big news: హర్యానా రాష్ట్రం సోనిపట్ పరిధిలోని ఓ గ్రామంలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. తల్లిని బెదిరించి, ఇద్దరు మైనర్ బాలికలపై నలుగురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆపై ఆ బాలికలచే పురుగుల మందు తాగించి చనిపోవడానికి ప్రోత్సహించారు.
ఈ దారుణ ఘటనకు సంబంధించి కుండ్లి పోలీసు స్టేషన్ ఎస్ హెచ్ ఓ రవి కుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నిందితులు నలుగురు 22 నుంచి 25 సంవత్సరాలు వయస్సు గలవారు. వీరు వలస కార్మికులు. బాలికలు ఇంటి పక్కన ఉన్న ఇంట్లోనే అద్దెకు ఉంటున్నారు. ఇద్దరు మైనర్ బాలికలతో ఓ తల్లి కలిసి కూలి పనిచేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో ఆగష్టు 5,6 తేదీన మధ్య రాత్రి నిందితులు నలుగురు బలవంతంగా బాలికల ఇంట్లోకి ప్రవేశించారు. వారి తల్లిని బెదిరించారు. మైనర్ బాలికలపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ పై ఆ ఇద్దరు బాలికలచే పురుగుల మందు తాగించారు.
పాము కరిచినట్టు చెప్పాలని తల్లికి బెదిరింపు!
బాలికల పరిస్థితి విషమించడంతో తమ కుమార్తెలను పాము కరిచినట్టు పోలీసులకు చెప్పాలని ఆ నలుగురు నిందితులు తల్లిని బెదిరించారు. బాలికలను ఢిల్లీలోని ఆస్పత్రికి తరలించగా ఇద్దరూ చికిత్స పొందుతూ చివరకు ప్రాణాలు కోల్పోయారు. ఇక ప్రాణభయంతో బాలికల తల్లి తమ పిల్లలను పాము కాటు వేసిందని ఆస్పత్రి సిబ్బందికి తెలియజేసింది. అయితే పోలీసులకు అనుమానం రానే వచ్చింది. గట్టిగా ఆ తల్లిని ప్రశ్నించారు. చివరకు కన్నీళ్లతో ఆ తల్లి అసలు విషయం బయట పెట్టింది. చివరకు పోస్టుమార్టం నివేదికలో లైంగిక వేధింపులు, విషప్రయోగం జరిగినట్టు నిర్థారణ అయ్యిందని ఎస్ హెచ్ఓ కుమార్ తెలిపారు. ఈ కేసుకు సంబంధించి నలుగురి నిందితులను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు.
big news: మరో ఘటనలో బాలిక ఆత్మహత్య
మరో ఘటనలో ఓ యువకుడి వేధింపులు కారణంగా మైనర్ బాలిక (17) ఆత్మహత్యకు పాల్పడింది. పటౌడీ పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ ఓ దీపక్ సంధు మాట్లాడుతూ.. యువకుడి వేధింపులు తాళలేక బాలిక తన ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
- Nelluri Nerajana Song lyrics:నెల్లూరి నెరజానా నీ కుంకుమల్లె మారిపోనా లిరిక్స్ | Oke Okkadu Movie
- surface tension: వర్షపు బిందువుల, Soap bubble, పాదరస బిందువులు గోళాకారంలోనే ఎందుకుంటాయి?
- Viscosity: రక్తం వేగాన్ని నియంత్రించుకోవాలన్నా, సముద్రంలో కెరటాలు తాకిడి తగ్గాలన్నా స్నిగ్థతే కారణం!
- Hands: అందమైన చేతుల తళతళా మెరవాలంటే ఇలా చేయండి!
- Vangaveeti Radha: జూలై 4న మూహుర్తమా? జనసేన పార్టీలోకి వంగవీటి రాధా!