Star Micro Rural and Farmers care Policy స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ వారు రైతులకు మంచి పాలసీని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇప్పటికే దేశంలో Star Health insurance కి మంచి ఆదరణ ఉంది. కోవిడ్ మహమ్మారి ప్రవేశించినప్పటి నుంచి ఎక్కువ మంది ప్రజలు హెల్త్ ఇన్సూరెన్స్‌లపై ఆధారపడుతున్నారు. అకస్మాత్తుగా వచ్చే అనారోగ్య సమస్యల నుండి గట్టెక్కాలంటే స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్‌తో పాటు మరికొన్ని హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఇచ్చే సదుపాయాలతో కాస్త ఉపశమనం లభిస్తోంది. అయితే స్టార్ హెల్త్ వారి రైతుల పాలసీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం!.
Star Micro Rural and Farmers care Policy తీసుకునే వారి వయస్సు 18 సంవత్సరాల నుండి 65 సంవత్సరాల లోపు వారు అర్హులు. ఈ పాలసీలో మొత్తం బీమా పరిశీలిస్తే వ్యక్తిగతంగా 1 లక్ష ఆరోగ్య బీమా ఉంటుంది. అదే కుటుంబానికి అయితే (2 పెద్దలు+ 2 పిల్లలు) 2,00,000/- లక్షల వరకు ఆరోగ్య బీమా వర్తిస్తుంది. పాలసీ ప్రయోజనాలు పొందాలంటే తప్పనిసరిగా పాలసీదారుడు ఆసుపత్రిలో 24 గంటలు ఇన్- పేషెంట్(in patient)గా ఉండాలి. అలా ఉన్న వారికి రూమ్ రెంట్(room rent)తో పాటు వ్యక్తిగత పాలసీకి రోజుకు రూ.1,000/- లు చెల్లిస్తారు. కుటుంబ పాలసీ వారికి అయితే రూ.2,000/- లు చెల్లిస్తారు. ఇక పాలసీలో జీవిత కాల రెన్యువల్ సదుపాయం కలదు.
అంతే కాకుండా ఆల్ డే-కేర్ చికిత్సల కవర్ అవుతుంది. ఈ పాలసీ తీసుకునే వారికి ఎటువంటి మెడికల్ చెకప్(medical check up)లు అవసరం లేదని స్టార్ హెల్త్ కంపెనీ చెబుతోంది. క్యాటరాక్ట్ కూడా కవర్ అవుతోంది. పాలసీ తీసుకున్న 6 నెలల తరువాత మునుపటి వ్యాధులకు చికిత్సకు ప్రయోజనాన్ని పొందవచ్చని చెబుతున్నారు. పూర్తి వివరాలకు మీకు అందుబాటులో ఉన్న స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ఏజెంట్ గానీ, ఆఫీసును గాని సంప్రదించవచ్చు.
- Brave girl: Indira Gandhi కాలంలో అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించిన Geetha chopra award బాలిక స్టోరీ
- Karpoora Tulasi: ఆధ్యాత్మిక సుగంధం కర్పూర తులసి అని ఎందుకంటారు?
- Coffee: ప్రతి రోజూ కాఫీ తాగుతున్నారా? అయితే ఇది చదవాల్సిందే!
- Discipline: జీవితంలో క్రమ శిక్షణ ఎంతో అవసరం
- Money Problem: పైసలు లేకపోతే ఎక్కడలేని నొప్పలన్నీ వస్తాయట!