Snake island brazil:ఆ దీవిలో ఎటు చూసినా పాములే.. స్నేక్ ఐలాండ్ విశేషాలు గురించి తెలుసుకుందాం!

0
15

Snake island brazil చుట్టూ స‌ముద్రం..మ‌ధ్య‌లో ఓ అంద‌మైన దీవి. స‌ర‌దా ప‌డి అక్క‌డికి వెళ్లామంటే.. భ‌య‌ప‌డిపోవ‌డం ఖాయం. ఎందుకంటే, ఆ దీవి నిండా విష‌సర్పాలే. ఇంత‌కీ ఈ భ‌యంక‌ర‌మైన దీవి ఎక్క‌డుంది? అనుకుంటున్నారా? బ్రెజిల్ తీరానికి 150 కిలోమీట‌ర్ల దూరంలో స‌ముద్రం మ‌ధ్య‌లో ఉన్న ఈ దీవి పేరు క్యుమెడా గ్రాండే. సుమారు 110 ఎక‌రాలున్న దీంట్లో అడుగ‌డుగునా పాములు తిరుగుతుంటాయి. అవ‌న్నీ క‌లిపితే సుమారు 7 వేలు ఉంటాయ‌ట‌. ప్ర‌పంచంలోనే అత్య‌ధిక స‌ర్పాల సాంద్ర‌త క‌లిగిన ప్ర‌దేశం కూడా ఇదే. అందుకే దీన్నంతా ‘స్నేక్ ఐలాండ్‘ అనే పిలుస్తారు. మరో ఆస‌క్తిక‌ర‌మైన సంగ‌తేంటో (Snake island brazil)తెలుసా?

ఈ దీవిలో ఉండే పాముల‌న్నీ ఒకే జాతికి చెందిన‌వి. వాటి పేరు గోల్డెన్ లాన్స్ హెడ్‌. మూడ‌డుగుల పొడ‌వుతో బంగారు రంగులో చూడ్డానికి భ‌లే ఉంటుంది. కానీ ఇది ప్ర‌పంచంలోనే అత్యంత విష‌పూరి త‌మైన పాముల్లో ఒక‌టి. ఇది కాటేసిన చోట చుట్టూ మాంసం క‌రిగిపోతుంటే దీని విషం ధాటి ఏ పాటితో ఊహించుకుంటేనే భ‌య‌మేస్తుంది. ఈ పాము ఇక్క‌డి దీవిలో త‌ప్ప మ‌రెక్కడా జీవించ‌దు. ఇక్క‌డ ఈ పాములు త‌ప్ప మ‌రే జంతువులూ ఉండ‌వు. వీటికి స‌హ‌జ శ‌త్రువులేవీ లేక‌పోవ‌డంతో వీటి సంఖ్య ఇబ్బ‌డి ముబ్బ‌డిగా పెరిగింది. ఈ పాముల సంతానోత్ప‌త్తి కూడా చాలా ఎక్కువ‌.

స‌ముద్రం మీదుగా వ‌ల‌స‌పోయే ప‌క్షులు సేద తీరడానికి ఈ దీవిలో వాలుతుంటాయి. వాటినే పాములు భోంచేసి కాల‌క్షేపం చేస్తుంటాయి. ఇక ఈ దీవిలోకి మ‌నుషులెవ‌రికీ ప్ర‌వేశం లేదు. బ్రెజిల్ నావికాద‌ళం వారు నిషిద్ధ దీవిగా దీన్ని ప్ర‌క‌టించారు. ఇక్క‌డ ఒకే ఒక వ్య‌క్తి ఉంటాడు. అత‌ను ఎవ‌రో తెలుసా? ఓడ‌ల కోసం ఏర్పాటు చేసిన లైట్ హౌస్‌లో ప‌నిచేసే ఉద్యోగి. అత‌నికి ప్ర‌త్యేక ర‌క్ష‌ణ చ‌ర్య‌లు ఉంటాయిలేండి. ఇక ప‌రిశోధ‌కులు ఎవ‌రైనా వెళ్లాల‌నుకుంటే మాత్రం ప్ర‌భుత్వం నుంచి ప్ర‌త్యేక అనుమ‌తి తీసుకోవాలి. ఇక్క‌డికి వెళ్లి ప‌రిశోధించిన శాస్త్ర‌వేత్త‌లు దీవిలో చ‌ద‌ర‌పు మీట‌ర్‌కు ఒక‌టి నుంచి 5 పాములు ఉన్నాయ‌ని లెక్క‌గ‌ట్టారు. గ‌తంలో కొంత మంది ఈ దీవిలోని పాముల్ని తీసేసి అర‌టి తోట‌లు పెట్టాల‌ని ఆలోచ‌న చేశారు. కానీ అది కుద‌ర‌లేదు. అయితే ఇప్ప‌టికే దీంట్లో కొన్ని అర‌టి చెట్లు ఉన్నాయట‌.

ఈ దీవికి వెళ్లి గ‌తంలో చ‌నిపోయిన వారి సంగ‌తులు క‌థ‌లుగా చెప్పుకుంటారు. ఒక‌సారి మ‌త్స్య కారుడు ప‌డ‌వ‌లో ఇక్క‌డికి వ‌చ్చాడు. అర‌టిపండ్లు క‌నిపించి వాటిని కోద్దామ‌ని పైకెక్క‌గానే పాము కాటుకు గురై చ‌నిపోయార‌ట‌. ఇక గ‌తంలో ఇక్క‌డి లైట్ హౌస్‌లో ప‌నిచేసే కుటుంబం మొత్తం పాముకాటుకు గురై చ‌నిపోయార‌ట‌.

Latest Post  Born in May: మే నెల‌లో పుట్టిన‌ వారి ఫ‌లితాలు ఇలా ఉంటాయ‌ట‌!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here