srinivasa setu flyover | ప్రజల, యాత్రికులు సౌకర్యార్థం రాకపోకలకు ఏర్పాటు చేసిన శ్రీనివాస సేతు బ్రిడ్జిపై నిరూపయోగం లేని ఘటనలకు తావు లేదని జిల్లా ఎస్పీ వెంకట అప్పల నాయుడు(venkata appala naidu ips) స్పష్టం చేశారు. బుధవారం ఆయన శ్రీనివాస సేతు బ్రిడ్జిని సందర్శించి పరిశీలించారు. ఈ బ్రిడ్జీపై ఎలాంటి సెలబ్రేషన్స్ జరప రాదని అన్నారు. బైక్ రైడింగ్ చేస్తే, యువకులు నిబంధనలు హద్దు మీరితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సరదా కోసం, ఆహ్లాదం కోసం అత్యంత ఎత్తైన ఈ నిర్మాణం బ్రిడ్జి(srinivasa setu flyover)ని ఉపయోగించుకోరాదని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
వాహనదారులకు సూచన!
ఈ బ్రిడ్జిపై అత్యంత వేగంతో వాహనాలు నడిపి ప్రమాదాల బారిన పడవద్దని సూచించారు. బయటి ప్రాంతాల నుంచి తిరుమల శ్రీవారి దర్శనార్థం తిరుపతి(tirupati)కి చేరుకునే భక్తుల సౌకర్యార్థం ఈ బ్రిడ్జిని ఏర్పాటు చేశారని అన్నారు. దీని ఉద్దేశ్యాన్ని, ప్రాముఖ్యతను తగ్గించే ఎటువంటి చర్యలకు పాల్పడవద్దని పేర్కొన్నారు. పోలీసు వారి హెచ్చరికలను విస్మరిస్తే కఠిన చర్యలు తప్పబోవని హెచ్చరించారు.

శ్రీనివాస సేతు(srinivasa setu) ప్లై ఓవర్ బ్రిడ్జిపై వాహనాల రాకపోకాలను, ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలను పర్యవేక్షించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ట్రాఫిక్ అధికారులకు సూచనలు చేశారు. పుట్టిన రోజు, ఇతరత్రా సెలబ్రేషన్ వేడుకలు ప్లై ఓవర్పై జరుపుకోవద్దని, నిబంధనలు అతిక్రమిస్తే ద్విచక్ర వాహనాలను సీజ్ చేయడంతో పాటు చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అందమైన బ్రిడ్జిపై నుంచి మరింత అందమైన తిరుపతి అందాలను చూడాలని ప్రతి ఒక్కరికీ కుతూహలంగా ఉండటం సహజమేనని, అయితే అంతకు మించి ప్రాణపాయ పరిస్థితులను కూడా దృష్టిలో ఉంచుకోవాలని కోరారు.
బ్రిడ్జిపై అలాంటి వాటికి అనుమతి లేదు!
నగర ప్రజలు నూతనంగా ప్రారంభించిన బ్రిడ్జిపై నుంచి సెల్ఫీలు తీసుకునే మోజు ఇటీవల పెరిగిందని, అయితే సెల్ఫీ మోజులో ప్రాణాలు పోగొట్టుకున్న సంఘటనలు ఇతర ప్రాంతాలలో చాలా జరిగిందని గుర్తు చేశారు. ఈ శ్రీనివాస సేతు ఫ్లై ఓవర్ బ్రిడ్జిపై సెల్ఫీలకు అనుమతించొద్దని స్పష్టం చేశారు. చివరకు వాకర్లు బ్రిడ్జిపై వాకింగ్ చేయరాదని, ఈ బ్రిడ్జి కేవలం తిరుమలకు వెళ్లే యాత్రికులకు ఉద్దేశించినది అని ఎస్పీ(sp) తెలిపారు. నగరంలో ట్రాఫిక్ తగ్గించడానికి మాత్రమే బ్రిడ్జిని నిర్మించారని, వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున బ్రిడ్జిపై వాకర్లకు అనుమతించబోమని తెలిపారు.

అనంతరం ఆర్టీసీ బస్టాండ్లో ప్రయాణికుల భద్రత , సౌకర్యాలను, ఇబ్బందులను పరిశీలించి పార్కింగ్ ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష చేసి తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో లా అండ్ ఆర్డర్ అడిషనల్ ఎస్పీ ఆరిపుల్లా, సిఐలు, ట్రాఫిక్ వెంకట సుబ్బయ్య, ఈస్ట్ శివ ప్రసాద్ రెడ్డి, అఫ్బ్కాన్ ఫ్లై ఓవర్ అధికారులు పాల్గొన్నారు.
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్లెస్ మటన్ బిర్యానీ తయారీ