Current Shock

Current Shock: స్కూల్ బిల్డింగ్‌పై విద్యుత్ తీగ‌లు త‌గిలి విద్యార్థి మృతి | త‌ల్లిదండ్రులు ఆందోళ‌న‌

Spread the love

Current Shock: నందిగామ: స్కూల్ బిల్డింగ్ పై ఉన్న విద్యుత్ తీగ‌లు త‌గిలి ప‌దో త‌ర‌గ‌తి చ‌దివే విద్యార్థి అక్క‌డిక్క‌డే మృతి చెందిన సంఘ‌ట‌న కృష్ణా జిల్లా నందిగామ శివారు అనాసాగ‌రంలో బుధ‌వారం చోటు చేసుకుంది. అనాసాగ‌రం హైస్కూల్ లో ప‌దో త‌ర‌గ‌తి చ‌దివే దారం గోపిచంద్ స్కూల్ పై భాగాన ఉన్న మంచినీటి ట్యాంకులో నీరు నిండిన‌దా? లేదా? అని చూడ‌టానికి పైకి వెళ్లాడు.

ఈ క్ర‌మంలో పైన ఉన్న విద్యుత్ తీగ‌లు(Current Shock) త‌గిలి అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు విడిచాడు. విష‌యం తెలుసుకున్న త‌ల్లిదండ్రులు కుటుంబ స‌భ్యులు శోక‌సంద్రంలో మునిగిపోయారు. గ్రామంలో విషాధ చాయ‌లు అలుముకున్నాయి.

ఘ‌ట‌నా స్థ‌లానికి నందిగామ ఎమ్మెల్యే

బాలుడు మ‌ర‌ణ వార్త స‌మాచారం అందుకున్న నందిగామ ఎమ్మెల్యే మొండితోక జ‌గ‌న్మోహ‌న్‌రావు మృత‌దేహాన్ని సంద‌ర్శించారు. సంఘ‌ట‌న జ‌రిగిన వివ‌రాల గురించి సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య బాలుడి మృత‌దేహాన్ని సంద‌ర్శించి వారి కుటుంబ స‌భ్యుల‌కు ఆమె ప్ర‌గాఢ సానుభూతిని తెలియ‌జేశారు.

హైస్కులు మాస్ట‌ర్లు మంచినీరు ట్యాంక్ నిండిన‌ది, లేనిది అని చూసేందుకు వెళ్లి విద్యుత్ తీగ‌లు త‌గిలి మృతి చెందాడ‌ని ఆరోపిస్తున్న బంధువులు, ఉపాధ్యాయులు ఆరోప‌ణ‌లు వేరేలా ఉండ‌టంతో బంధువులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. పోలీసులు సంఘ‌ట‌న స్థ‌లానికి చేరుకొని కేసు న‌మోదు చేసి బాలుని మృత‌దేహాన్ని మార్చురీకి త‌ర‌లించారు.

మృతి చెందిన గోపిచంద్‌

25 ల‌క్ష‌లు అంద‌జేసి కుటుంబాన్ని ఆదుకోవాలి: ఎస్ఎఫ్ఐ

అనాసాగ‌రం ప్ర‌భుత్వ జిల్లా ప‌రిష‌త్ హైస్కూల్ లో విద్యుత్ వైర్ త‌గిలి చ‌నిపోయిన గోపిచంద్ కుటుంబానికి ప్ర‌భుత్వం రూ.25 ల‌క్ష‌లు ఇచ్చి ఆ కుటుంబానికి న్యాయం చేయాల‌ని ఎస్ఎఫ్ఐ ప‌శ్చిమ కృష్ణా జిల్లా కార్య‌ద‌ర్శి ఎం.సోమేశ్వ‌ర‌రావు డిమాండ్ చేశారు.

