Somayajulapalli Road accident | రోడ్డు ప్రమాదంలో 11 మంది టీచర్లు గాయపడిన సంఘటన కర్నూలు జిల్లాలో సోమవారం చోటు చేసుకుంది. కర్నూలు నుండి నంద్యాలకు Toofan వాహనంలో టీచర్లు ప్రయాణిస్తుండగా ఓర్వకల్ మండలం సోమయాజుల పల్లె ఘాట్ రోడ్డు (Somayajulapalli Road accident)వద్ద టైర్ పగిలింది. దీంతో తుఫాన్ వాహనం బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో 11 మంది టీచర్లకు గాయాలు అయ్యాయి. ప్రమాదంలో గాయపడిన వారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషమంగా ఉన్నవారిని మెరుగైన చికిత్స కోసం kurnool కు తరలించారు.

