state bank of indiaగుంటూరు: జిల్లాలోని కారంపూడి మండలంలోని కారంపూడి గ్రామంలో భారతీయ స్టేట్ బ్యాంక్ లో భారీగా స్కాం జరిగినట్టు సమాచారం. నకిలీ బంగారం తాకట్టు, వ్యవసాయ ఆధారిత రుణాలలో సుమారు కోటిన్నర స్వాహా చేసిన ఉద్యోగి ఈ అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలాగే ఆరోపణలపై స్పందించిన బ్యాంక్ మేనేజర్ పాత్రపై కూడా పలు అనుమానాలు ఉన్నట్టుగా (state bank of india)సమాచారం.
సుమారు పది రోజులు ఎంక్వేయిరీ చేసినా కూడా మీడియాకు గాని ప్రజలకు తెలియకుండా కప్పి పుచ్చినట్టు తెలుస్తోంది. బ్రాంచ్ మేనేజర్ మా బ్యాంకులో ఏమీ జరగలేదు.. అంటూ కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం. దీంతో ఆర్బిఐ టీం(RBI Team) రీజినల్ ఆఫీస్ అధికారులు రంగంలోకి దిగి శోధించడంతో నగదు పర్వం వెలుగు చూసినట్టు తెలుస్తోంది. గత మూడు నెలలుగా బ్యాంకు ఏటిఎంలో పెట్టడానికి బ్యాంకు నుంచి తీసుకెళ్లే నగదులో కొంత స్వాహా చేస్తూ మిగతాది ఏటిఎం(ATM) మిషన్‌లో పెడుతూ ఓ బ్యాంకు ఉద్యోగి స్వాహాకు పాల్పడ్డానే వార్తలు వినిపిస్తున్నాయి.
ఇలా మూడు నెలల కాలంలో సుమారు కోటికిపైగా దారి మళ్లించారనే ఆరోపణలు ఉన్నాయి. తనిఖీలకు వచ్చిన అధికారులు గత నాలుగో తేదీ నుంచి తనిఖీ జరుగుతున్న ఖాతాలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా బ్యాంకుని యథావిధిగా జరుపుకుంటున్న క్షణంలో ఈ విషయం బయటకు పొక్కిందని తెలు స్తోంది. స్కాం జరిగిందా? లేదా? అనేది అధికారింగా ఇప్పటి వరకు అధికారులు చెప్పలేదు. విచారణ జరిగితే గానీ అసలు వాస్తవాలు బయటపడే అవకాశం ఉంది.
- Company IPO: కంపెనీ ఐపిఓలను ఎందుకు జారీ చేస్తుంది?
- Technical Analysis: స్టాక్ మార్కెట్ టెక్నికల్ అనాలసిస్ అంటే ఏమిటి?
- trailing stop loss:ట్రైలింగ్ స్టాప్‌లాస్ ఎలా ఉపయోగించాలి? | stock market
- stock market cycle: స్టాక్ మార్కెట్ సైకిల్, స్టేజెస్
- Munugode By Elections 2022: నా త్యాగం మునగోడు అభివృద్ధికి శ్రీకారమంటున్న రాజగోపాల్ రెడ్డి!