Ruia Hospital : మా వల్ల కాదు బాబోయ్! రుయాలో నర్సుల గోడు!
Ruia Hospital : తిరుపతి : రాయలసీమకే తలమానికమైన తిరుపతి రుయా ఆస్పత్రిలో నర్సుల ఆవేదన అంతా ఇంతా కాదు. కోవిడ్ పేషంట్లు ఉన్న వార్డుల్లో కేవలం ఒకరిని మాత్రమే విధులకు కేటాయించారు. అక్కడ సుమారు 30 నుంచి 40 మంది అవుట్ పేషెంట్లు ఉంటారు. వారికి ఒక్కరే సేవలు అందించాలంటే నర్సింగ్ సిబ్బంది భయపడుతున్నారు.
సిబ్బందికి సరైన వసతులు లేవు. కాంట్రాక్టు ప్రాతిపదికన సుమారు 40 మంది దాకా ఈ ఆసుపత్రిలో పని చేస్తున్నారు. వారికి శెలవులు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంత మంది నర్సులే డ్యూలో ఎక్కువ ఒత్తిడి వల్ల అనారోగ్యం పాలువుతున్నారు. మరికొందరు కోవిడ్ బారిన పడి అక్కడే చికిత్స పొందుతున్నారు.
నర్సింగ్ సూపరింటిడెంట్ తనకు అనకూలంగా ఉన్న వారికి కోవిడ్ డ్యూటీలు వేయకుండా, ఎవరైనా ప్రశ్నిస్తే నర్సులను పలు రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రుయా ఆసుపత్రిలో 400 మంది శాశ్వతం అర్హులుగా ఉన్నారు. 40 మంది కాంట్రాక్టు నర్సులుగా విధులు నిర్వహిస్తున్నారు. మిగిలిన వార్డుల్లో కూడా అరకొర సిబ్బంది డ్యూటీ చేస్తున్నారు.


పలుమార్లు మెడికల్ సూపరిండెంట్ కూడా హెచ్చరించినా నర్సింగ్ సూపరిండెంట్ పట్టించుకోలేదని నర్సులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారాల తరబడి కోవిడ్ డ్యూటీలు చేస్తున్నా వారికి సెలవులు ఇవ్వడం లేదనే విమర్శలు వినిపి స్తున్నాయి. 400 మంది శాశ్వత నర్సులు, 40 మంది కాంట్రాక్టు నర్సులు ఎక్కడ విధులు నిర్వహిస్తున్నారో మాకే తెలియడం లేదని అక్కడ పనిచేస్తున్న నర్సులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మా ఆవేదనను జిల్లా కలెక్టర్ దృష్టికి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూడాలని, రుయాలో పనిచేస్తున్న నర్సులు అందరికీ డ్యూటీలలో సమన్యాయం పాటించాలని రుయాలో పని చేస్తున్న కొంత మంది నర్సులు తమ ఆవేదనను వెలబుచ్చారు. నర్సింగ్ సూపరిండెంట్ ఏకపక్ష వైఖరిపై జిల్లా కలెక్టర్‌తో పాటు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు విచారించి తమకు న్యాయం చేయాలని నర్సింగ్ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
– విలేఖరి ద్వారకా హెచ్ (AP CRIME NEWS MEDIA WHATSAPP)
- Impact of Social Media in our Life
- Brave girl: Indira Gandhi కాలంలో అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించిన Geetha chopra award బాలిక స్టోరీ
- Karpoora Tulasi: ఆధ్యాత్మిక సుగంధం కర్పూర తులసి అని ఎందుకంటారు?
- Coffee: ప్రతి రోజూ కాఫీ తాగుతున్నారా? అయితే ఇది చదవాల్సిందే!
- Discipline: జీవితంలో క్రమ శిక్షణ ఎంతో అవసరం