Sri Ramakrishna Puja 2022: పై శీర్షికలో విజ్ఞానం అన్న పదాన్ని పూజ అన్నది ఒక ఆధ్యాత్మిక సాధన అని, అది ఉన్నత వైజ్ఞానిక పద్ధతిని అనుసరిస్తుందని నొక్కి చెప్పడానికి మాత్రమే వాడటం జరిగింది. మనం పూజకు ఆధారమైన సిద్ధాంతాన్ని సహేతుకంగా అధ్యయనం చేస్తే, ప్రతి స్థాయిలో కూడా అతి తర్కయుక్తంగా దాని ప్రతి అడుగు కూడా నియమబద్ధంగా చక్కని ప్రణాళికతో కూడియుండటం గమనిస్తాం.
Sri Ramakrishna Puja 2022
సాధకుడు శాస్త్రవిధి యుక్తంగా పూజాకర్మను ఆచరిస్తే, అతను తన జీవిత మనోరథాన్ని పరమ పురుషార్థాన్ని పొంద గలడు. శ్రీ శారదానందస్వామి వారు, Sri Ramakrishna లీలా ప్రసంగం అనే తమ చిరస్మరణీయ రచనలో, కొన్ని విస్పష్ట మాటల్లో Puja మూలతత్వాన్ని సుందరంగా స్పష్టంగా సూచించివున్నారు. ఆ సూచన సూత్రప్రాయంగా ఉన్నప్పటికీ, ఎంతో విస్పష్టంగా ఉంది. దానికి మరల వివరణ ఇవ్వడం అనవసరం. శ్రీశారదానందస్వామి వారు, ఒక దేవతను పూజించటానికి నువ్వు పూనుకున్నప్పుడు, చుట్టు చుట్టుకుని ఉన్న కుండలినీశక్తి మూలధార చక్రం నుండి జాగృతమై, శిరస్సులోని సహస్రదల కమలయుక్త సహస్రారచక్రాన్ని చేరుకుందని, నువ్వు అద్వైత చైతన్యంలో పరమాత్మలో ఐక్యమైపోయావని, పూజా ప్రారంభంలోనే భావించాలి.
ఆ తర్వాత ఆ పరమాత్మ నుండి నువ్వు వేరైపోయి, మరల జీవ రూపం ధరించావని ఎంచాలి. పరమాత్మ దివ్యజ్యోతి సంక్షిప్తమైన నువ్వు పూజించే దేవతారూపంగా వ్యక్తమవుతున్నదని భావించాలి. నీలోనున్న దేవతను నువ్వు బైటికి ప్రకటించావని ఎంచి, అప్పుడు Puja చేయడానికి సిద్ధం కావాలి అని చెబుతారు. కులార్ణవ తంత్రంలో, పూజను పూర్వ జన్మల కర్మవాసనలను నశింపచేసి జన్మ మరణ చక్రాన్ని ఆపివేసే, సంపూర్ణ ఫలానిచ్చే చర్యగా నిర్వచిస్తారు. భక్తుడు, ఆరాధికుడు, ఆరాధ్యవస్తువుకు ఆ దైవానికి, తనను తాను సంపూర్ణంగా అర్పించుకోవడం అనే అభీప్సితం నెరవేరటమే సంపూర్ణఫలం లభించడం.


ఉపాస్యంలో ఉపాసకుని వ్యక్తిత్వం లయించడం లోనే ఆరాధణ సంపూర్ణత లేదా ఈప్సితఫలం, దాని పరాకాష్ట, ఈ సందర్భంలో Sri Ramakrishna ల అద్భుత ఆధ్యాత్మిక సాధనల చివరి అధ్యాయంలో నున్న షోడశీపూజా సంఘటన జ్ఞాపకం వస్తుంది. శ్రీరామకృష్ణుల జీవిత చరిత్రను చదివిన ప్రతి ఒక్కరికీ వారు దాదాపు 12 ఏళ్లుగా చేసిన అద్భుత, వివిధ అధ్యాత్మిక సాధనలను, ఆధ్యాశక్తిని శ్రీశారదాదేవిలో ఆవాహన చేసి ఆమెను షోడశ్రీ(శ్రీరాజరాజేశ్వరి) దేవిగా పూజించడంలో ముగించారని తెలుసు. ఆ పూజ పరాకాష్టను వర్ణిస్తూ, శ్రీశారదనంద స్వామివారు ఉపాసకుడు సమాధిలో లీనమైపోయాడు. ఆ దేవత కూడా సమాధిమగ్నమైపోయింది. ఉపాసకుడు ఆ దేవతతో ఏకమై ఐక్యమైపోయాడు.అంటూ చెబుతారు.