tirupathi railway station | గుంటూరు జిల్లా రేపల్లె రైల్వే స్టేషన్లో భర్త పిల్లలతో కలిసి రైల్వే ఫ్లాట్ ఫాంపై నిద్రిస్తున్న ఒక వలస కూలి మహిళపై జరిగిన అత్యాచార ఘటన నేపథ్యంలో తిరుపతి జిల్లా SP పరమేశ్వర రెడ్డి ఆదివారం సాయంత్రం రైల్వేస్టేషన్లను తనిఖీలు నిర్వహించారు. మహిళల భద్రత పట్ల RPF,GPF సిబ్బంది తీసుకుంటున్న చర్యలపై ఆరా తీశారు.
tirupathi railway station లో తనిఖీలు
Repalle ఘటన నేపథ్యంలో రాష్ట్ర DGP ఆదేశాల మేరకు tirupathi జిల్లాలోని రైల్వేస్టేషన్ లో అర్బన్ ఎస్పీ తనిఖీలు నిర్వహించారు. ప్రధానంగా ఒంటరిగా ప్రయాణిస్తున్న మహిళలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. Railway స్టేషన్లలో చీకటిగా ఉన్న ప్రాంతాల్లో వెళ్లకుండా వెలుతురుగా ఉన్న ప్రాంతంలో ఉండాలన్నారు. రైళ్లలో ప్రయాణిస్తున్న ప్రయాణికులు విలువైన వస్తువులను జాగ్రత్తగా ఉంచుకోవాలని సూచించారు. చంటి పిల్లలతో ప్రయాణిస్తున్న Passengers పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
ముఖ్యమైన ప్రాంతాల్లో CC కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రయాణికులు స్వీయ జాగ్రత్తలు పాటించాలని, అనుమానస్పదంగా వ్యక్తులు తారసపడితే నగర Policeలకు లేదా రైల్వే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. ఈ తనిఖీల్లో భాగంగా జిల్లా ఎస్పీ సిసి పుటేజ్లను ఆరా తీసి Dog స్క్వాడ్‌తో తనిఖీలు నిర్వహించారు. రైల్వే భద్రతా సిబ్బంది అధికారులతో చర్చించి, రైల్వే స్టేషన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు, భద్రతా సిబ్బంది గస్తీ, రాత్రి సమయాలలో Platformలపై తీసుకున్నంటున్న భద్రతా చర్యలు తదితర విషయాలపై క్షుణ్ణంగా చర్చించారు.
రైల్వే స్టేషన్లు తాము ప్రయాణించవల్సిన రైలు వచ్చేంత వరకు ఫ్లాట్‌ఫార్మంపై మహిళలు నిద్రిస్తూ ఉంటే, వారిని సురక్షిత ప్రాంతానికి పంపి Rest తీసుకునేలా రైల్వే పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు. రైల్వే స్టేషన్లలో అవసరమైన అన్ని ప్రాంతాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి భద్రతను కట్టుదిట్టం చేయాలని అధికారులకు సూచించారు. రైల్వే Station పరిసర ప్రాంతాలలో గానీ, ఫ్లాట్ ఫారంపై గానీ అనుమానస్పదంగా వ్యక్తులు కనబడితే వెంటనే రైల్వే పోలీసులకు సమచారాం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

ముఖ్యంగా ప్లాట్‌ఫారంపై దుకాణాలు నడిపే హాకర్లకు ఆయన సూచించారు. నిత్యం రైల్వే స్టేషన్లలో వ్యాపారం చేసుకునే దుకాణాదారులు hackers కొత్త వారి నిర్మాణాత్మక కదలికలను సులభంగా గుర్తించగలరనీ, అనుమానస్పదంగా ఎవరైనా తారసపడితే వెంటనే Dial 100 గానీ, రైల్వే పోలీసులకు గానీ సమాచారం ఇవ్వాలని కోరారు. స్టేషన్లలో మహిళల భద్రతకు ప్రాధాన్యం కల్పిస్తూ భద్రతా సిబ్బంది ప్రత్యేక చర్యలను తీసుకోవాలని సూచించారు.
మహిళలు ఒంటరిగా ఉన్నప్పుడే అరాచక శక్తుల కళ్లుపడతాయని, అటువంటి వాతావరణం నుంచి వారిని తప్పించి కాపాడాలని కోరారు. సమాజంలో జరుగుతున్న నేరాలకు ప్రధాన కారణం మత్తు పదార్థాలేని, మద్యం, గంజాయి ఇతరత్రా మత్తు పదార్థాల నుంచి ప్రతి ఒక్కరూ దూరండా ఉండాలని ఆయన హితవు పలికారు. కార్యక్రమంలో అడ్మిన్ ఎస్పీ సుప్రజా, రైల్వే DSP, ఈస్ట్ సిఐ శివప్రసాద్ రెడ్డి, ఎస్సై ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.