Struggles in Advocate lifeభారతదేశంలో ప్రతి ఏడాది 5 వేల మంది అడ్వకేట్లు లైసెన్సు పొందుతున్నట్టు హైకోర్టు సీనియర్ న్యాయవాది గోపాల కృష్ణ కళానిధి(gopala krishna kalanidhi) పేర్కొన్నారు. కొన్ని నెలల కిందట ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో అడ్వకేట్ల కషాల గురించి తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 24 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఓ 5 వేల మంది అడ్వకేట్లకు లైసెన్సులు ఇస్తున్నట్టు తెలిపారు. అలాంటి వారు బార్ కౌన్సిల్లో (bar council of india)మెంబర్స్ అవుతున్నారని, ఆల్ ఇండియా బార్ కౌన్సిల్లో(all india bar examination) పరీక్ష రాస్తున్నారని పాసవుతున్నారు అడ్వకేట్‌గా వస్తున్నారని (Struggles in Advocate life)అన్నారు.

సివిల్ సపరేట్ సబ్జెక్ట్ అని, క్రిమినల్ సపరేట్ సబ్జెక్ట్ అని, కాన్సిట్యూషన్ సపరేట్ సపరేట్ సబ్జెక్ట్ అని, స్పెషల్ లా సపరేట్ సబ్జెక్ట్ అని తెలిపారు. అదే విధంగా మరికొన్ని సబ్జెక్టులు ఉన్నాయని, ఫైనాన్షియల్, కార్పొరేట్‌కు కూడా సపరేట్ సబ్జెక్టులు ఉన్నాయన్నారు. ఈ విధంగా దాదాపుగా 500 సబ్జెక్టులు ఉన్నాయన్నారు. ఒక న్యాయవాది గౌను(కోటు) వేసుకొని వచ్చి ఎన్రోల్మెంట్ చేసిన తర్వాత ఆ న్యాయవాదికి 500 సబ్జెక్టులపై అవగాహన కలిగి ఉండాలన్నారు. కానీ అది ఎవరీ సాధ్యం కాదని తెలిపారు. అందుకనే కొంతమంది సివిల్, క్రిమినెల్, కార్పొరేట్ లాంటివి సెలెక్ట్ చేసుకుంటారన్నారు.
సివిల్‌లో కింగ్ అవ్వాలంటే 20 సంవత్సరాల అధ్యయానం ఉండాలని, ఇంగ్లీష్ వచ్చి ఉండాలని తెలిపారు. కానీ ఇప్పుడు గూగుల్ ను ఆశ్రయించి లా చట్టాలను అనుసరిస్తున్నారని అన్నారు. ప్రస్తుతం ఉన్న అడ్వకేట్లకు టెక్నాలజీ అడ్వాంటేజ్ అన్నారు. మా రోజుల్లో మేము మోస్ట్ సీనియర్ అడ్వకేట్ వద్ద కనీసం 10 సంవత్సరాలు పనిచేసేవారమని తెలిపారు. ప్రాక్టికల్ గైడెన్స్ ఉండాలంటే సీనియర్ అడ్వకేట్ వద్ద కచ్చితంగా పనిచేయాలని అన్నారు.

ప్రస్తుతం అడ్వకేట్లు అందరూ సక్సెస్ కాలేక పోతున్నారని అన్నారు. పాపం కొందరు ఈ కాలంలో ఉదయం కోర్టు పని చేసుకుంటూ మధ్యాహ్నం నుండి రంగులు వేయడమో, ఇటికలు మోయడమో పనులు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలోని పాత బస్తీలో ఒక అడ్వకేట్ పాన్ షాప్ నడిపితే పోలీసులు పట్టుకుని కోర్టులో వేశారని తెలిపారు. అడ్వకేట్లకు ప్రభుత్వం నుండి ఎటువంటి ఆధరణ లేదని ఎలాంటి స్కాలర్ షిప్ కూడా ఇవ్వడం లేదని అన్నారు. కొందరు అడ్వకేట్లు ప్రాక్టీస్ మధ్యలో ఆపేసి దుబాయి పనికి వెళుతున్నారని అన్నారు.
అందుకనే అడ్వకేట్లలో వచ్చిన 5 వేల మందిలో 5 గురు సక్సెస్ అయినా విజయమేనని, కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అలాంటిది ఏమీ లేదని అన్నారు. పాత కాలంలో అయితే న్యాయవాదలకు పొలాలు, ఆస్తులు ఇంటి వద్ద ఉండేవని, వారికి అద్దెలు, బిల్లులు చెల్లించే అవసరం లేదని, తినడానికి తిండి ఇంటి వద్ద ఉండేదని పేర్కొన్నారు. ప్రస్తుతం నగరంలో జూబ్లీహిల్స్‌లో ఉన్న న్యాయవాదులు మాత్రమే ధనికులుగా కనిపిస్తారని అన్నారు. మా దగ్గర పనిచేసే అడ్వకేట్లకు క్లాసులు చెబుతామని, వారికి కావాల్సిన గౌను, వెహికల్ కూడా అందిస్తున్నానని, నెలకు రూ.15,000 జీతం ఇస్తున్నానని చెప్పారు. మా జూనియర్లు చాలా సంతోషంగా ఉన్నారని తెలిపారు. నా దగ్గర ఉన్న ప్రొజెక్టర్లతో ప్రతి శనివారం క్లాసులు చెబుతున్నానని చెప్పారు. కొంత మంది నాకు జీతం ఇవ్వకపోయినా పర్వాలేదు నాకు సబ్జెక్టు నేర్పండి అని వచ్చేవారు ఉన్నారని అన్నారు.

లాయర్‌గా కొనసాగాలంటే ఈ లోకంలో ధైర్యం ఉండాలని, సబ్జెక్టు ఉండాలని, చట్టలన్నీ తెలిసి ప్రశ్నించే తత్వం అలవర్చుకోవాలని అన్నారు. లాయర్‌గా కొనసాగే ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం ఎంతో కొంత సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
- world facts: తాబేలు నెత్తిన పడి గ్రీకు నాటక రచయిత మృతి ఇలాంటి ప్రపంచ వింతలు తెలుసుకోండి!
- Castor Oil for hair: జుట్టుకు ఆమదం నూనె అబ్బే అనేవారి కోసమే ఇది!
- Urinary Infections: మూత్రంలో మంట, ఇతర సమస్యలు సులవైన చిట్కాలివే!
- Husband abaddalu: మగవారు ఎక్కువుగా ఆడవారితో చెప్పే 7 అబద్ధాలు ఇవేనట?
- man beauty tips: పురుషులు అందంగా కనిపించాలంటే ఏఏ చిట్కాలు పాటించాలి?