Suicide: Chaitanya Collegeలో విద్యార్థిని అనుమాన‌స్ప‌ద మృతి

Suicide: Chaitanya Collegeలో విద్యార్థిని అనుమాన‌స్ప‌ద మృతి

Suicide: తిరుప‌తిలో చైత‌న్య కాలేజీలో ఇంట‌ర్ చ‌దువుతున్న విద్యార్థిని అనుమాన‌స్ప‌దంగా మృతి చెందిన సంఘ‌ట‌న ముత్యాల‌రెడ్డి ప‌ల్లి పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో బుధ‌వారం చోటు చేసుకుంది. కుటుంబ స‌భ్యులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం పీలేరు మండ‌లం ఎర్ర‌గుంట ప‌ల్లె గ్రామానికి చెందిన రామ‌చంద్ర‌రాజు కుమార్తె చ‌రిత్ర (17) చైత‌న్య కాలేజీలో ఇంట‌ర్ చ‌దువుతోంది. ఈ క్ర‌మంలో మంగ‌ళ‌వారం సాయంత్రం తిరుప‌తి లో తుమ్మ‌ల‌గుంట క్యాంప‌స్ నందు ఎంపీసీ మొద‌టి సంవ‌త్స‌రం చ‌దువుతున్న విద్యార్థిని క్యాంప‌స్ హాస్ట‌ల్ నందు ఉరివేసుకొని ఆత్మ‌హ‌త్య చేసుకుంది. కాలేజీ యాజ‌మాన్యం అప్ర‌మ‌త్త‌మై విద్యార్థిని రుయా ఆసుప‌త్రికి త‌ర‌లించారు. కానీ అప్ప‌టికే చ‌రిత్ర మృతి చెందిన‌ట్టు వైద్యాధికారులు ధృవీక‌రించారు. విద్యార్థి శ‌రీరంపై గాయ‌లు ఉండ‌టంతో ప‌లు అనుమానాల‌కు తావిస్తోంది. ఈ ఘ‌ట‌న‌పై చ‌రిత్ర కుటుంబ సభ్యులు ఎం.ఆర్ ప‌ల్లి పోలీస్‌స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు. ఎస్ఐ న‌ర్సింహులు కేసు న‌మోదు చేసి విద్యార్థిని మృతికి కార‌ణాల‌ను తెలుసుకునేందుకు విచార‌ణ చేప‌డుతున్నారు.

చ‌ద‌వండి :  kidnapping case: క‌ర్ణాట‌క మాజీ ముఖ్య‌మంత్రి బంధువు కిడ్నాప్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *