Sneham

Sneham: మీ ఇద్ద‌రి స్నేహం నిజ‌మైన స్నేహ‌మేనా? Best Friend అంటే ఎలా ఉండాలి?

motivation-Telugu
Share link

Sneham | ప‌దిమంది స్నేహితుల్లో ఒక‌రిని త‌నే నా Best Friend అని చెప్పు కోవ‌డం ఒక్క‌టే కాదు. త‌న‌తో మీ స్నేహం ప‌దిలంగా కొన‌సాగాలంటే తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు కొన్ని ఉన్నాయి. స్నేహితురాలైన స‌రే, త‌న‌లోని ప్ర‌త్యేక‌తల్ని గుర్తించండి. అవ‌కాశం వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా వాటిని గుర్తు చేసి మాట‌ల‌తో ప్ర‌శంసించండి. అది అవ‌తలి వారికీ ఆనందం క‌లిగిస్తుంది. వాటిల్లోంచి మీరేం నేర్చుకున్నార‌నేదీ తెలియ‌జేయండి.

స్నేహితురాలు(friend) ఏదైనా చెబుతున్న‌ప్పుడు ఏమ‌రుపాటుగా కాకుండా ఆస‌క్తిగా విన‌డం అల‌వాటు చేసుకోండి. విజ‌యాలు సాధించిన‌ప్పుడు ప్ర‌శంసించ‌డం, వైఫ‌ల్యం ఎదురైన‌ప్పుడు అండగా నిల‌వ‌డం కూడా స్నేహ‌ బంధం (friendship)తో పాటించాల్సిన నియ‌మాల‌ని మ‌ర‌వ‌కండి. ఎంత మందిలో ఉన్నా, మీ మ‌న‌సులో త‌న‌కో ప్ర‌త్యేక స్థానం ఉంటుంద‌నే విష‌యాన్ని సంద‌ర్భోచితంగా త‌న‌కు తెలియ‌జేస్తుండండి.

స్నేహ‌(Sneham)బంధంలో పాటించాల్సిన మ‌రో నియ‌మం, ర‌హ‌స్యాల‌ను మ‌రొక‌రికి చెప్ప‌క‌వ‌పోవ‌డం. మీ మ‌ధ్య ఉన్న ర‌హ‌స్యాలు మీకు మాత్ర‌మే తెలుసుండాలి. వాటి గురించి మీరే చ‌ర్చించుకోవాలి. అవ‌త‌లి వారికి చెప్ప‌డం స‌మంజసం కాదు. దీన్ని క‌చ్చితంగా పాటించిన‌ప్పుడే అవ‌త‌లి వారు మిమ్మ‌ల్ని న‌మ్ముతారు. ఎంత జాగ్ర‌త్త‌గా ఉన్నా, కొన్నిసార్లు స్నేహితురాలితో స‌మ‌స్య‌లు రావ‌చ్చు. అలాంట‌ప్పుడు మౌనంగా ఉండిపోవ‌డంలో అర్థం లేదు. దాన్ని చ‌ర్చించాలి. త‌గ్గించుకునే మ‌ర్గాల‌ను ఇద్ద‌రూ క‌లిసి ఆలోచించాలి. మౌనంగా ఉండ‌టం మాత్రం ప‌రిష్కారం కాదు. ఒక వేళ మీ వ‌ల్ల ఏదైనా త‌ప్పు జ‌రిగితే, నిజాయితీగా అంగీక‌రించాలి. దిద్దుకునే ప్ర‌య‌త్నం చేయాలి.

Best Friend అంటే ఎలా ఉండాలి

1)చిరున‌వ్వు లాంటి నీ (Sneham) నాకు దేవుడు ఇచ్చిన వ‌రం.
నీ స్నేహం అంతులేనిది, అతీత‌మైన‌ది స్వార్థం లేనిది.
అలాంటి నీ స్నేహం ఎప్ప‌టికీ నాకు ఇలాగే ఉండాల‌ని
ఆశిస్తూ ఎప్ప‌టికీ నిను మ‌రిచిపోలేని నీ నేస్తం.

2) జీవిత‌మ‌నే వృక్షానికి కాసే పండ్లు
అధికారం, సంప‌ద అయితే,
ఆత్మీయులు, స్నేహితులు
ఆ వృక్షానికి వేర్లు..
పండ్లు లేక‌పోయినా
చెట్టు బ్ర‌తుకుతుందేమో కానీ
వేర్లు లేక‌పోతే బ్ర‌త‌క‌లేదు!!

3)బాధ‌లో అయినా
సంతోషంలో అయినా
డ‌బ్బున్నా, లేకున్నా
ఎవ‌రున్నా, లేకున్నా
నీకు నేనున్నా నేస్తం
అని తోడుండేవాళ్లే
నీ నిజ‌మైన స్నేహితులు!!

4)నువ్వు అర్థం కావ‌ట్లేదు అంటే
వాళ్ల‌కు నీవు అవ‌స‌రం లేద‌ని అర్థం
నీ మాట‌లు అర్థం కావ‌డం లేదంటే
నిన్ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్న‌దే లేద‌ని అర్థం!

5)ఆప‌ద‌లో అవ‌స‌రాన్ని…
బాధ‌లో మ‌న‌సుని తెలుసుకుని
స‌హాయ‌ప‌డేవాడే నిజ‌మైన స్నేహితుడు

6) మాటల‌తో పుట్టి
చూపుల‌తో మొద‌ల‌య్యేది
కాదు స్నేహ‌మంటే
మ‌న‌సులో పుట్టి
మ‌ట్టిలో క‌లిసేంత వ‌ర‌కు
తోడుగా ఉండేది స్నేహం

See also  friendship story 2022: ప్రేమ చేయిచ్చింది! స్నేహం చేదోడైంది.(స్టోరీ)

7)నిజాయితీగా ఉంటే
చాలా మంది ఫ్రెండ్స్‌
ఉండ‌క‌పోవ‌చ్చు కానీ
ఒక‌రిద్ద‌రైనా స‌రే
నిజ‌మైన ఫ్రెండ్స్ ఉంటారు.

8)కాలం అన్నీ మ‌ర‌చిపోయేలా చేస్తుంది
కానీ కాలాన్ని కూడా మ‌రిచిపోయేలా చేసేది
నిజ‌మైన స్నేహం!

9)ఆకాశంలోని న‌క్ష‌త్రాల వంటివారు
కొన్నిసార్లు క‌ళ్ళ‌కు క‌న‌ప‌డ‌క‌పోయినా
అవ‌స‌ర‌మైన సంద‌ర్భాల‌లో
మ‌న‌కు స‌హాయం చేయ‌డానికి సిద్ధంగా ఉంటారు.

10)విడిపోతే తెలుస్తుంది మ‌నిషి విలువ‌
గడిస్తే తెలుస్తుంది కాలం విలువ‌
స్నేహం చేస్తే మాత్ర‌మే తెలుస్తుంది స్నేహితుడి విలువ‌.

Leave a Reply

Your email address will not be published.