Starting New Job tips ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచంలో ఉద్యోగ మార్పు సర్వసాధారణమైనది. అది జీతం సరిగ్గా లేకపోవడం వల్లనో, పని ఒత్తిడి పెరగడం వల్లనో, కుటుంబంతో గడపకపోవడం వల్లనో, ప్రమోషన్ తదితర కారణాల విషయాలతో మరో జాబ్(New Job)లోకి చేరిపోతున్నారు. అయితే కొత్త ప్రదేశానికి జాబ్(New Job) చేయడానికి వెళ్లి అక్కడ వాతావరణాన్ని అలవాటు చేసుకొని అక్కడ ఆఫీసులో వ్యక్తులతో కలిసిపోయే వారు దాదాపు తక్కువ మందే ఉంటారు. అయితే కొంత మందికి కొత్త వాతావరణంలో గడపడం అంటే పెద్ద సమస్యగా ఉంటుంది. దీంతో ప్రతి రోజూ కుటుంబానిక ఫోన్ చేసి తమ బెంగను చెప్పుకుంటూ బాధపడుతుంటారు. (Starting New Job tips)అయితే ఈ సమస్య పోవడానికి కొన్ని పద్దతులు అనుసరిస్తే చాలు, మీ సమస్యకు పరిష్కారం దొరికినట్టే.

మీకు లభించిన కొత్త అవకాశం మిమ్మల్ని మీరు నిరూపించుకునేందుకు, మీలో ఉన్న ప్రతిభను బయట పెట్టేందుకు ఒక ఆయుధంగా భావించండి. మారిన వాతావరణం మీలో కొత్త కోణాన్ని ఆవిష్కరించు కోవడానికి, సృజనాత్మకతను బయట పెట్టుకోవడానికి ఉపకరిస్తుందేమో మిమ్మల్ని మీరే ఒక్కసారి ప్రశ్నించుకోండి. అలాంటి పరిస్థితులు ఉంటే దానిపైనా దృష్టి పెట్టి ఆ వాతావరణాన్ని చక్కగా వినియోగించుకోండి. ఈ కోణంలో ఆలోచిస్తే ఇక మీకు కొత్త ప్రదేశం, కొత్త వాతావరణం మరింత ఉత్సాహనిస్తుంది. మీ ఉద్యోగం(New Job)తో పాటు జీవితమూ కొత్తకొత్తగా సాగిపోతుంది.
హుషారుగా ఉండండి!
మీరు ఎల్లప్పుడూ నవ్వుతూ, హుషారుగా ఉండటానికి ప్రయత్నించండి. పనిచేస్తున్నా మొహంలో చిరునవ్వు ఛాయలు చెరగనీయకండి. ఇది ఎవరికోసమో కాదు, మీ కోసమే. ఎందుకంటే ఆ నవ్వు మీకు పనిచేసుకుపోయే శక్తిని ఇస్తుంది. తోటి ఉద్యోగస్థులతో స్నేహపూర్వకంగా మెలగండి. మీతో పనిచేసే మీ సహోద్యోగుల గురించి వారి అభిరుచుల గురించి తెలుసుకోండి. మధ్యాహ్న భోజనం సమయంలో అందరితో కలిసి కూర్చొని మాట కలపండి. మీ మనస్తత్వానికి తగిన స్నేహితులెవరో మీరిట్టే పసిగట్టవచ్చు. ఆ తర్వాత మీకు అందరితోనూ మాట కలిసాక ఇక కొత్త ఏముంటుంది?.

చాడీలు చెప్పవద్దు!
వాస్తవానికి మీకు పనిచెప్పాల్సిన బాస్ ఎవరో, కావాలని మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి, పరీక్షించడానికి అనవసర పెత్తనం చేస్తూ పనిచెప్పే వారు ఎవరో కచ్చితంగా తెలుసుకోండి. అప్పుడే మీపై ఎలాంటి ఒత్తిడి లేకుండా జాగ్రత్త పడగలుగుతారు. మీరు చేయవల్సిన పనులు, నిర్వర్తించవల్సిన విధులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు. మీరు ఎవరికి సమాధానం చెప్పాలో, ఏ పని ఎప్పుడు పూర్తి చేయాలో అనే విషయాలపై కచ్చితంగా ప్రణాళిక వేసుకోవడమూ సులవవుతుంది. చాడీలు చెబుతూ, ఇక్కడి విషయాలు అక్కడికి, అక్కడ విషయాలు ఇక్కడికి చేరవేస్తూ పబ్బంగడిపే వాళ్లను ముందుగానే గ్రహించండి. వాళ్లతో ఎక్కువుగా మీ అభిప్రాయాలను పంచుకోకుండా జాగ్రత్తపడండి. అంతే కాదు కనిపించిన ప్రతిఒక్కరితోనూ ఏదో ఒక విషయంలో గంటలు గంటలు కబుర్లు చెబుతూ సొల్లు కబుర్లు చెప్పే వారిగా ముద్రపడిపోకండి. అవసరమైనంత మేరకు ఎవరిదగ్గర మాట్లాడాలో అక్కడే మాట్లాడుతూ, నచ్చిన మీరు మెచ్చిన వారితో మీ ఫీలింగ్స్‌ను షేర్ చేసుకుంటూ హాయిగా పనిచేసుకుపోతుంటే కొత్త ప్రదేశం అనే భావన పోయి నిత్యనూతనం అనిపిస్తుంది.

మీ బాస్‌ల గురించి ఎక్కడా మాట్లాడవద్దు!
మీ బాస్ గురించి మీ సహోద్యోగుల దగ్గర, మీ ఆఫీసు వర్కర్స్ దగ్గర ఫిర్యాదు చేస్తూ మాట్లాడవద్దు. గతంలో మీరు ఉద్యోగం చేసిన చోట బాస్ గురించి కూడా ప్రస్తుతమున్న ఆఫీసులో ఎవరితోనూ వ్యతిరేక ధోరణిలో మాట్లాడవద్దు. నిజానికి అవి మీకు ఎలాంటి మేలూ చేయవు. రిజర్వర్డ్గా ఉన్నప్పుడే మీకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుందని గుర్తించుకోండి. మీ పనులు త్వరగా ముగించుకొని సమయానికి ఇంటికి వెళ్లిపోవాలనుకోవడం మంచితే. అలా పనిచేసుకుపోవడం మీకు చురుకైన వ్యక్తిగా మంచిపేరునూ తెచ్చి పెడుతుంది. అయితే ఇంటికి వెళ్లడానికి ఉన్న రెండు నిమిషాలు ఎప్పుడవుతుందా? అని గేటు దగ్గర వేచిచూడటం మాత్రం అలవాటు చేసుకోకండి. అది మీకు ఆఫీసు పనిమీద ఆసక్తి లేదనే సందేశాన్ని అవతలివారికి పంపిస్తుంది. మీకు మీరుగా సమర్థంగా నిర్వహించగలరనుకున్న పనుల గురించి మీ బాస్‌తో మాట్లడవచ్చు. అది మీలో సామర్థ్యాన్ని పెంచుకునేందుకు కూడా ఉపకరిస్తుంది.

అలాగని మీకు అప్పగించిన పనిచేయడంలో మాత్రం ఎలాంటి ఆలస్యం ప్రదర్శించకండి. ఎక్కడ పనిచేసిన పాజిటివ్ దృక్ఫథం తోనే ఆలోచించండి. లేదంటే కొత్త ప్రదేశమైనా, పాత ప్రదేశమైనా పనిచేయడం ఒక సమస్యగానే పరిణమిస్తుంది. అలాగే ఓపెన్ మైండ్‌తో ఉండటం వల్ల ఎవరి నుంచి ఎలాంటి చికాకులూ ఎదురు కావు. కొత్త ఉద్యోగం అనేది మీరు అనుకుంటున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి లభించిన ఒక కొత్త అవకాశంగానూ, మరొక కొత్త కోణాన్ని ఆవిష్కరించడానికి అనుకూల వాతావరణంగానూ భావించండి.
ఆఫీసులో ఆరోగ్యంగా ఉండాలంటే?
1. ఈ కాలంలో త్వరగా అలసట వస్తుంది. ఆఫీసులో ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండాలంటే జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవాలి. మరికొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముందుగా.. డీహైడ్రేన్ బారిన పడకుండా చూసుకోవాలి. నీళ్లతో పాటు పండ్లూ, పండ్ల రసాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. ముఖ్యంగా తర్పూజా, పుచ్చ కాయ, కీరా, ద్రాక్ష వంటివి తినాలి. ఒత్తిడి అనిపించినప్పుడు గ్లాసెడు నీళ్లు తాగి చూడండి, ఫలితం కనిపిస్తుంది.
2. అల్పాహారం తప్పనిసరిగా దగ్గర ఉంచుకోవాలి. ఈ కాలంలో త్వరగా ఆకలి వేస్తుంది. ఉడికించిన గుడ్డు, కొన్ని పండ్ల ముక్కలూ తీసుకుంటే మరింత మేలు. ఓట్స్ , గారి జావ వంటివి తాగినా ఫలితం ఉంటుంది. రాత్రి మిగిలిన ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి.
3. కార్యాలయంలో భోజనం కూడా ఏదో చేశామంటే చేశాం అని కాకుండా, ఈ కాలంలో ఆరోగ్యానికి మేలు చేసే పదార్థాలను చేర్చుకోవాలి. అతిగా తినకుండా, పొట్టలో కాస్త ఖాళీ ఉండేలా చూసుకోవాలి. ఆఫీసులో ఉన్న సమ యంలో సలాడ్లు, పచ్చికూరగాయ ముక్కలు, పండ్లు, ఏదైనా సూప్ తీసుకోవడానికి ప్రాధన్యమివ్వాలి. ప్రోటీన్లు ఎక్కువుగా అందడం వల్ల తర్వగా ఉత్సాహం వస్తుంది. నీరసం దరిచేరదు.
4. ఎంత పని ఉన్నా.. ఒత్తిడిలో ఉన్నా.. తప్పనిసరిగా విరామం తీసుకోవాలి. కాసేపు మౌనంగా ఉండటం, పచ్చని మొక్కలు చూడటం, ఏకాంతంగా రెండు నిమిషాలు నిల్చోటం వంటివి శరీరాన్ని ఉత్తేజితం చేస్తాయి. మనసూ ఉల్లాసంగా ఉంటుంది.
5. కార్యాలయాల్లో చాలా మంది టీ, కాఫీలకు ప్రాధాన్యమిస్తుంటారు. వాటిని ఈ కాలంలో ఎంత మితంగా తీసుకుంటే అంత మంచిది. డార్క్ చాక్లెట్, ఎండు ఫలాలు తిన్నా మంచిదే. వాటిలోనూ యాంటీఆక్సిడేంట్లు మెదడు మీద సానుకూల ప్రభావాన్ని చూపుతాయి.

6. పని చకచకా చేయడమే కాదు. పనిచేసే స్థలం కూడా శుభ్రంగా, పొందిగ్గా ఉండాలి. కంప్యూటర్, కీబోర్డు మీద దుమ్మూ ధూళీ లేకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేయించుకోవాలి. తడి టిష్యూ కాగితాలను ఎప్పుడూ పక్కన ఉంచుకోవాలి. ఏదైనా తిన్న తర్వాత చేతులను శుభ్రంగా తూడుచుకోవడానికి పనికొస్తాయి.
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్‌లెస్ మటన్ బిర్యానీ తయారీ
- Manasa Devi: సర్పాలను కాపాడిన మానసాదేవి గురించి ఆధ్యాత్మిక విషయాలు
- Anemia Ayurvedic Treatment: మనిషిని కృంగదీసే వ్యాధులలో ఎనీమియా ఒకటి
- best food for heart: గుండె ఆరోగ్యంగా ఉండాలంటే తినాల్సిన ఆహారం ఇదే!