Special training for Sarpanch: నూతనంగా ఎన్నిక కాబడిన సర్పంచ్‌లకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్టు కృష్ణా జిల్లా కలెక్టర్ జె.నివాస్ బుధవారం తెలిపారు. అందరూ కరోనా నిబంధనలు పాటించి శిక్షణకు హాజరు కావాలని సూచించారు.
Special training for Sarpanch: మచిలీపట్నం: కృష్ణా జిల్లాలో నూతనంగా ఎన్నికైన 778 మంది గ్రామ పంచాయతీ సర్పంచులకు గ్రామ పంచాయీ పరిపాలన వ్యవహారాలపై ప్రాథమిక అవగాహక శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్టు కలెక్టర్ జె.నివాస్ తెలిపారు. ఈ నెల 22 (గురవారం) నుండి ఆగష్టు 7వ తేదీ వరకు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు కలెక్టర్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమానికి ఆయా గ్రామ సర్పంచ్‌లందరూ నిర్ధేశించిన తేదీల్లో హాజరై గ్రామ పంచాయతీ పాలపై పూర్తి అవగాహన పొందాలని కలెక్టర్ తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమంలో భాగంగా మచిలీపట్నం డివిజన్‌కు సంబంధించి 194 మంది సర్పంచ్‌లకు 5 బ్యాచ్‌లుగా శిక్షణ ఇవ్వనున్నట్టు సూచించారు. నూజివీడు డివిజన్‌కు సంబంధించి 223 మంది సర్పంచ్‌లకు 5 బ్యాచ్‌లుగా, విజయవాడ డివిజన్ కు సంబంధించి 169 మంది సర్పంచ్‌లకు 3 బ్యాచ్‌లుగా, గుడివాడ డివిజన్‌కు సంబంధించి 192 మంది సర్పంచ్‌లకు 4 బ్యాచ్‌లుగా విభజించినట్టు కలెక్టర్ తెలిపారు.
40 నుంచి 90 మంది సర్పంచ్‌లతో బ్యాచ్‌లను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఒక్కో బ్యాచ్‌కు మూడ్రోజుల చొప్పున శిక్షణ కార్యక్రమం ఉంటుందని అన్నారు. విజయవాడ డివిజన్ వారికి ఇబ్రహీంపట్నం మండలం జూపూడి వద్ద నిమ్రా ఇంజినీరింగ్ కళాశాలలోనూ, నూజివీడు డివిజన్ వారికి ట్రిపుల్ ఐటీలోనూ, మచిలీపట్నం డివిజన్ వారికి మచిలీపట్నం, చిలకలపూడిలోని జడ్పీ ఆఫీస్ మీటింగ్ హాల్లో, గుడివాడ డివిజన్ వారికి గుడివాడ ఎంపీపీ కార్యాలయం మీటింగ్ హాల్లో శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. శిక్షణకు అవసరమగు సామాగ్రిని, టేబుళ్లను, హాజరు పట్టికలను, ఐ.డి కార్డులను సిద్దం చేస్తున్నట్టు తెలిపారు.
గ్రామభివృద్ధిపైనే ఎక్కువ అవగాహన!
శిక్షణలో ప్రధానంగా గ్రామ సచివాలయాల ఏర్పాటు, ప్రాముఖ్యత, పంచాయతీల విధులు, అధికారాలు బాధ్యతలు, లక్ష్యాలు, మౌలిక సదుపాయాల కల్పనలో గ్రామాభివృద్ధి తాగునీరు రోడ్డు, విద్యుత్, దీపాలు, పంచాయతీల ఆర్థిక పరిపుష్ట ఆర్థిక, వ్యవహారాలు, సంక్షేమ పథకాలు, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం తదితర అంశాలపై శిక్షణ ఉంటుందన్నారు.
కోవిడ్ నిబంధనలు తప్పనిసరి!
శిక్షణకు హాజరయ్యే సర్పంచులందరికీ థర్మల్ స్కానర్‌తో పరీక్షించాలని, ఎవరికైనా జ్వరం ఉంటే పంపించి వేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. శిక్షణలో భౌతిక దూరాన్ని పాటించాలని, మాస్క్ తప్పనిసరిగా వాడాలని, ప్రవేశం వద్ద శానిటైజర్ ఉంచాలని, కోవిడ్ నిబంధనలు పాటించడమే కాకుండా, శిక్షణలో కోవిడ్‌పై కూడా తరగతి నిర్వహించి అవగాహన కల్పించాలని అన్నారు.
- COPD: డేంజరా..! అంటే డేంజరే! అసలు ఏంటదీ సిఒపిడి?
- Chintamani Natakam నిషేధంపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన AP High Court
- Grammarly For Education Get Started
- Grammarly Check For Great Writing, Simplified
- tips for glowing skin homemade | అందమైన ముఖ సౌందర్యం కోసం టిప్స్