Snow Akka | తెలుగులో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు తీసి టాలీవుడ్లో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న అగ్రహీరో మంచు మోహన్‌బాబు ఈ మధ్య కాలంలో అనగా ఈ 2022 సంవత్సరంలో చేదు అనుభవాన్ని ఎదుర్కొంటున్నారు. యూట్యూబ్ ఓపెన్ చేయగానే Troll అనే పదంలో ముందుగా వారి కుమారుడు మంచు విష్ణు, కుమార్తె మంచు లక్ష్మి ఫన్నీ వీడియోలే దర్శనం ఇస్తున్నాయి. ఇంతకు ఎందుకు అలాంటి పరిస్థితి వచ్చిందనేది ఈ పాటికి అందరికీ తెలుసు. తెలుగులో ప్రముఖ కమెడియన్ బ్రహ్మానందం వీడియోలు చూస్తే నవ్వు వచ్చేది. కానీ ఇప్పుడు వీరి వీడియోలు చూసి జనం నవ్వుకుంటున్నారు. దీనికి కారణం Youtubలో కొన్ని ఛానెళ్లు అని చెప్పవచ్చు.
స్నో అక్క పేరు వైరల్
బుట్టలో కొన ఊపిరితో ఉన్న చేపలు ఎగిరి ఎగిరి నీటిలో పడినట్టు… యూట్యూబ్‌లో కొన్ని ఛానెళ్లు మంచు మోహన్‌బాబు ఫ్యామిలీని టార్గెట్ చేసి కామెడీ పేరుతో వారిని ట్రోల్ చేస్తూ లక్షల వ్యూస్‌ను సంపాది స్తున్నాయి. నిన్న మొన్నటి వరకు సబ్స్క్లైబర్లు లేని యూట్యూబ్ ఛానెళ్లు కూడా వీరి వీడియోలు పెట్టి ఒక్కసారిగా మానిటైజ్ సిస్టమ్లోలోకి అడుగు పెట్టారు. అంటే వీడియోల మీద యాడ్స్ రన్ కూడా అవుతున్నాయి. ఇటీవల మా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచి ప్రెసిడెంట్ అయిన మంచు విష్ణు మీడియాతో మాట్లాడినప్పటి నుంచి ఆ హీరోను ట్రోల్ చేయడం ప్రారంభించారు యూట్యూబర్స్. ఇక వచ్చీ రాని తెలుగులో మాట్లాడుతూ ఇంగ్లీష్‌ను అమెరికన్స్ లెవల్లో మాట్లాడే మంచు లక్ష్మి ఎప్పటి నుంచో ట్రోల్‌లో చిక్కుకు పోయారు.
మంచు మోహన్‌బాబు కుమార్తె మంచు లక్ష్మిని ట్రోల్‌లో హెడ్డింగ్ Snow Akka అని పెట్టి తెగ వీడియోలు చేస్తున్నారు. వీటిలో ఎక్కువుగా మంచు లక్ష్మి మాట్లాడే language మీదనే కామెడీ వీడియోలు చేస్తున్నారు. ఎక్కువుగా ఆమె ట్రోల్ అయిన పదం నిలదీస్ఫై.. అని చెప్పవచ్చు. ఆ తర్వాత మంచు లక్ష్మీ వ్యాఖ్యతగా Lakshmi Talk show లోని తన తండ్రి మోహన్‌బాబును ఇంటర్వ్యూ చేసే సన్నివేశాలను ట్రోల్ చేస్తున్నారు. ఆ తర్వాత ఆమె హీరోయిన్గా తీసిన Gundello Godari(2013 film) ఆడియో రిలీజ్లో మంచు లక్ష్మి మాట్లాడుతూ నీకుందుకు సినిమా అని అన్నవాళ్లకు సమ..నాధం ఇవనన్నాను.. అనే పదంతో ట్రోల్ చేయడం ప్రారంభించారు.
పొగుడు కోవడమే తప్పైందా?
ఇంకా ఇవ్వే కాకుండా లక్ష్మి మంచుపై స్నో అక్క(Snow Akka) పేరుతో పదుల సంఖ్యలో ట్రోలింగ్ వీడియోలు వచ్చాయి. ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి. లక్ష్మి మంచు ఎక్కువుగా పబ్లిక్ ముందు తమకు తామే పొగుడు కోవడంతో అందుకు గాను Bajana..ప్రతి దానికీ భజన.. పేరుతో ట్రోల్ చేస్తున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ట్రోల్ అవుతున్న చాలామంది సెలబ్రిటీలు ఉన్నప్పటికీ మంచు ఫ్యామిలీ మీద వచ్చే ట్రోలింగ్ వీడియోలను ఎక్కువుగా నెటిజన్లు చూస్తున్నారు. లక్ష్మీ మంచు ఇప్పటి వరకు ప్రధాన పాత్రలైతే గానీ, హీరోయిన్గానైతే 10 సినిమాలకు పైగా తీశారు. అందులో కొన్ని సినిమాలు విజయం కూడా అందుకున్నాయి. 44 సంవత్సరాల వయస్సు ఉన్న Lashmi Manchu ఇప్పటికీ యంగ్ హీరోయిన్గా కనిపిస్తూ సినిమాల్లోనూ, టీవీ షోల్లోనూ నటిస్తూనే ఉన్నారు.తనపైన ట్రోల్స్ ఎన్ని వచ్చిన సినిమా ఫీల్డ్‌లో ఇవ్వన్నీ మామూలే అంటూ తన పని తాను చేసుకుంటూ వెళుతున్నారు.
- Panasakaya Biryani: పనసకాయ బిర్యానీ తయారీ నేర్చుకోండి!
- lord krishna stories: లార్డ్ కృష్ణ ఆలోచనకు సృష్టికర్తే మోకరిల్లాడు!
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!