అనంత‌రం విజ‌య‌వాడ‌లోని కృష్ణా జిల్లా క‌లెక్ట‌ర్ జె.నివాస్, జిల్లా విద్యాశాఖ అధికారి తాహేర సుల్తానా ను క‌లిసి విన‌తిప‌త్రం అంద‌జేశారు. అనంత‌రం క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ చ‌నిపోయిన విద్యార్థి కుటుంబానికి త‌క్ష‌ణ స‌హాయం క్రింద రూ.2 ల‌క్ష‌లు ప్ర‌భుత్వం నుంచి ఇస్తున్నామ‌ని అన్నారు. ఆ కుటుంబాన్ని ఆదుకుంటామ‌ని ఎస్ఎఫ్ఐ నాయ‌కుల‌కు తెలిపారు.

ఈ ఘ‌ట‌న‌పై పూర్తి స్థాయిలో విచార‌ణ చేసి బాధ్యుల‌పై చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని విద్యాశాఖ అధికారి తహారా సుల్తానా తెలిపారు. ఎస్ఎఫ్ఐ కృష్ణా జిల్లా కార్య‌ద‌ర్శి ఎం.సోమేశ్వ‌ర‌రావు మాట్లాడుతూ విద్యార్థి మృతి చెంద‌డం బాధాక‌ర‌మ‌ని అన్నారు. పాఠ‌శాల‌లో విద్యార్థుల‌తో ప‌నులు చేయించ‌డం స‌రికాద‌ని అన్నారు. వాట‌ర్ ట్యాంక్ క‌డిగేందుకు పైకి ఎక్కించిన ప్ర‌ధానోపాధ్యాయుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు. త‌క్ష‌ణ‌మే ప్ర‌భుత్వం ఆ కుటుంబానికి న్యాయం చేయాల‌ని కోరారు. ఆయ‌న వెంట జిల్లా ఉపాధ్య‌క్షులు సి.హెచ్‌. వెంక‌టేశ్వ‌ర‌రావు, విజ‌య‌వాడ న‌గ‌ర నాయ‌కులు రాధాకృష్ణ‌, వంశీ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Latest news – krishna district : ఎన్నిక‌ల వేళ భారీగా మ‌ద్యం త‌ర‌లింపు

Latest news - krishna district :Nandigama: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రేపు(మంగ‌ళ‌వారం) తొలివిడ‌త గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌లు జ‌రగ‌నున్న నేప‌థ్యంలో కృష్ణా జిల్లాలో భారీగా మ‌ద్యం బాటిళ్ల‌ను పోలీసులు Read more

Tiruvuru Revenue Division:తిరువూరు రెవెన్యూ డివిజ‌న‌ల్ స్వాగ‌తిస్తూ సంబురాలు!

Tiruvuru Revenue Division ఎ.కంభంపాడు: కృష్ణా జిల్లా నుండి విడిపోయిన ఎన్టీఆర్ జిల్లా (విజ‌య‌వాడ‌)లో తిరువూరు నియోజ‌క‌వ‌ర్గం కేంద్రంగా తిరువూరు రెవెన్యూ డివిజ‌న‌ల్‌ను ప్ర‌భుత్వం నిర్థారించింది. దీనిని Read more

Nuzvid Covid Cases: నూజివీడు డివిజన్ లో కొత్తగా 168 కోవిడ్ కేసులు

Nuzvid Covid Cases నూజివీడు: కృష్ణా జిల్లా నూజివీడు డివిజన్ లో 28వ తేదీన కోవిడ్ కేసులు పెద్దఎత్తున నమోదయ్యాయి. 28వ తేదీ ఒక్కరోజే 168 కోవిడ్ Read more

pushpa lorry scene: పుష్పా సినిమాను త‌ల‌ద‌న్నేలా ఇసుక మాఫియా ఆగ‌డాలు

pushpa lorry scene గ‌రిక‌పాడు: పుష్పా సినిమాను త‌ల‌ద‌న్నేలా ఇసుక‌మాఫియా ఆగ‌డాలు ఏపీలో వెలుగు చూశాయి. ఏకంగా 11 ఇసుక లారీల‌ను ఆంధ్రా - తెలంగాణ స‌రిహ‌ద్దు Read more

Leave a Comment

Your email address will not be published.