stock market cycle

stock market cycle: స్టాక్ మార్కెట్ సైకిల్‌, స్టేజెస్‌

stock market course
Share link

stock market cycle: సాధార‌ణంగా స్టాక్ మార్కెట్ లేదా ఏదైనా స్టాక్ కాని నాలుగు Stagesల‌లో క‌దిలిక జ‌రుపు తుంది. ముందుగా మీరు మార్కెట్‌ను లేదా స్టాక్‌ను ఏ స్టేజ్‌లో ఉంది అనేది కాని గుర్తు ప‌ట్ట‌గ‌లిగితే మీరు లాంగ్ పొజిష‌న్ తీసుకోవాలా?, షార్ట్ పొజిష‌న్ తీసుకోవాలా?, లేదా చేతిలో క్యాష్ పెట్టుకుని అవ‌కాశం కోసం వేచి ఉండాలో నిర్ణ‌యించుకోవ‌చ్చు.

stock market cycle: స్టేజీ 1

స్టేజీ వ‌న్ డౌన్ ట్రెండ్ ముగింపు స‌మ‌యంలో ఏర్పాటు కావ‌డం జ‌రుగుతుంది. Down Trend చివ‌ర‌లో మార్కెట్ ప‌త‌నం త‌గ్గిపోవ‌డంతో, సెల్ల‌ర్స్ కూడా త‌గ్గిపోయి మెల్ల‌గా బ‌య్య‌ర్స్ ప్ర‌వేశించ‌డంతో మార్కెట్ సైడ్ వేస్‌లో క‌దల‌డం జ‌రుగుతుంది. అన‌గా ఈ స‌మ‌యంలో మార్కెట్ ఏ విధ‌మైన ట్రెండ్ లేకుండా ఉంటుంది. అన‌గా ఈ స‌మ‌యంలో కొత్త ట్రెండ్‌కు పునాది ఏర్పాటు జ‌రుగుతుంది.

స్టేజీ 2

స్టేజీ వ‌న్‌లో సైడ్ వేస్‌లో క‌ద‌లాడిన Market చివ‌ర‌కు స్టేజీ 2లో అప్ ట్రెండ్లో ప్ర‌వేశిస్తుంది. కానీ, మార్కెట్ అప్ ట్రెండ్‌లోకి ప్ర‌వేశించ‌డాన్ని అంద‌రూ సందేహ‌ప‌డుతుంటారు. ఎందుకంటే ఇంత‌వ‌ర‌కూ మార్కెట్ డౌన్‌ట్రెండ్‌లో కొన‌సాగ‌డంతో మార్కెట్‌లోకి ప్ర‌వేశించ‌డానికి భ‌య‌ప‌డుతుంటారు. కానీ మార్కెట్‌ను అంచ‌నా వేయ‌గ‌లిన ప్రొఫెన‌ల్స్ అప్ప‌టికే మార్కెట్‌లోకి ప్రవేశించి స్టేజీ త్రీలో వారి వ‌ద్ద గ‌ల Stocks అమ్ముకోవ‌డం కొర‌కు స్టేజీ త్రీ గురించి ఎదురుచూస్తుంటారు.

stock market cycle: స్టేజీ 3

స్టేజ్ టూలో మార్కెట్ మంచి అప్ ట్రెండ్‌లో కొన‌సాగ‌డంతో ఇక సాధార‌ణ Investors అంద‌రూ కూడా మార్కెట్‌లోకి ప్ర‌వేశిస్తుంటారు. ఈ స‌మ‌యంలో మార్కెట్ మ‌ర‌ల సైడ్ వేస్‌లో క‌ద‌ల‌డం జ‌రుగుతుంది. ప్రొఫెష‌న‌ల్స్ మెల్ల‌గా వారి లాంగ్ పొజిష‌న్స్ నుండి బ‌య‌ట‌కు వ‌చ్చి షార్ట్ పొజిష‌న్స్ తీసుకోవ‌డం మొద‌లు పెడ‌తారు.

stock market cycle
స్టేజీ 4

స్టేజీ ఫోర్‌లో మ‌ర‌లా డౌన్ ట్రెండ్ ప్రారంభం అవుతుంది. మార్కెట్ ప‌త‌కం కావ‌డం ప్రారంభించ‌బ‌డటంతో సాధార‌ణ ఇన్వెస్ట‌ర్ మార్కెట్‌లోకి ఎంట‌ర్ కావ‌డానికి దొరికిన అవ‌కాశంగా భావిస్తాడే త‌ప్ప డౌన్ ట్రెండ్ ప్రారంభం కాబ‌డిన‌ది అని మాత్రం న‌మ్మ‌డు. అంతే కాకుండా స్టేజీ టూ, స్టేజీ త్రీ లో కొన్న స్టాక్స్ కూడా మార్కెట్ ఎంత క్రింద‌కి దిగ‌జారుతున్న అలాగే అట్టిపెంట్టుకోవ‌డంతో చివ‌ర‌కు న‌ష్టాలు పాలు అవుతాడు.

పైన ఇవ్వ‌బ‌డిన చార్ట్‌లో ఒక్క‌సారి మీరు స్టేజ్‌ల‌ను గ‌మ‌నించ‌వ‌చ్చు. కావున మీరు మార్కెట్ లేదా స్టాక్స్ యొక్క స్టేజీల‌ను గుర్తు ప‌ట్ట‌డం నేర్చుకోవ‌డానికి ముందుగా Technical Analysis నేర్చుకోవ‌డం ప్రారంభించండి. Note: స్టాక్ మార్కెట్‌కు సంబంధించిన కోర్సు ఈ వెబ్‌సైట్‌లో తెలుగులో అందుబాటులో ఉంది. స్టాక్ మార్కెట్‌కు సంబంధించిన అన్ని సందేహాలు ఇక్క‌డ చ‌దివి పూర్తిగా అర్థం చేసుకోవ‌చ్చు.

See also  stock market investment for beginners: పెట్టుబ‌డి(ఇన్వెస్టింగ్‌) అంటే ఏమిటి?

Leave a Reply

Your email address will not be published.