stock market investment for beginners: పెట్టుబ‌డి(ఇన్వెస్టింగ్‌) అంటే ఏమిటి?

stock market investment for beginners రేప‌టి జీవ‌నం ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా సాగాలంటే భ‌విష్య‌త్తు లో వ‌చ్చే ఆదాయం కోసం మ‌నం సంపాదించిన సంప‌ద‌లో మ‌న ఖ‌ర్చులు పోగా మిగిలిన సంప‌ద‌ను పెట్టుబ‌డిగా పెట్టి మ‌రింత సంప‌ద‌ను పొంద‌డ‌మే పెట్టుబ‌డి.

ఈ పెట్టుబ‌డి అనున‌ది మ‌నం స్థిరాస్తి, బ్యాంకు డిపాజిట్లు, వ‌డ్డీ ఆదాయం, అద్దె ఆదాయం, షేర్స్‌, మ్యూచువ‌ల్ ఫండ్స్‌, బాండ్స్‌, సేవింగ్ స‌ర్టిఫికేట్లు, వివిధ పోస్టు ఆఫీసు ప‌థ‌కాలు, బంగారం మొద‌ల‌గు వాటిలో పెడ‌తాం. మ‌న పెట్టుబ‌డి ఒక ముఖ్య ఉద్దేశం సంప‌ద సృష్టించ‌డం దానితో పిల్ల‌ల క‌ళాశాల ఫీజులు, పెళ్లిళ్లు, సెల‌వులో స‌ర‌దగా గ‌డ‌ప‌డం, మంచి జీవ‌న ప్ర‌మాణానికి రిటైర్మెంట్ త‌ర్వాత జీవితం సాఫీగా జ‌రిగేందుకు మీ అనంత‌రం ఈ సంప‌ద మీ త‌ర‌లా వారికి చేర్చ‌డం గా (stock market investment for beginners)చెప్పుకోవ‌చ్చు.

stock market investment: పెట్టుబ‌డి(ఇన్వెస్టింగ్‌) అంటే ఏమిటి?

ఈ పెట్టుబ‌డి వ‌ల్ల వ‌చ్చే రాబ‌డి పెరుగుతున్న‌ద్ర‌వ్యోల్భ‌నం కంటే అధికంగా ఉండాలి. ఎప్పుడైనా స‌రే సంప‌ద‌ను కాపాడ‌టం మ‌రియు దానిని అభివృద్ధి చేయ‌డం అనేది ఒక క‌ళ‌. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబ‌డి వ‌ల్ల మీరు మిగ‌తా వాటిలో పొందిన రాబ‌డి కంటే అధిక రాబ‌డి పొంద‌గ‌ల‌రు కాని దీనికి మీకు స్టాక్ మార్కెట్ పై ప‌రిపూర్ణ జ్ఞానం. దీర్ఘ‌కాలిక పెట్టుబ‌డి వ్యూహం స‌రియైన స్టాక్‌ను ఎన్నుకోవ‌డం మొద‌ల‌గు వాటి మీద ఆధార‌ప‌డి ఉంటుంది. మీరు పెట్టుబ‌డి అనున‌ది మీ సంపాద‌న మొద‌లైన తొలినాళ్ల నుండే క్ర‌మ ప‌ద్ధ‌తిలో దీర్ఘ‌కాలిక వ్యూహంతో మొద‌లు పెట్టాలి.

మీరు తొలినాళ్ల నుండే మొద‌లు పెడితే అనుకో కుండా జ‌రిగే ఎలాంటి రిస్కుల‌ను అయినా తట్టుకోగ‌ల‌రు. అంతే కాకుండా ఒక వేళ మీరు మీ రిటైర్మెంట్ నాటికి యాభై ల‌క్ష‌లు సంపాదించ‌డం మీ ల‌క్ష్యం ఐతే మీరు మీ సంపాద‌న తొలినాళ్ల నుండి పెట్టుబ‌డి మొద‌లు పెడితే మీ ల‌క్ష్యం చేరుకోవ‌డం చాలా సుల‌భం అవుతుంది. మార్కెట్లో పెట్టుబ‌డులు అంటే రిస్క్ అంటారు. స్థిరాస్థి బంగారం, చివ‌ర‌కు మ‌న‌కు అన్నం పెట్టే రైత‌న్న చేసే వ్య‌వ‌సాయం లో కూడా ఎంతో రిస్కు ఉంది.

stock market investment

పండించే పంట చేతికి వ‌చ్చే వ‌ర‌కు అనుక్ష‌ణం రిస్కు, వాన‌లు లేక‌పోవ‌డం, అధిక వాన‌లు, విద్యుత్ స‌మ‌స్య‌, పురుగులు ప‌ట్ట‌డం, మ‌ద్ధ‌తు ద‌ర మొద‌ల‌గు రూపాల‌లో రిస్కు ఉంటుంది. ఇదే విధంగా మీరు ఏ రంగంలో తీసుకున్న రిస్కు అనేది త‌ప్ప‌కుండా ఉంటుంది. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబ‌డులంటే ఏమిటి? అని సాధార‌ణ పౌరుడు ప్ర‌శ్నిస్తే జూదం, లాట‌రీ, పేకాట గుర్ర‌పు పందెంలాంటి స‌మాధానాలు రావ‌చ్చు. కానీ నిజానికి అది అపోహ మాత్ర‌మే. లాట‌రీ, గుర్ర‌పు పందేలు గెల‌వ‌డానికి అదృష్టం కావాలి.

కాని, స్టాక్ మార్కెట్లో డ‌బ్బు సంపాదించ‌డానికి అవ‌గాహ‌న‌, మార్కెట్ రిస్కుల‌ను ముందే ప‌సిగ‌ట్ట‌గ‌ల కాసింత జ్ఞానం కావాలి. స్టాక్ మార్కెట్ అనేది మంచి పెట్టుబ‌డి సాధ‌నం. చ‌క్క‌టి ప్ర‌ణాళిక ద్వారా, క్ర‌మ ప‌ద్ధ‌తిలో స‌మ‌ర్థ‌వంతంగా పెట్టుబ‌డి పెడితే చ‌ట్ట‌బ‌ద్ధంగా స్టాక్ మార్కెట్‌లో సంపాదించిన సంప‌ద‌ను ఇంకా దేనిలోనూ సంపాదించ‌లేము. స్టాక్ మార్కెట్ అంటే జూదం అన్న భావ‌న విడ‌నాడి పెట్టుబ‌డుల‌కు ఉప‌యోగ‌మైన వేదిక‌గా భావించాలి.

Share link

Leave a Comment