Social Media Banned in Sri Lanka : శ్రీలంకలో ఆర్థిక సంక్షోభానికి వ్యతిరేకంగా నిరసన చేస్తున్న ప్రజలపై ఆ దేశ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. తాజాగా సోషల్ మీడియాను బ్యాన్ చేసింది. ట్విట్టర్, వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, స్నాప్‌చాట్, టిక్‌టాక్ లాంటి సోషల్ మీడియా సేవలను గత అర్ధరాత్రి నుంచి నిలిచిపోయాయి. తప్పుడు సమాచారాన్ని అరికట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు శ్రీలంక ప్రభుత్వం తెలిపింది.
మీడియా నిషేధంపై మంత్రి రియాక్షన్
శ్రీలంక ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడంతో రోజురోజుకూ ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. అధ్యక్షుడు రాజక్సకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలను కట్టడి చేసేందుకు ప్రభుత్వం సోషల్ మీడియాపై నిషేధం విధించింది. సోషల్ మీడియాను నిషేధించడాన్ని తాను ఎప్పటికీ సమర్థించబోనని ఆ దేశ మంత్రి నమల్ రాజపక్స అన్నారు. అలాంటి ఆంక్షలు అసలు పనిచేయవని తెలిపారు. అధికారులు ఆ నిర్ణయాన్ని మరొక్కసారి పునఃసమీక్షించాలని కోరారు.
తీవ్ర సంక్షోభంలో ఉన్న శ్రీలంకలో జనం నానా ఇబ్బందులు పడుతున్నారు. ఆర్థిక సంక్షోభం అత్యంత తీవ్ర రూపం దాల్చింది. ధరలు ఆకాశాన్నంటుతుండటంతో నిత్యవసరాల కొరత, ద్రవ్యోల్బణం వంటి అంశాలతో లంక వాసులు అవస్థలు పడుతున్నారు. శ్రీలంక ప్రభుత్వం ఇప్పటికే 36 గంటల పాటు కర్ఫ్యూ విధించింది. దేశంలో అరాచక పరిస్థితులు మరింత ముదిరే అవకాశం కన్పిస్తుంది.
సోమవారం కర్ఫ్యూ ఎత్తివేత!
దేశవ్యాప్తంగా పలు చోట్ల అస్థిరత రాజ్యమేలుతుండటంతో కర్ఫ్యూ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం ప్రకటించినప్పటకీ తీవ్ర వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో సోమవారం ఉదయం కర్ఫ్యూ ఎత్తివేయ నున్నారు. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ నిరసన ప్రదర్శనకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ కర్ఫ్యూ విధించినట్టు తెలుస్తోంది. శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స ఇప్పటికే దేశంలో అత్యవసర పరిస్థితి విధించారు. ఆదివారం నైట్ వరకూ కర్ఫ్యూ విధించారు. ప్రజలు ఎవ్వరూ బయటకు రాకుండా ఆంక్షలు విధించారు. ఎవరు దీనిని అతిక్రమించినా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు యంత్రాంగానికి పూర్తి అధికారాలు ఆదేశించారు శ్రీలంక అధ్యక్షుడు. మరో వైపు ప్రభుత్వ అసమర్థత విధానాలే శ్రీలంక ప్రస్తుత దుస్థితికి కారణమని ఆర్థిక వేత్తలు అభిప్రాయపడుతున్నారు.
Social Media Banned in Sri Lanka
శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స నేతృత్వంలో ప్రభుత్వం శ్రీలంకలో అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్న అనాలోచిత నిర్ణయాలు సంక్షోభాన్ని మరింత ముదిరేలా చేశాయి. దేశ పాలనలో స్థిరత్వం తెస్తానంటూ వాగ్ధానాలు చేసిన రాజపక్స 2019లో అత్యధిక మెజార్టీతో అధికారంలోకి వచ్చారు. అధికార పీఠం ఎక్కిన తర్వాత తక్కువ పన్ను రేట్ల వంటి అమలుకు సాధ్యం కాని అనేక హామీలను సర్కార్ అమలు చేసింది. సోషల్ మీడియా వేదికగా కొందరు ప్రజలను రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తుండటంతో తాజాగా శ్రీలంక ప్రభుత్వం సోషల్ మీడియాపై నిషేధం విధించినట్టు ఆదివారం ప్రకటించింది. అయితే శ్రీలంకలో శనివారం అర్థరాత్రి దాటిన తర్వాత నుండే సోషల్ మీడియా సేవలు నిలిచిపోయాయి.
- Panasakaya Biryani: పనసకాయ బిర్యానీ తయారీ నేర్చుకోండి!
- lord krishna stories: లార్డ్ కృష్ణ ఆలోచనకు సృష్టికర్తే మోకరిల్లాడు!
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!