SP Ravindra Babu : Gudivada: కృష్ణాజిల్లా గుడివాడ సబ్ డివిజన్ పరిధిలోని పలు గ్రామాల్లో కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రబాబు శుక్రవారం పర్యటించారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో భాగంగా పోలింగ్ బూత్‌లను పరిశీలించి, అతి సమస్యాత్మక గ్రామాల్లో పర్యటించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. పంచాయతీ ఎన్నికలు జరిగే సమస్యాత్మక గ్రామాల్లో సీనియర్ అధికారులతో ప్రత్యేక పర్యవేక్షణ చేశామన్నారు. మొదటి విడత ఎన్నికల పోలింగ్ నిర్వహణకు సివిల్ ఫోర్స్, స్పెషల్ ఫోర్స్, మహిళా పోలీసులతో భద్రతా చర్యలు తీసుకుంటున్నామన్నారు. నిస్పక్షపాతంగా, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టామన్నారు.
మద్యం అక్రమ రవాణా జరగకుండా జిల్లా వ్యాప్తంగా 60 చెక్ పోస్టులు ఏర్పాటు, సారా తయారీ లను అరికట్టేందుకు కార్టన్ సెర్చ్‌లను చేస్తున్నామన్నారు. అల్లర్లు సృష్టించాలనుకునే వారిపై కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా రౌడీషీట్ ఓపెన్ చేస్తామని ఎస్పీ హెచ్చరించారు. రెండో విడత ఎన్నికలు జరిగే గుడివాడ డివిజన్లలో 85 అతి సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించినట్టు రవీంద్రబాబు మీడియాకు తెలియజేశారు.
ఇది చదవండి:శశికళకు అనుమతి ఇవ్వని ఏఐఏడింకే ప్రభుత్వం!
ఇది చదవండి:నవవధువును దారుణంగా హత్య చేసిన భర్త!
ఇది చదవండి:టీచర్లను ఇవ్వండి..ఓట్లేస్తాం..!
ఇది చదవండి:పంచాయతీ ఎన్నికల్లో జనసేనాకు టిడిపి మద్దతు!
ఇది చదవండి: ఎమ్మెల్యే ధర్మారెడ్డిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలి
ఇది చదవండి:గుంటూరు జిల్లా కలెక్టర్‌గా Vivek Yadav బాధ్యతలు స్వీకరణ
ఇది చదవండి: వైద్య అవినీతిపై సీఎస్ ఆదిత్యనాధ్ దాస్ ఆరా?
ఇది చదవండి: 7న రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ రాక