Sommasilli Pothunnave Part 2 : Rathod Tunes నుండి విడుదలై ప్రేక్షకులకు బాగా నచ్చిన పాట సొమ్మసిల్లి పోతున్నవే సాంగ్ ఎంత హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆ పాటకు సీక్వెల్‌గా పార్ట్ -2 సాంగ్ కూడా విడుదలైంది. ఈ పాట కూడా సూపర్ హిట్‌ను అందుకుంది. ప్రేమికులకు బాగా ఇష్టమైన సాంగ్‌లో ఇది ఒకటిగా నిలిచిపోయింది. ఈ పాట ఇప్పటికీ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది.
సొమ్మ సిల్లి పోతున్నవే సాంగ్ పార్ట్ – 2 కు కూడా లిరిక్స్ రాము రాతోడ్ అందించారు. ఈ సాంగ్‌ను DIVYA MALIKA – RAMU RATHOD చాలా అద్భుతంగా పాడారు. వారి స్వరంతో ప్రతి ఒక్కరినీ మెప్పించేలా వినుసొంపైన రాగంతో పాట పాడారు. మంచి సాహిత్యంతో పాటు పాట పాడి, నటించిన రాము రాతోడ్ ఇప్పుడు ఫ్యామస్ అయ్యారని చెప్పవచ్చు ఈ రెండు సాంగ్స్‌తో.
ఎన్నో ఫోక్ సాంగ్స్‌కు హృదయాన్ని తాకే మ్యూజిక్‌ను అందించి సినిమా లెవల్‌కు మించిపోయిన పాటలకు సంగీతం అందిస్తున్న కళ్యాణ్ కీస్ ఈ పాటకు కూడా మధురమైన సంగీతాన్ని అందించారు. పాట పాడటం ఒక ఎత్తు అయితే ఆ పాటకు సంగీతమే ఆయుపట్టువు అని వారి అందించిన సంగీతాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. సినిమా పాటల కంటే సూపర్ హిట్ అవుతున్న ఈ పాటలకు సంగీతమూ ఒక ఫ్లస్ అని చెప్పవచ్చు.
చిన్నప్పటి నుండి కుటుంబాల మధ్య ఉన్న అనుబంధంతో ఆ ఇద్దరు చిన్న పిల్లలు, కలిసి మెలిసి ఆడుతూ పాడుతూ చివరకు పెద్దయ్యాక వరకూ, వారి ప్రేమను అలాగే కొనసాగించడం నిజంగా ఈ పాటలతో ఒక సినిమా స్టోరీనే చూపించారు. మొదటి పాటలో తన ప్రేమను యువకుడు తెలియజేస్తే, ఈ పార్ట్ 2 (Sommasilli Pothunnave Part 2) సాంగ్‌లో ఆ ప్రేమను గుర్తు చేసుకొని ఆ యువతి తన ప్రేమను తెలియజేస్తుంది. ఈ క్రమంలో కుటుంబాల మధ్య ఉన్న తెగిపోయిన బంధాలు మళ్లీ కలుస్తాయి.
వారి ప్రేమ చివరకు గెలిచి పెళ్లి కి దారి తీస్తుంది. ఇరు పెద్దల సమక్షంలో పెళ్లి జరిగి తమ ప్రేమను గెలుచుకున్న విధానాన్ని ఆదర్శ ప్రేమికులకు అంకితం చేశారని చెప్పవచ్చు. నిజంగా సొమ్మసిల్లి పోతున్నవే పార్ట్ 1, 2 పాటలు హిట్ అవ్వడంతో పాటు మంచి మెస్సేజ్‌ను కూడా అందించారని చెప్పుకోవాలి. ఈ పాటను విన్న ప్రతి ఒక్కరూ రామూ రాతోడ్ టీంను అభినందిస్తున్నారు.
Song Credits:
Song Name | SOMMASILLI POTHUNNAVE PART 2 |
LYRICS | RAMU RATHOD |
SINGERS | DIVYA MALIKA – RAMU RATHOD |
MUSIC | KALYAN KEYS |
CASTING | RAMURATHOD, DIVYA BHAGAT |
Youtube Video Song | Link |
Sommasilli Pothunnave Part 2 Song Lyrics
ఎన్నాళ్లదో ఈ బంధము
ఏకమవ్వాలి ఈ నిమిషము
ఆగనాంటోంది నా ప్రాణము
ఇక పై నీతోనే నా పయనము
నిన్ను సూడక ఇన్నాళ్లు
సూసాక నా కళ్ళు
సంద్రాన్ని తలపించేరా
రేపు ఉండేటి నా ఇల్లు
అవ్వాలి హరివిల్లు
నీ నీడలో హాయిరా
నాలోని ఈ బాధను
నీకు పంచాలి నా ప్రేమను
నాతో ఉండేటి ప్రతి జన్మను
నీకు రాసిస్తే నే ధన్యము
నీలోని ప్రేమంతా నాలోనే దాచుంచ నా మనసు గెలిచినోడా
నీతో నా గుర్తులు పదిలాంగానే ఉంచా నా ఏలు వట్టేటోడా
నిదురలోన కూడ నీ పేరే నే తలిచా
నా కంటి రేప్పైనోడా
నీతోనే దూరంగా నేనుండ లేనంటూ నీ సేంత సేరానురా
నన్నెలుకో నా దొర
ఊపిరావుతాను నీకురా
నువ్వే లేక నేనురా
నాలోని ప్రాణమే నీవురా ఆ ఆ ఆ
ఏరోజైనా గాని ఇంత ఆనందాన్ని
నే చూడలేకున్నారా
కానీ నీ కళ్ళలో కళ్ళు చూస్తుంటే
నా ఒళ్ళు పులకరించే చూడరా
ఏనాటికీ నేను నీ ఎదురు సూపును మరువనే మరువనురా
ఎల్లా వేళల నువ్వు నా కోసం తపియించినావు గనకే మురిసారా
కలలోనైనా కనలేదురా
కానుకల్లే కలిసావురా
కడదాకా నీతో నేనురా
కలిసుంటా నీ కౌగిట్లో వాలిరా
సిననాడు నీఎంట తిరిగెటి ఆ వింత సిత్రమై గురుతున్నాదే
సూడసక్కనిదంట మన ఇద్దరి ఈ జంట పండెనే మన పంటనే
ఇంకా సాధించిన మన ప్రేమ
సిక్కులు రాకుండా సల్లంగా వర్ధిల్లనే ఇకపైన సచ్చేదాకా నీతో తోడుగుండి మన ప్రేమను బ్రతికిద్దామె అమ్మోలే లాలించవే నాన్నోలే తోడుంటానే కంటి పాపోలే కాపుండవే చంటిపాపోలే నిను జూత్తనే..
Sommasilli Pothunnave Part 2 Song Mp3 Download