Snake Bite

Snake Bite : పాము కాటుతో ఒడిస్సా వ్య‌క్తి మృతి

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌

Snake Bite : Chittoor : పాము కాటులో ఒడిస్సా రాష్ట్రానికి చెందిన ఓ వ్య‌క్తి మృతి చెందిన సంఘ‌ట‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా చంద్ర‌గిరి స‌మీపంలో మంగ‌ళ‌వారం చోటు చేసుకుంది. ఒడిస్సా రాష్ట్రం క‌ల‌హండి జిల్లా జునాగ‌ర‌న దాన చిగిన‌స‌ర్ జ‌వ‌హ‌ర్ బంద్ గ్రామానికి చెందిన ఐదుగురు వ్య‌క్తులు చిత్తూరు జిల్లా చంద్ర‌గిరి స‌మీపంలోని ఉగ్ర ప్ర‌త్యుంఘ అమ్మ‌వారి గుడి వెనుక ఉన్న ప్రైవేటు అపార్ట్మెంట్లో బ‌య‌ట డేరాలో నిద్రిస్తున్నారు. వారిలో జ‌య‌సింఘ్ అనే వ్య‌క్తిని నాగు పాము కాటేసింది. మెలుకువ వ‌చ్చి సోమ‌వారం రాత్రి చుట్టుప్ర‌క్క‌ల చూడ‌గా వారు నిద్రిస్తున్న చోట పాము క‌నిపించింది. వెంట‌నే ఆ పామును చంపేశారు. అనంత‌రం కాల్చి వేశారు. య‌ధావిధిగా ఐదుగురు వ్య‌క్తులు ఒకే చోట నిద్ర పోయారు.

కాటేసిన పామును కాల్చివేసిన దృశ్యం – నిద్ర‌పోయిన ప్ర‌దేశం

సుమారు 3 గంట‌ల ప్రాంతంలో జ‌య‌సింఘ్ నిద్ర లేచి త‌న శ‌రీరం మైకం క‌మ్ముతుంద‌ని చెప్పాడు. ప్ర‌క్క‌న ఉన్న గ‌మ‌నించే లోపు నోటి నుంచి నుర‌గ‌లు వ‌చ్చాయి. జ‌య‌సింఘ్ ను పాము కాటు(Snake Bite) వేసి ఉంటుంద‌ని తెలుసుకొని 108 కు స‌మాచారం ఇచ్చారు. వెంట‌నే తిరుప‌తి రుయా ఆసుప‌త్రికి అత్య‌వ‌స‌ర చికిత్స‌కు త‌ర‌లించారు. రుయా ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ అత్య‌వ‌స‌ర విభాగం వార్డులో మంగ‌ళ‌వారం ఉద‌యం చ‌నిపోయాడ‌ని డాక్ట‌ర్లు తెలిపారు. ఈ విష‌యం చంద్ర‌గిరి పోలీసుల‌కు తెలియ‌జేయ‌గా కేసు న‌మోదు చేసి విచారిస్తున్నారు.

Share Link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *