fake challan scam: కైకలూరు: కృష్ణా జిల్లా మండవల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యా లయంలో జరిగిన నకిలీ చలానాల వ్యవహారంలో ప్రధాన నిందితుడైన స్టాంప్ వెండర్ దీరజ్ ను అరెస్టు చేసినట్టు జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ తెలిపారు. గురువారం కైకలూరు టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసు(fake challan scam) వివరాలను వెల్లడించారు.
కేవలం 48 గంటల్లో 640 నకిలీ చలానాలలో 450 చలానాలకు సంబంధించి రూ.1.02 కోట్ల నగదు ప్రభుత్వ ఖజానాలో జమ చేయించామని తెలిపారు. నకిలీ చలానాలతో రిజిస్ట్రేషన్ చేయించుకున్న బాధితులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, దర్యాప్తు కొనసాగుతోందని ఎస్పీ తెలిపారు.
ఈ వ్యవహారంలో నిందితులు ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా వారిని గుర్తించి చట్టపరమైన, శాఖ పరమైన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. నిందితుల వద్ద నుంచి వంద శాతం నగదు రికవరీ చేస్తామన్నారు.
- Brave girl: Indira Gandhi కాలంలో అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించిన Geetha chopra award బాలిక స్టోరీ
- Karpoora Tulasi: ఆధ్యాత్మిక సుగంధం కర్పూర తులసి అని ఎందుకంటారు?
- Coffee: ప్రతి రోజూ కాఫీ తాగుతున్నారా? అయితే ఇది చదవాల్సిందే!
- Discipline: జీవితంలో క్రమ శిక్షణ ఎంతో అవసరం
- Money Problem: పైసలు లేకపోతే ఎక్కడలేని నొప్పలన్నీ వస్తాయట!