అది కెరీర్‌కు సంబంధించి కావచ్చు, నైపుణ్యాలు, చదువూ కావచ్చు. కేవలం విజ్ఞానం ఒక్కటే కాదు. అదనంగా పరిసరాలు, స్నేహితులు, సహోద్యోగులూ కొన్నిసార్లు మన జూనియర్లు నుంచి కూడా నేర్చుకునేందుకు ప్రయత్నించాలి. దాని వల్ల కొత్త సవాళ్లను స్వీకరించే స్వభావం మీకు సొంతమవుతుంది. ఎదుటివారూ దాన్ని గుర్తిస్తారు.
- పొరపాట్లు చేయడం మానవ నైజం. అయితే దాన్ని తలుచుకుని బాధపడటం కన్నా, దాన్నుంచి నేర్చుకోవడంలోనే విజయం దాగుంటుంది. ఆ పొరపాట్ల నుంచి నేర్చుకునే స్వభావం మీది కావాలి. మరోసారి ఆ పొర పాటు చేయకుండా చూసుకోవాలి. అలాగని భయపడి, అసలు పొరపాట్లనేవి చేయకుండా ఉండాలనుకోకూడదు.
- సమయాన్ని వీలైనంత ఎక్కువుగా సద్వినియోగం చేసుకునే నైపుణ్యం ప్రతీ ఒక్కరికీ ఉండాలి. అలాగే సమయానికి కట్టుబడి ఉండటం, ముఖ్యమైన పనికి మొదటి ప్రాధాన్యం ఇవ్వడం, లాంటివి అవసరమే.

- మనల్ని మనం తక్కువ చేసుకుని మాట్లాడటం, కించపరుచుకోవడం, లాంటివి విజయాలు తెచ్చిపెట్టవు సరికదా ఆత్మవిశ్వాసాన్నీ తగ్గించేస్తాయి. అందుకే సాధ్యమైనంత వరకూ సానుకూల దృక్పథాన్ని సొంతం చేసుకోవాలి. ఆ కోణంలోనే ఆలోచించాలి.
- చాలా మంది ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తారు. కానీ.. జీవితం, విధుల్లో విజయం సాధించాలంటే ఆరోగ్యంగా ఉండేందుకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఆరోగ్యంగా ఉన్నవాళ్లే విజయాన్ని సులువుగా సాధించగలుగుతారు. అయితే అది కేవలం శరీరానికి కాదు, మనుసుకి వర్తిస్తుంది. అప్పుడు మెదడూ చురుగ్గా పనిచేస్తుంది. అలాగని బరువు తగ్గమని కాదు.. సమతులాహారం తీసుకుంటూ శరీరాన్ని చురుగ్గా ఉంచుకునేలా చూసుకోవాలి.
గెలుపు మెట్లు ఎక్కాలంటే?
జీవితమైనా.. కెరీర్ అయినా.. విజయం సాధించాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. కానీ దానికి కావాల్సిందల్లా సాధించాలన్న పట్టుదల. దానితో పాటు ఆలోచనల్లో సానుకూల దృక్ఫథాన్ని పెంచుకోవడం. వీటితో పాటు అదనంగా పాటించాల్సిన కొన్ని నియమాలు కూడా ఉన్నాయి అవేంటంటే..మనకంటూ ఓ లక్ష్యం ఉం టుంది. మన ఆలోచనా, ఊహ ఎప్పుడూ దాన్ని సాధించడం పైనే ఉండాలి. అప్పుడే ఎన్ని అవాంతరాలు ఎదురైనా లక్ష్యం గురించి ఆలోచిస్తాం. గెలిచేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తాం. దాని వల్ల వచ్చే ఫలితం, కలిగే ఆనందం అంతా ఇంతా కాదు.
ఏదైనా సమస్య ఎదురైనప్పుడు వెంటనే కంగారుపడకుండా దాన్నో సవాలుగా మార్చుకోవాలి. అప్పుడే దాన్ని ఎలా ఎదుర్కోవాలనే కోణంలో ఆలోచింగలుగుతాం. మనకున్న నైపుణ్యాలు, ప్రతిభ ఆధారంగా ఆ సవాలను అధిగమించేందుకు ప్రయత్నిస్తాం. అనేక విజయాలు సాధించిన ప్రముఖులు చెప్పే ముఖ్య సూత్రం ఇదే.

బలహీనతలు, రకరకాల భయాలు, సామాన్యులకే కాదు. జీవితంలో గెలిచిన వారికీ ఉంటాయి. అయితే వాళ్లు వాటిపై కాకుండా తమ బలాలు, అందుబాటులో ఉన్న అవకాశాలపైనే దృష్టి సారిస్తారు. అదే వారిని విజయం సాధించేలా చేస్తుంది. కాబట్టి, లోపాల కన్నా..మనలో ఉన్న ప్రత్యేకతలపై దృష్టి సారించడం ఉత్తమం. ముందు మనలోని బలాలు, తర్వాత బలహీనతలు, భయాలు రాసుకొని, ఒక్కో లోపాన్ని నెమ్మదిగా అధిగమించేలా చూసుకోవాలి. అప్పుడే అనుకున్న లక్ష్యాన్ని సాధించగలుగుతాం.
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్‌లెస్ మటన్ బిర్యానీ తయారీ
- Manasa Devi: సర్పాలను కాపాడిన మానసాదేవి గురించి ఆధ్యాత్మిక విషయాలు
- Anemia Ayurvedic Treatment: మనిషిని కృంగదీసే వ్యాధులలో ఎనీమియా ఒకటి
- best food for heart: గుండె ఆరోగ్యంగా ఉండాలంటే తినాల్సిన ఆహారం ఇదే!