stock market telugu : స్టాక్ మార్కెట్ ఈ మాట వినగానే చాలా మంది దానిని ఒక భూతంలాగా లేదంటే ఒక జూదశాలగా చూస్తారు తప్ప దానిని ఒక Investment సాధనంగా అస్సలు చూడరు. ఎందుకంటే చాలా మంది దానిలో ప్రవేశించి రాత్రికి రాత్రి డబ్బులు సంపాదించాలనే అత్యాశ, అవగాహన లోపం మరియు సరియైన పరిజ్ఞానం లేకుండా ప్రవేశించి నష్టాల పాలు అవుతుంటారు. నిజం చెప్పాలంటే తగు పరిజ్ఞానం, మంచి ప్రణాళికతో స్టాక్ మార్కెట్‌లో ప్రవేశిస్తే దీనిలో పొందిన రాబడి ఇక మీరు ఏ ఇన్వెస్ట్‌మెంట్ సాధనంలో కూడా (stock market telugu) పొందలేరు.
stock market telugu : స్టాక్ మార్కెట్‌పై అపోహలు
మార్కెట్ అనలిస్టు (market analyst) లు చెబుతున్నమాట ఏమిటంటే.. స్టాక్ మార్కెట్‌లో ప్రవేశిస్తున్న వారిలో చాలా మంది కనీస అవగాహన లేకుండానే ప్రవేశిస్తున్నారు. దానితో వారు మార్కెట్‌లో డబ్బులు పోగొట్టుకొని అప్పుడు దానిని అది ఒక జూదశాల అని నిందిస్తూ అది మనకు అర్థం కాదు అనే ఒక అభిప్రాయానికి వచ్చేస్తారు.
మీరు పది రూపాయలు ఖర్చు పెట్టి టమాటాలు కొనేటప్పుడు ఐదు నిమిషాలు దానిలో పుచ్చులు ఉన్నాయా లేవా అని చూడటానికి కేటాయించిన మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేసి డబ్బులు సంపాదించాలంటే దానికి కూడా తగిన సమయం కేటాయించి కావాల్సిన విజ్ఞానం పొందాలనే విషయం గుర్తుంచుకోవాలి.


మీరు స్టాక్ మార్కెట్‌లో డబ్బు సంపాదించాలంటే ముందుగా మీరు లెర్నింగ్ స్టార్ట్ చేయాలి. లెర్నింగ్ చేస్తే ఏర్నింగ్ వస్తుంది. లెర్నింగ్ లేకుండా ఏర్నింగ్ ఉండదు. ఏదో పొద్దున లేచాం కంప్యూటర్ ముందు కూర్చున్నాం. ట్రేడింగ్ చేశాం.. అంటే తప్పకుండా నష్టపోవాల్సి ఉంటుంది. యద్భావం తద్భవతి అని భగవద్గీత చెప్తుంది. అనగా ఏది అనుకుంటే అదే జరుగుతుందని దాని సారాంశం. మన ఆలోచనలను బట్టే, చేసే పనులు, మన నిర్ణయాలు ఉంటాయి. మార్కెట్‌పై మనకు ప్రతికూల ఆలోచనలు, నష్టాలు వస్తాయి అనే భయం ఉంటే ప్రతికూల ఫలితాలే వస్తాయి.
Attitude is everything అనగా సమస్త విజయాలకు దృక్పథం మూలకారణం అనగా మీ ఆలోచనలలో మీరు మార్కెట్‌పై ఎల్లప్పుడూ సానుకూల దృక్పథం కలిగి ఉండాలి. అంతే కాని ప్రతికూల దృక్పథం కలిగి ఉండకూడదు. కాబట్టి ముందుగా మార్కెట్‌పై మీకు ఉండే వ్యతిరేక భావనలను వీడండి. మార్కెట్‌పై మంచి అవగాహన పెంపొందించుకొని మంచి నిర్ణయం తీసుకోండి.
ఈ నిర్ణయం తీసుకునే శక్తి రాత్రికి రాత్రి అలవడదు. నిరంతర సాధనతోనే ఇది సాధ్యం. మంచి నిర్ణయం తీసుకోవాలి అంటే ముందు మీకు మార్కెట్‌పై సమగ్రమైన అవగాహన ఉండాలి. అవగాహన రావాలంటే సమాచారం తెలిసి ఉండాలి. సమాచారం తెలియడంతో, అభ్యాసం ద్వారా అవగాహన ఏర్పడుతుంది.
ఆపై విషయ విశ్లేషణ చేసేందుకు ఆస్కారం ఏర్పాటు అవుతుంది. అప్పుడే మీరు మంచి నిర్ణయం తీసుకోగలరు. అయితే ఇది సాధన వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. మీరు తీసుకునే నిర్ణయాలను బట్టే మీకు లాభాలు సొంతం అవుతాయి. ఒక పసిపాకు తల్లిపాలు ఎంత కీలకమో, జీవులు జీవించడానికి శ్వాసించే గాలి ఎంత అవసరమో, మనిషి బ్రతకడానికి శరీరంలో రక్తం ఎంత ముఖ్యమో, డబ్బు కూడా అంతే. అలాంటి డబ్బు సంపాదించాలంటే నిబద్ధత కావాలి.


