Students Attendance Apps

Students Attendance Apps: బ‌డికి రాక‌పోయారో వాలంటీర్ వ‌స్తారు!

Spread the love

Students Attendance Apps: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌భుత్వ స్కూలుకు వెళ్లే విద్యార్థుల ప‌ట్ల ఇక కీల‌క నిర్ణ‌యాలు అమ‌ల్లోకి రానున్నాయి. అందులో భాగంగా..బ‌డికి వెళ్ల‌కుంటే వాలంటీర్ ఇంటికి వ‌స్తాడు.. ఈ మాట పిల్ల‌ల‌కు కాస్త కోపం, చిరాకు, భ‌యంగా ఉన్న‌ప్ప‌టికీ అమ‌ల్లోకి వ‌స్తే మాత్రం త‌ప్ప‌కుండా నిబంధ‌న‌లు కొన‌సాగ‌నున్నాయి.

విద్యార్థి క్షేమ స‌మాచారాలు తెలుసుకోవ‌డంతో పాటు క్ర‌మం త‌ప్ప‌కుండా పాఠ‌శాల‌కు హాజ‌రయ్యేలా రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌త్యేక చ‌ర్య‌లు తీసుకుంటోంది. విద్యార్థుల‌ను ప‌ర్య‌వేక్షించేందుకు ప్ర‌ధానోపాధ్యాయుల‌తో పాటు కొత్త‌గా వాలంటీర్ల‌కు బాధ్య‌త‌లు అప్ప‌గించింది.

ఇందుకోసం రోజూ విద్యార్థి హాజ‌రును న‌మోదు చేసేందుకు దేశంలో ఎక్క‌డా లేని విధంగా స్టూడెంట్ అటెండెన్స్ యాప్(Students Attendance Apps) ను ప్ర‌వేశ‌పెట్టింది. ఈ యాప్‌లో విద్యార్థి హాజ‌రును రోజూ న‌మోదు చేస్తారు. ఉద‌యం 11 గంట‌ల‌కు అన్ని పాఠ‌శాల‌ల విద్యార్థుల హాజ‌రు వివ‌రాలు డీఈఓ కార్యాల‌యానికి చేర‌తాయి.

వ‌రుస‌గా మూడ్రోజులు వెళ్ల‌కుంటే..

ఏ విద్యార్థి అయినా వ‌రుస‌గా మూడు రోజులు పాఠ‌శాల‌కు వెళ్ల‌క‌పోతే విద్యార్థి ఉంటున్న ప్రాంతంలోని వాలంటీరుకు స‌మాచారం వెళ్తుంది. దీంతో వాలంటీర్ విద్యార్థి ఇంటికి వెళ్లి ఆరా తీస్తారు. అనారోగ్యంతో బాధ‌ప‌డుతుంటే వెంట‌నే స‌మీపంలోని ఆస్ప‌త్రికి స‌మాచారం పంపుతారు.

ఇత‌ర‌త్రా కార‌ణాల‌తో పాఠ‌శాల‌కు గైర్హాజ‌రైతే త‌ల్లిదండ్రుల‌కు స‌మాచారం చేర‌వేస్తారు. గ‌తంలో ప్ర‌భుత్వ పాఠ‌శాలల్లోనే హాజ‌రు న‌మోదుపై దృష్టి సారించేవారు. ఇక నుంచి ప్రైవేటు పాఠ‌శాల‌ల నిర్వ‌హాకులు కూడా విద్యార్థుల హాజ‌రును స్టూడెంట్ అటెండెన్స్ యాప్ లో త‌ప్ప‌నిస‌రిగా న‌మోదు చేయాల‌ని ప్ర‌భుత్వం ఇప్ప‌టికే ఆదేశాలు జారీ చేసింది.

మ‌రోవైపు ఏడాదిలో 70 శాతం హాజ‌రు లేక‌పోతే అమ్మఒడి ప‌థ‌కం కూడా వ‌ర్తించ‌ద‌ని తేల్చి చెప్పింది. దీంతో ఇటు ప్ర‌భుత్వ‌, అటు ప్రైవేటు పాఠ‌శాల్లోని విద్యార్థుల హాజ‌రు ను త‌ప్ప‌కుండా యాప్ లో న‌మోదు చేయాల్సిన ప‌రిస్థితి నెల‌కొంది.

School Timetable: ఉద‌యం 8 గంట‌ల నుంచి 6 గంట‌ల వ‌ర‌కు పాఠ‌శాల‌లు! 10 గంట‌ల పాటు క్లాసులు!

School Timetable: అమ‌రావ‌తి: ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల స‌మ‌యాన్ని పొడిగించారు. ప్రారంభానికి ముందు గంటా 45 నిమిషాలు, త‌ర‌గ‌తుఉల ముగిసిన త‌ర్వాత గంటా 15 నిమిషాలు పెంచారు. ఉన్న‌త Read more

Academic Year : ఏడాదంతా పుస్తకం తెరిస్తే ఒట్టు! వ‌చ్చే ఏడాదైనా కొన‌సాగేనా?

Academic Year : దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌వేశించిన‌ప్ప‌టి నుంచి పిల్ల‌ల‌కు చ‌దువు దూర‌మ‌య్యింది. స‌రిగ్గా పాఠ‌శాల‌ల‌కు వెళ్ల‌లేని ప‌రిస్థితి నెలకొంది. దాదాపు రెండు సంవ‌త్స‌రాల వ్య‌వ‌ధిలో Read more

Lockdown : తెలంగాణ‌లో లాక్‌డౌన్ రాబోతుందా?

Lockdown : Hyderabad : తెలంగాణ‌పై మ‌రోసారి క‌రోనా పంజా విసురుతోంది. క‌రోనా మ‌హమ్మారి భారిన ప‌డిన వారి సంఖ్య క్ర‌మ క్ర‌మంగా పెరుగుతోంది. గ‌త 15 Read more

Covid Pasitive: చిత్తూరు జిల్లా పాఠ‌శాల‌ల్లో కోవిడ్ క‌ల‌క‌లం ఉపాధ్యాయుల‌కు, విద్యార్థుల‌కు కోవిడ్ పాజిటివ్‌

Covid Pasitive: చిత్తూరు: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పాఠ‌శాల‌లు పునః ప్రారంభ‌మైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు 17 మంది ఉపాధ్యాయుల‌కు క‌రోనా పాజిటివ్‌గా నిర్థార‌ణ అయ్యింది. వీరితో పాటు 10 Read more

Leave a Comment

Your email address will not be published.