stop eating sugar

stop eating sugar: 9 చెంచాలు మించి తిన‌కూడ‌దండోయ్‌!

Spread the love

stop eating sugar మ‌నం తినే ప‌దార్థాల‌న్నింటిలో స‌హ‌జంగానే అంతోఇంతో చ‌క్కెర ఉంటుంది. ఇది చాల‌ద‌న్న‌ట్టు రోజూ చ‌క్కెర క‌లిపిన మిఠాయిలు, కూల్ డ్రింక్‌లు, తీపి తినుబండారాల‌ను దండిగా తింటుంటాం. ఇలా చ‌క్కెర ఎక్కువెక్కువ తీసుకోవ‌డం కోరికోరి ముప్పు తెచ్చుకోవ‌డ‌మేన‌ని సాక్షాత్తూ, ఆమెరికా హార్ట్ అసోసియేష‌న్‌(ఏహెచ్ఏ) ఎప్ప‌టి నుంచో హెచ్చ‌రిస్తోంది. అయినా నానాటికి చ‌క్కెర వినియోగం పెరుగుతూనే ఉంది త‌ప్ప త‌గ్గ‌డం లేదు. దీంతో ఏహెచ్ఏ మొట్ట‌మొద‌టిసారి ఈ చ‌క్కెర వినియోగంపై ప‌రిమితులు విధించింది. రోజు మొత్తంలో స్త్రీలు 100 కేల‌రీలు, మ‌గ‌వారు 150 కేల‌రీల‌కు మించి చ‌క్కెర తీసి తిన‌రాద‌ని గీత గీసింది. అంటే పెద్ద వాళ్లు స‌గ‌టున ఏ రూపంలోనైనా 5-9 చెంచాల క‌న్నా ఎక్కువ చ‌క్కెర‌ను(stop eating sugar) తీసుకోరాదు.

అమెరికాలో ప్ర‌స్తుతం స‌గ‌టున రోజుకి 22 చెంచాల చ‌క్కెర‌… అంటే 335 కేల‌రీలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా కూల్డ్రింకులు, ఇత‌ర తీపి పానీయాల వ‌ల్ల‌నే ఈ మొత్తంగా బాగా పెరిగిపోతుంది. ఒక కోలాటిన్‌లో క‌నీసం 8 చెంచాల చ‌క్కెర ఉన్నట్టు అంచ‌నా, ఈ నేప‌థ్యంలో, ఏహెచ్ఏ సిఫారుసుల‌పై పోష‌కాహార నిపుణులు, హృద్రోగ నిపుణులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. కూల్ డ్రింకులు, ప‌ళ్ల ర‌సాల వంటి వాటి త‌యారీలోనే చ‌క్కెర త‌క్కువ ఉండేలా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని సూచిస్తున్నారు.

కూల్ డ్రింకుల వంటి తీపిపానీయాలు చాలా త్వ‌ర‌గా ర‌క్తంలో చ‌క్కెర స్థాయిని పెంచుతాయి. దీనికి తోడు అది ద్ర‌వ‌రూపంలో ఉంటుంది కాబ‌ట్టి మ‌నం ఎన్ని కేల‌రీల‌ను తీసుకుంటున్నామో స‌రిగా గుర్తించ‌డ‌మూ క‌ష్ట‌మే. ఇలా అద‌నంగా తీసుకునే చ‌క్కెర వ‌ల్ల ర‌క్త‌పోటు కూడా పెరుగుతుంద‌ని మ‌రికొన్ని అధ్య‌యానాలు చెబుతున్నాయి. కూల్‌డ్రింకుల‌తో శ‌రీరానికి అవ‌స‌ర‌మైన పోష‌కాలు ల‌భించ‌క పోగా, బ‌రువూ పెరుగుతారు. కూల్‌డ్రింక్‌లకు బ‌దుల ప‌ళ్ళ ర‌సాలు తీసుకున్నా, వాటిల్లో అప్ప‌టికే స‌హ‌జ‌మైన చ‌క్క‌ర మోతాదు ఎక్కువుగా ఉండ‌టం వ‌ల్ల ప‌రిమితిని పాటించాల‌నీ సూచిస్తున్నారు. ఇక స్వీట్ల‌ను ఎంత త‌క్కువ తీసుకుంటే అంత మంచిది.

శుద్ధి చేసిన గోధ‌ముల‌తో త‌యారయ్యే బ్రెడ్డు, పాలిష్ ప‌ట్టిన బియ్యం, బంగాల దుంప‌ల విష‌యంలోనూ జాగ్ర‌త్త‌గా ఉండ‌టం అవ‌స‌ర‌మ‌ని పోష‌కాహార నిపుణులు చెబుతున్నారు. ఇవి కూడా శ‌రీరంలో త్వ‌ర‌గా గ్లూకోజుగా మార‌తాయి. కాబ‌ట్టి జీవ‌క్రియ‌ల‌పై దుష్ఫ్ర‌భావాలు క‌ల‌గ‌జేస్తాయ‌ని చెబుతున్నారు. ఏదేమైనా చ‌క్కెర ఏరూపంలో ఉన్నా ప్ర‌మాద‌మే కాబ‌ట్టి, అద‌నంగా దీనిని తీసుకోక‌పోవ‌డ‌మే మేలు.

cholesterol and onions: కొలెస్ట్రాల్ త‌గ్గాలంటే ఉల్లిపాయ‌ను తినాల్సిందే!

cholesterol and onions కొంద‌రు వ్య‌క్తులు అధిక కొలెస్ట్రాల్ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతుంటారు. దీనికి సంబంధించి ఆరోగ్య చిట్కాలు పాటించ‌కుంటే ఊభ‌కాయంతో పాటు గుండె సంబంధిత వ్యాధులు తీవ్ర‌మ‌వుతాయి. Read more

Barley Seeds : బార్లీతో బ్ల‌డ్ షుగ‌ర్‌, గుండె నొప్పులు అదుపు!

Barley Seeds : మ‌నం తినే ఆహారంలో శ‌రీరానికి మేలు చేసే గింజ‌ల్లో బార్లీ ప్ర‌ధాన‌మైంది. ఇది ఎక్కువు పోష‌కాల‌ను క‌లిగి ఉండ‌టంతో త‌క్కువ కొలెస్ట్రాల్ ను Read more

Cool Drinks : ఇష్టంగా తాగితే..త‌ప్ప‌దు దుష్ప్ర‌భావాలు! | Cool Drinks side effects

Cool Drinks side effects : అస‌లే ఎండాకాలం దాహం కూడా ఎక్కువ అవుతుంది. ఎండ‌లు మండి పోతున్నాయి. ఈ నేప‌థ్యంలో ప్ర‌యాణాలు చేసే స‌మ‌యంలో మ‌నం Read more

Overuse of Antibiotics Effects:యాంటీభ‌యోటిక్ ముప్పు.. రానున్న కాలంలో మూడు సెక‌న్ల‌కో మ‌ర‌ణం!

Overuse of Antibiotics Effectsయాంటీ బ‌యోటిక్ ఔష‌ధాల‌కు పెరుగుతున్న నిరోధ‌క‌త‌(సూప‌ర్ బ‌గ్స్‌) కార‌ణంగా 2050 క‌ల్లా ప్ర‌పంచ వ్యాప్తంగా ఏటా కోటి మంది మృత్యువాత‌ప‌డే అవ‌కాశముంద‌ట‌. అంటే Read more

Leave a Comment

Your email address will not be published.