స్టాక్ మార్కెట్‌లో ఎప్పుడూ ఒకరిని గుడ్డిగా అనుకరించవద్దు. స్నేహితుడు కొన్నాడు అని ఇంకా ఎవరో ఏదో చెప్పారు అని స్టాక్‌లను కొనడం కాకుండా అందులోని సత్యాసత్యాలు తెలుసుకోవడం చేయాలి. మీరు జీవితంలో ఏదైనా వ్యాపారం చేసి మంచి లాభాలు అందుకోవాలి అనుకుంటే, ఆ వ్యాపారం గురించి ఎన్నో వివరాలు కష్టపడి సేకరిస్తారు. కాని స్టాక్ మార్కెట్ కూడా లాభాలు అందించే సాధనం అయినప్పటికీ మీరు దాని గురించి కనీసం సమాచార సేకరణ కూడా చేయరు. అటువంటప్పుడు మీరు లాభాలు ఎలా అందుకోగలరు? .
స్టాక్ మార్కెట్‌ను కూడా వ్యాపారం లాగా భావించి ఇన్వెస్ట్ చేయాలి. మీరు stock మార్కెట్‌లో నష్టపోయిన వ్యక్తులను ఎవరినైనా గమనించండి. ఒక స్టాక్‌ను ట్రేడింగ్ కొరకు కాని ఇన్వెస్ట్‌మెంట్ కొరకు కాని కొంటున్నప్పుడు ఆ స్టాక్‌ను కొనడానికి గల సరియైన కారణం వివరించగలరో చూడండి. చాలా మంది వివరించలేరు. అలాంటప్పుడు నష్టాలు రాకుండా లాభాలు వస్తాయా? ఇక రిస్కు అంటారా! రోడ్డు మీద నడవడం రిస్కుతో కూడుకున్నదే. అంతరిక్షంలోకి వెళ్లడమూ రిస్కే. రిస్క్ ఎందుకని కూర్చుంటే సైన్స్ ఇంతగా ఎదిగేది కాదు. మానవ జీవితాలు ఇంత సుఖంగా గడిచేవి కావు.
రిస్క్ తీసుకొనేవారికే కాని..
ఆర్థికంగా, సామాజికంగా, వ్యక్తిగతంగా ఎలా ఎదగాలన్నా అందులో రిస్కు ఉంటుంది. అవకాశాలు అంది వచ్చేది రిస్క్ తీసుకొనేవారికే కాని, ఇక్కడ మీరు గమనించవలసిన విషయం రిస్కు తీసుకునే ముందు మీరు పూర్తిగా మార్కెట్ గురించి అధ్యయనం చేయండి. తగినంత నిద్రపోవాలి అనుకుంటే అర్ధరాత్రి టెలివిజన్ వదలాల్సిందే. పరీక్షల్లో మార్కులు కావాలి అంటే పరీక్షలకు కొద్ది రోజుల ముందు నుండే సినిమాలు, షికార్లు తగ్గించాల్సిందే. అదే విధంగా షేర్ మార్కెట్‌లో లాభాలు పొందాలంటే మీరు కష్టపడి మార్కెట్ గురించి తెలుసుకోవాల్సిందే.


మీరు మార్కెట్‌పై పూర్తి అవగామన కలిగే వరకు కొన్నాళ్లు పేపర్ ట్రేడింగ్ చేయండి. అనగా మీరు ఏదైనా స్టాక్ కొనాలి అనుకున్నప్పుడు ఆ స్టాక్ ఎందుకు కొనాలి అనుకుంటున్నారు. దాని టార్గెట్ ప్రైస్‌ని ఎంత కాలంలో చేరుకోగలదు. టార్గెట్‌ను చేరుకున్నది లేనిది మొదలగు వివరాలతో కొంతకాలం పాటు అభ్యాసం చేయండి.
మీపై మీకు నమ్మకం ఏర్పాటైన తర్వాత అప్పుడు stock market telugu లోకి దిగండి. ఈ రకంగా అభ్యాసం చేసే సమయంలో టెక్నికల్ అనాలసిస్ సహాయం తీసుకోండి. మీపై మీకు విశ్వాసం కలిగినప్పుడు మాత్రమే మీకు ఏ రంగంలోనైనా విజయం సాధించగలరు. ఆల్ ది బెస్ట్.