Stephen Raveendra: హైదరాబాద్: తెలంగాణ కేడర్ ఐపీఎస్ అధికారి స్టీఫెన్ రవీంద్రను ఏపీకి తీసుకురావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రయత్నాలు దాదాపు ఫలించినప్పటికీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన ఆశలపై నీళ్లు చల్లారు. నిజానికి రవీంద్రను ఆంధ్రప్రదేశ్ కు తీసుకెళ్లేందుకు కేంద్రం నుంచి అనుమతి అవసరం.
దీంతో వైసీపీ పెద్దలు కేంద్రంతో మంతనాలు జరిపి ఒప్పించారు. స్వయంగా ఈ విషయంలో అమిత్ షాతోనూ మాట్లాడారు. జగన్ మొర ఆలకించిన కేంద్రం స్టీఫెన్ రవీంద్ర(Stephen Raveendra)ను ఏపీకి పంపేందుకు ఒకే కూడా చెప్పింది. కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో రవీంద్రకు నిఘా విభాగం బాధ్యతలు అప్పగించాలని జగన్ భావించారు.
గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి భద్రతా వ్యవహారాలను స్టీఫెన్ పర్యవేక్షించారు. రాయలసీమ జిల్లాల్లో పనిచేసిన అనుభవం ఉంది. ఈ నేపథ్యంలో ఆయనకు ఇంటెలిజెన్స్ బాధ్యతలు కట్టబెట్టాలనుకున్నారు. మరో వైపు, రవీంద్రను ఏపీకి పంపేందుకు కేసీఆర్ కూడా అంగీరించారు.
ఈ కథ అంతా జరుగుతున్న సమయంలో జగన్, కేసీఆర్ మధ్య సత్సంబంధాలున్నాయి. దీంతో స్టీఫెన్ ను డిప్యుటేషన్‌పై పంపించాలని కోరడంతో తెలంగాణ ప్రభుత్వం అంగీకరించింది. డిప్యుటేషన్ కు తెలంగాణ సర్కారు ఆమోదం తెలిపిన తర్వాత స్టీఫెన్ రవీంద్ర సెలవుపై వెళ్లారు.


ఆయన ఏపీ ఇంటెలిజెన్స్, పోలీసు వర్గాలతో టచ్‌లో ఉన్నారనే ప్రచారం కూడా జరిగింది. డీవోపీటీ ఆమోదం లభించిన వెంటనే ఆయన ఏపీలో ఇంటిలిజెన్స్ చీఫ్‌గా బాధ్యతలు చేపడతారని అందరూ అనుకున్నారు. అయితే అంతలోనే ఏమైందో గానీ ఆ తర్వాత కేంద్రం నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవడంతో రవీంద్రను తెలంగాణలోనే ఐజీ హోదాలో పనిచేశారు.
ఆయనకు ఎలాంటి కీలకమైన బాద్యతలు అప్పగించలేదు. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం కూడా కేంద్రం నుంచి ప్రకటన వస్తే ఏపీకి పంపాలని నిర్ణయానికి కట్టుబడి ఆయనకు కీలకమైన బాధ్యతలు అప్పగించలేదనే ప్రచారం కూడా జరిగింది.
విమర్శలకు కేసీఆర్ చెక్ పెట్టాలనేనా?
ఇటీవల తెలంగాణ, ఏపీ మద్య నీళ్లు చిచ్చు రేగింది. ఈ క్రమంలో ఏపీ నిర్ణయాలను కేసీఆర్ కూడా విమర్శించారు. ఒక విధంగా చెప్పాలంటే నీళ్ల పంచాయతీ ఇద్దరు సీఎంల మధ్య ఎడబాటును పెంచిందనే వాదన కూడా ఉంది.
ఈ క్రమంలోనే తెలంగాణలో పనిచేస్తున్న దళిత ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు ప్రభుత్వ విధానాలను తప్పుబడుతూ స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు కూడా. వీరితో పాటుగా ప్రతిపక్షాలు కూడా సీఎం దళిత అధికారులకు కీలకమైన బాధ్యతలు అప్పగించడం లేదనే విమర్శలు కూడా చేశారు.
అటు ప్రతిపక్షాలకు, ఇటు అధికారుల విమర్శలకు కేసీఆర్ చెక్ పెట్టాలని అనుకున్నారు. అందులో భాగంగా ఐఏఎస్ రాహుల్ బొజ్జకు సీఎం సెక్రటరీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం దళిత బంధును రాహుల్ బొజ్జ పర్యవేక్షిస్తున్నారు. రాహుల్ బొజ్జా మంచి వ్యక్తి అని, ఆయనను ఈ పథకం అమలు కోసం కమిషనర్‌గా పెట్టుకున్నామని స్వయంగా సీఎం కేసీఆరే ప్రకటన కూడా చేశారు.


రాహుల్‌పై ఆయన తండ్రి బొజ్జా తారకంపై ప్రశంసలు కురిపించారు. రాహుల్ తో పాటు మరికొందరు దళిత అధికారులకు కీలకమైన బాధ్యతలు అప్పగించాలని అనుకున్నారట. ముందుగా స్టీఫెన్ రవీంద్రకు తెలంగాణ ఇంటలిజెన్స్ చీఫ్ గా బాధ్యతలు అప్పగించాలని కేసీఆర్ అనుకున్నారట. అందుకు స్టీఫెన్ సమ్మతించలేదట.
దీంతో తెలంగాణ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి అనిల్ కుమార్‌ను ప్రభుత్వం నియమించింది. స్టీఫెన్ తన నిర్ణయాన్ని తెలపడంతో ఆయనకు సైబరాబాద్ సీపీగా బాధ్యతలు అప్పగించారు. రవీంద్రపై ఎన్నో ఆశలు పెట్టుకున్న సీఎం జగన్ ఆశలు నిరాశగానే మిగిలిపోయాయి.
- ML Jaisimha: క్రికెట్ చరిత్రలోనే అతనో సింహం!
- Memory Improve: జ్ఞాపకశక్తి పెరగాలంటే ఏం చేయాలి?
- Walking Style: హంస నడకదాన్నా..! నువ్వు నడుస్తు ఉంటే నిలవదు నా మనసే!
- Amba Story: భీష్ముడిపై అంబ ఎలా పగతీర్చుకున్నది? పురాణ గాథ స్టోరీ
- Adivasi Homes: అరణ్యంలో ఆదివాసీల ఇల్లు కట్టుకోవడం చూస్తే ఇంజనీరింగ్ కూడా చాలడు!