Srinivas goud murder plan

Srinivas goud murder plan: మంత్రి శ్రీ‌నివాస్ గౌడ్ హ‌త్య‌కు కుట్ర

Telangana

Srinivas goud murder plan | సంచ‌ల‌న వార్త ఒక‌టి వెలుగులోకి వ‌చ్చింది. తెలంగాణ మంత్రి శ్రీ‌నివాస్ గౌడ్ హ‌త్య‌కు కుట్ర జ‌రిగింద‌ని సైబార‌బాద్ క‌మిష‌న‌ర్ స్టీఫెన్ ర‌వీంద్ర విలేక‌ర్ల స‌మావేశంలో తెలిపారు. మంత్రిని హ‌త్య చేసేందుకు 15 ల‌క్ష‌లు సుఫారీ తీసుకున్న‌ట్టు తెలుపుతున్నారు. మంత్రి శ్రీ‌నివాస్ గౌడ్ (Srinivas goud murder plan)హ‌త్య కుట్ర‌లో బిజేపీ నేత డికె. అరుణ పేరు వినిపించ‌డం రాజ‌కీయంగా సంచ‌ల‌నం క‌లిగిస్తోంది.

అయితే మంత్రి హ‌త్య‌కు కుట్ర ప‌న్నివారు ముగ్గురు అని తెలుస్తోంది. వారు కొన్నాళ్లుగా వెంట ప‌డుతున్నార‌ని స‌మాచారం. వారంద‌ర్నీ ఢిల్లీలోనూ,హైద‌రాబాద్‌లో సైబ‌రాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. కుట్ర‌ను భ‌గ్నం చేసిన పోలీసులు కీల‌క వ్య‌క్తి ఫ‌రూక్ ను అరెస్టు చేశారు. మ‌హ‌బూబ్ న‌గ‌ర్‌కు చెందిన నాగ‌రాజు,యాద‌య్య‌, విశ్వ‌నాధ్ హ‌త్య‌కు కుట్ర ప‌న్ని సుఫారీ ఇచ్చిన‌ట్టు స‌మాచారం. నిన్న ఢిల్లీలో మాజీ ఎంపీ జింతేద‌ర్ రెడ్డి ఇంటి వ‌ద్ద ర‌వి అనే వ్య‌క్తిని కిడ్నాప్ చేసిన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. అయితే వారు హైద‌రాబాద్ పోలీసులు అని తేలింది. ఇంకా పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Share link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *