Soichiro Honda | 1938 ప్రాంతంలో Tokyo నగరంలో ఒక కుర్రాడు స్వతంత్రంగా Car Piston రింగులు తయారు చేశాడు. అతి కష్టం మీద టయోటా కంపెనీ అపాయింట్‌మెంట్ తీసుకున్నాడు. తన పిస్టన్ రింగులు టయోటా కంపెనీ ఇంజనీర్లకు చూపెట్టాడు. వారు ఆ రింగులు మెచ్చుకున్నారు. నీకు పిస్టన్ రింగులు కాంట్రాక్ట్ ఇవ్వాలంటే, కనీసం Auto Mobile Diploma ఉండాలన్నారు. ఆ కుర్రవాడు నిరాశ చెందకుండా, ఆటోమొబైల్ డిప్లొమా చేశాడు.
హీరోహోండా మెన్ స్టోరీ
అప్పుడు ఆ కార్ పిస్టన్ కుర్రవాడు(Soichiro Honda)కు Toyota కంపెనీకి పిస్టన్ రింగులు తయారు చేసే కాంట్రాక్ట్ పొందాడు. ఆ కాంట్రాక్ట్ కాగితం చూపెట్టి, బ్యాంకులో అప్పు తీసుకొని పిస్టన్ రింగులు తయారు చేసే చిన్న ఫ్యాక్టరీ పెట్టాడు. తొంబై శాతం ఫ్యాక్టరీ నెలకొల్పబడింది. ఇంతలో రెండవ ప్రపంచ యుద్ధపు బాంబు ఒకటి ఫ్యాక్టరీ మీద పడింది. ఫ్యాక్టరీ మొత్తం కాలి బూడిద అయ్యింది. ఆ కుర్రవాడు ఒక్కసారిగా కుప్పకూలాడు.
కానీ వెంటనే తేరుకున్న కార్ పిస్టన్ రింగుల కుర్రవాడు(Soichiro Honda) బ్యాంకుకు వెళ్లి తన పరిస్థితి వెళ్లడించాడు. మళ్లీ అప్పు అడిగాడు. బ్యాంకు వారు ససేమిరా అన్నారు. చేసేది లేక, టయోటా కంపెనీ కాంట్రాక్టు కాగితం పట్టుకుని తన స్నేహితులను కలిసి వారికి ఆ కాగితం చూపెట్టాడు. చేబదులుగా అందరి దగ్గర డబ్బు అప్పు తీసుకున్నాడు. కూలిపోయిన ఫ్యాక్టరీని పునః ప్రారంభించాడు. ఈ సారి 95 శాతం ఫ్యాక్టరీ పూర్తయింది. భూ కంపాలు సర్వ సాధారణమైన ఆ టోక్యో దేశంలో ఓ భూ కంపం ఈ కుర్రవాడి ఫ్యాక్టరీని పూర్తిగా మట్టి కరిపించింది.

దెబ్బకు మన హీరో(Soichiro Honda)కు పాతికేళ్లకే ముసలితనం వచ్చేసింది. వెంటనే స్నేహితులను, బ్యాంకు వారిని కలిసి, తన గోడును వెళ్లగక్కి, వారి అప్పులను తప్పక తీరుస్తానని చెప్పాడు. ఇతని దగ్గర ఏమీ లేకపోవడం చేత, గత్యంతరం లేక వారు ఊరుకున్నారు. ఖరీదైన టోక్యో నగరంలో డబ్బు లేమితో నివసించడం చాలా కష్టంగా ఉంది. దగ్గరలో ఉన్న గ్రామానికి ఆ ముసలి కుర్రవాడు తన మకాం మార్చాడు. ఆ గ్రామం నుండి పట్టణానికి సైకిలు మీద వస్తూ, జీవితం మీద నమ్మకంతో పట్టణంలో ఓ మెకానిక్ గ్యారేజ్‌లో పనికి కుదిరాడు.
ఇన్ని కష్టాలు తట్టుకుని నిలబడటం వల్ల 30 ఏళ్లకే చాలా ముసలితనం అతనిలో చోటు చేసుకుంది. రోజూ సైకిలుకి ఓ మోటారు బిగించి, త్రొక్కనవసరం లేకుండా పట్టణానికి రాసాగాడు. ఆ గ్రామంలో పిల్లలందరూ తమకు అటువంటి మోటారు సైకిలు కావాలని తమ తల్లిదండ్రుల వద్ద పేచీ పెట్టారు. పిదప ఆ గ్రామ తల్లిదండ్రుల ప్రోద్భలంతో ఆ కుర్రవాడు (ముసలివాడు) మోటారు సైకిళ్లను తయారు చేయడం ప్రారంభించాడు.
ఉలా ఉద్భవించిందే హోండా Motorcycle. ప్రపంచ నెంబర్ వన్‌గా పేరు గాంచిన Hero Honda మోటార్ సైకిల్ డిజైన్ అతనిదే. ఆ కుర్రాడి పేరే హోండా(Soichiro Honda)!. హోండా కంపెనీ (జపాన్) కార్ల తయారీలో టయోటాకి మంచి పోటీని ఇస్తోంది. హోండా కంపెనీలో పనిచేసేవారు తమని హోండామెన్ అని పిలుచుకుంటారు.

నీతి: ఆ కుర్రవాడు విజయం పొందే వరకూ చాలా ఉత్కృష్టమైన కష్టాలను అనుభవించాడు. అతని కష్టాల ముందు మన ఈతి బాధలు ఎంత? కాబట్టి చేపట్టిన పనిని పట్టుదలగా చివరివరకు చేయడమే విజయం.