Sri Lakshmi Tirupatamma Temple : పెనుగంచిప్రోలు(Penuganchiprolu) గ్రామంలో తిరుపతమ్మ అమ్మవారి చిన్న తిరునాళ్లు మూడు రోజులు వైభవంగా జరిగాయి. అనంతరం పురవీధుల్లో గుండా అమ్మవారి రథోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. బుధవారం హైదరాబాద్కు చెందిన చిన్నం యాగయ్య దంపతులు మరియు తెల్ల మేకల శ్రీను దంపతులు అమ్మవారికి సుమారు రూ.7 లక్షల 84 వేల విలు చేసే బంగారు హారము, నెక్లెస్ , ముక్కెరలను కార్యనిర్వహణాధికారి ఎన్విఎస్న్ మూర్తి అందజేశారు. దాతలకు వేదపండితులచే ఆశీర్వచనం చేపించారు. వారికి అమ్మవారి శేష వస్త్రములు, ప్రసాదములు అందజేశారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కమిషనర్ , కార్యనిర్వహణాధికారి మూర్తి, దేవాలయ(Sri Lakshmi Tirupatamma Temple) సిబ్బంది పాల్గొన్నారు.
వాలంటీర్ల ఖాళీలకు దరఖాస్తుల స్వీకరణ(sachivalayam volunteer jobs) |
పెనుగంచిప్రోలు మండలంలోని పలు గ్రామ సచివాలయాల్లో వాలంటీర్ల ఖాళీలు ఉన్నట్టు మండల ప్రజా పరిషత్ కార్యాలయం మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. పెనుగంచిప్రోలు మండలంలోని 6 వాలంటీర్లు పోస్టులు ఖాళీగా ఉన్నట్టు తెలిపింది. ముచ్చింతల -1, పెనుగంచిప్రోలు -3, అనిగండ్లపాడు -1, తోట చెర్ల -1 పోస్టులకు దరఖాస్తులు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఏప్రిల్ 2 వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 10 తరగతి పాసై ఉండాలి, గ్రామ నివాసై ఉండాలి, వయస్సు 18 -35 సంవత్సరాల మధ్య ఉండాలి, ఎటువంటి జాబ్ చేస్తూ ఉండరాదు, విద్యాభ్యాసం కొనసాగిస్తూ ఉండరాదు, ఎటువంటి పోలీసు కేసు ఉండరాదు. దరఖాస్తు చేసుకునే వారు ఆన్లైలో www.gswvolunteer.apcfss.in వెబ్సైట్లో ఆప్లై చేసుకోవాలని ప్రకటనలో కోరారు. |


- Amba Story: భీష్ముడిపై అంబ ఎలా పగతీర్చుకున్నది? పురాణ గాథ స్టోరీ
- Adivasi Homes: అరణ్యంలో ఆదివాసీల ఇల్లు కట్టుకోవడం చూస్తే ఇంజనీరింగ్ కూడా చాలడు!
- COPD: డేంజరా..! అంటే డేంజరే! అసలు ఏంటదీ సిఒపిడి?
- Chintamani Natakam నిషేధంపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన AP High Court
- Grammarly For Education Get Started