Sri Medha jr college | రోడ్డు ప్రమాదంలో ప్రిన్సిపాల్ మృతి చెందిన సంఘటన చిత్తూరు జిల్లా బాకరాపేట ఘాట్ రోడ్డులో శుక్రవారం చోటు చేసుకుంది. పీలేరులో ఉన్న శ్రీ మేధ జూనియర్ కాలేజీ (Sri Medha jr college) ప్రిన్సిపాల్ బాలకృష్ణ సాయంత్రం ద్విచక్ర వాహంనపై తిరుపతి నుండి పీలురు వెళుతున్నారు. ఈ క్రమంలో తన ద్విచక్ర వాహనాన్ని కారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ప్రిన్సిపాల్ బాలకృష్ణ ను తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ మృతి చెందారని పోలీసులు పేర్కొన్నారు.
మరణాన్ని ముందే పసిగట్టిన డ్రైవర్!
పూతలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారిపై చంద్రగిరి మండలం అగరాల గ్రామం వద్ద తృటిలో ప్రమాదం తప్పింది. బస్సు నడుపుతున్న ఆర్టీసీ బస్ డ్రైవర్(RTC DRIVER)కు గుండె పోటు వచ్చింది. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ వేగాన్ని నియంత్రించి బస్సును పక్కన నిలిపారు. కానీ కొద్దిసేపటికే మృతి చెందాడు. తిరుపతి నుంచి పాకాల మీదుగా పుంగనూరు వెళుతున్న ఆర్టీసీ అద్దె బస్సులో శ్రీకాళహస్తికి చెందిన బి.రవి డ్రైవర్గా పని చేస్తున్నారు. తన మరణాన్ని పసిగట్టిన డ్రైవర్ గోపీ బస్సు ప్రమాదం బారిన పడకుండా తప్పించి ప్రయాణికుల ప్రాణాలు కాపాడాడు. డ్రైవర్ మృతితో ప్రయాణికులు అందరూ కన్నీరు పెట్టుకున్నారు.

- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్లెస్ మటన్ బిర్యానీ తయారీ
- Manasa Devi: సర్పాలను కాపాడిన మానసాదేవి గురించి ఆధ్యాత్మిక విషయాలు
- Anemia Ayurvedic Treatment: మనిషిని కృంగదీసే వ్యాధులలో ఎనీమియా ఒకటి
- best food for heart: గుండె ఆరోగ్యంగా ఉండాలంటే తినాల్సిన ఆహారం ఇదే!