Stock Market loss February 2022: స్టాక్ మార్కెట్లపై యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. మరోసారి పేకమేడల్లా కుప్పకూలాయి. అంతర్జాతీయ పరిణామాలతో సెన్సెక్స్ వెయ్యి 747 పాయింట్లకు పైగా పతనమైంది. నిఫ్టీ 532 పాయింట్లు కోల్పోయింది. ఈ ఏడాది ఇదే రికార్డు స్థాయిలో నష్టపోవడం అని నిపుణులు(Stock Market loss February 2022) అంటున్నారు.
ఉక్రేయిన్- రష్యా యుద్ధం సంక్షోభం, చమురు ధరల మంట, అమెరికా ద్రవ్యోల్బణం వంటి విషయాలు స్టాక్ మార్కెట్ సూచీలను పాతాళానికి నెట్టేశాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంచీ సూచీ సెన్సెక్స్.. ఏకంగా వెయ్యి 747 పాయింట్లు నష్టపోయింది. చివరకు 56 వేల 405 వద్ద స్థిరపడింది. 30 షేర్ల సూచీలో 29 షేర్లు భారీ నష్టాలు మూటగట్టుకున్నాయి. ఇంతటి ప్రతికూల వాతావరణంలోనూ TCS Share రాణించింది. 0.81 శాతం లాభాలతో ట్రేడింగ్ ముగించింది. అటు, జాతీయ స్టాక్ ఎక్స్చేంజీ సూచీ నిఫ్టీ సైతం కుప్పకూలింది. 532 పాయింట్లు పతనమైంది. చివరకు 16 వేల 842 వద్ద ముగిసింది.

ఏ క్షణమైనా ఉక్రెయిన్పై రష్యా యుద్దానికి తెగబడనుందన్న అమెరికా హెచ్చరికలు మదుపరులను తీవ్ర భయాందోళనకు గురిచేశాయి. రష్యాతో అమెరికా సంప్రదింపులు జరిపినా పరిస్థితి తీవ్రత తగ్గకపోవడం మరింత గందరగోళానికి దారి తీసింది. మరో వైపు, చమురు ధరలు భగ్గుమంటున్నాయి. మరోవైపు చమురు ధరలు భగ్గుమంటున్నాయి. బ్యారెల్ ముడి చమురు 95 డాలర్ల సమీపంలో ఉంది. వంద డాలర్లు మైలురాయి దిశగా దూసుకెళ్తోంది. అమెరికా విడుదల చేసిన వివరాల ప్రకారం ద్రవ్యోల్భణం ఆందోళనకరంగా ఉండటం, ఫలితంగా ఫెడ్ వడ్డీ రేట్లు పెరుగుతాయన్న భయాలు మదుపర్లలో కొనసాగాయి. అటు అంతర్జాతీయ మార్కెట్ల బలహీన సంకేతాలు దేశీయ మదుపర్లపై ప్రభావం చూపాయి. దీంతో అమ్మకాలపై ఒత్తిడి పెరిగి మార్కెట్ పడిపోయింది.
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్లెస్ మటన్ బిర్యానీ తయారీ
- Manasa Devi: సర్పాలను కాపాడిన మానసాదేవి గురించి ఆధ్యాత్మిక విషయాలు
- Anemia Ayurvedic Treatment: మనిషిని కృంగదీసే వ్యాధులలో ఎనీమియా ఒకటి
- best food for heart: గుండె ఆరోగ్యంగా ఉండాలంటే తినాల్సిన ఆహారం ఇదే!