Anjeneya Swamy

Sri Anjeneya Swamy Charitra: ఆ ప‌రిపూర్ణ‌త ఒక్క హ‌నుమంతుడికే సాధ్యం!

Spread the love

Sri Anjeneya Swamy Charitra | ఎంత‌టి గొప్ప‌వారినైనా, మ‌రెంత‌టి హీనుల‌నైనా వాక్కుతో వశం చేసుకోవ‌చ్చు. తియ్య‌టి మాట‌ల‌తో, చ‌క్క‌టి వాక్య నిర్మాణ చాతుర్యంతో ఎదుటి వారి హృద‌యాన్ని నొప్పించ‌కుండా త‌ప్పును తెలియ‌జెప్ప‌డం, సంభాష‌ణా నైపుణ్యంతో రంజింప‌జేయ‌డం ఒక క‌ళ‌, ఒక జ్ఞానం, ఒక సాధ‌న‌, ఒక త‌పస్సు. ఈ అభ్యాసాన్ని ప‌రిపూర్ణంగా సాధించిన‌వారు హ‌నుమంతుడు.

Sri Anjeneya Swamy Charitra

రామాయ‌ణంలో ఒక్కొక్క ఘ‌ట్టంలో ఒక్కొక్క వ్య‌క్తితో సుమ‌ధురంగా సంభాషించి రామ‌కార్యాన్ని అద్వితీయంగా సాధించిన బుద్ధి సంప‌న్నుడాయ‌న‌. రామ‌నామాన్ని గుండెల నిండా నింపుకుని అనుక్ష‌ణం ఆయ‌న నామాన్నే జ‌పిస్తూ, దానినే ఒక మంత్రంగా ప్ర‌యోగిస్తూ ఎన్నో విజ‌యాల‌ను సాధించాడు. ఆయ‌న వేసిన ప్ర‌తి అడుగులోనూ, ప‌లికిన ప్ర‌తి మాట‌నూ, చేసిన ప్ర‌తి ప‌నినీ నిశితంగా ప‌రిశీలించిన‌ట్ట‌యితే నిత్య జీవితంలో ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు.

బ్ర‌హ్మ‌జ్ఞాని అయిన హ‌నుమ మ‌హాశ‌క్తి సంప‌న్నుడైనా స‌ర్వ‌కార్యాలూ రామ‌నామ జ‌పం వ‌ల్ల‌నే సిద్దించాయ‌ని న‌మ్మిన‌వారు. సాక్షాత్తూ సూర్య‌భ‌గ‌వానుడి నుంచి చ‌తుర్వేదాల‌ను, వ్యాక‌రణాన్ని, చంద‌స్సును అభ్య‌సించిన హ‌నుమ వాక్య నిర్మాణ చాతుర్యాన్ని శ్రీ‌రాముడే ఎన్నో సంద‌ర్బాల‌లో మెచ్చుకున్నాడు. అనంత‌మైన సాగ‌రాన్ని లంఘించే సంద‌ర్భంలో కూడా సీత‌మ్మ‌ను చూడ‌నితే ఆహారం ముట్ట‌న‌ని ప్ర‌తిజ్ఞ చేశాడు. హ‌నుమ ప్ర‌తి క‌దిలిక‌లోనూ య‌మ‌నియ‌మాలు క‌నిపిస్తాయి. నాగ‌మాత నుర‌స‌తో కాని, త‌న‌పై సేద‌దీర‌మ‌నివేడిన మైనాకుడితో కానీ, న‌న్ను జ‌యించ‌నిదే ముందుకుపోలేన‌న్న లంకిణితో కానీ ఒక్క పొల్ల‌మాట కూడా మ‌ట్లాడ‌కుండా బుద్ధి బ‌లంతోనే వారిని ఒప్పించాడు. ఎవ‌రితో ఎప్పుడు, ఎంత వ‌ర‌కు మాట్లాడ‌టం అవ‌స‌ర‌మో తెలిసిన శ‌మ‌ద‌మ సంప‌న్నుడైన హ‌నుమ‌ని ప్ర‌స‌న్నం చేసుకోవాలంటే రామ‌నామాన్ని జ‌పించాల్సిందే.

Good Friday 2022 Message: నీ విశ్వాసం నిన్ను స్వ‌స్థ ప‌రిచింది (స్టోరీ)

Good Friday 2022 Message | ఒక ఒంట‌రి ముస‌లాయ‌న త‌న ఇంటికి ద‌గ్గ‌రి దారి అవుతుంద‌ని ఒక పాడుబ‌డిన ఫ్యాక్ట‌రీలో నుంచి వెళుతున్నాడు. ఓ పెద్ద Read more

shiva ganga:శివుడు జ‌డ‌ల‌లో అంత పెద్ద గంగ ఎలా ఒదిగింది (స్టోరీ)

shiva ganga | క‌పిల‌మ‌హాముని కోపాగ్నికి బూడిద పోగులైన త‌న తాత‌ల‌ను త‌రింప‌జేయడానికి భ‌గీర‌ధుడు జ‌లాధి దేవ‌త‌యైన గంగాదేవిని త‌పస్సు చేసి మెప్పించి దివి నుండి భువికి Read more

Nagula Chavithi 2022: అనాదిగా వ‌స్తున్న ఆచారం నాగుల‌చ‌వితి గురించి తెలుసా?

Nagula Chavithi 2022 | పాముల ఆరాధ‌న ఈనాటిది కాదు. ఎన్నో యుగాల‌నాటిది. సౌభాగ్యానికి, స‌త్సంతాన ప్రాప్తికి స‌ర్ప‌పూజ చేయ‌డం ల‌క్ష‌ల శర‌త్తుల కింద‌టే ఉన్న‌ట్లు ఎన్నో Read more

Interesting Bible Storie 2022: దేవుడు చూపిన ధ‌నం అద్భుత‌మైన స్టోరీ!

Interesting Bible Storie 2022 | ఇప్పుడు చెప్ప‌బోయే స్టోరీ వాస్త‌వానికి 1986వ సంవత్స‌రంలో ఆనాటి జ్యోతి ప‌త్రిక‌లో ప్ర‌చురించ‌బ‌డిన క‌థ‌నం. ఈ క‌థ‌నం బైబిల్‌కు సంబంధించింది. Read more

Leave a Comment

Your email address will not be published.