smoking and pian ధూమపానం చేసే వారికి వెన్ను నొప్పి, కడుపునొప్పి వంటి వాటి నుంచి ఉపశమనం పొందాలనుకుంటే సిగరెట్లు ముట్టించడం మానెయ్యండి. ఎందుకంటే పొగతాగే వారికి వెన్ను నొప్పి వచ్చే అవకాశం మూడు రెట్లు ఎక్కువ! అలాగే కడుపు నొప్పి, కీళ్ల నొప్పి వంటివీ మరింత తీవ్రమవుతాయి(smoking and pian) కూడా.

పొగ త్రాగే వారిలోనే నొప్పులు !
నొప్పుల చికిత్స కోసం వెళ్లే వారిలో సగానికన్నా ఎక్కువ మంది పొగ అలవాటు గలవారే. నిజానికి పొగాకులోని నికొటిన్ మొదట్లో కాస్త హుషారుని తెచ్చి పెడుతుంది. నొప్పి తగ్గిన భావననూ కలుగజేస్తుంది. దీనికి కారణం నికొటిన్(nicotine) ఉత్సాహాన్ని, ఆనందాన్ని కలిగించే డోపమైన్ వంటి రసాయనాలు విడుదలయ్యేలా ప్రేరేపించటమే. కాబట్టి పొగ అలవాటు చిన్నగానే మొదలైనా చివరికి అదో పెద్ద వ్యసనంలా అంటుకు పోతుంది. కానీ ఇదే పొగాకు కణజాలాల్లోకి, ఎముకల్లోకి ఆక్సిజన్‌తో నిండిన రక్తం సరఫరా కావడాన్ని కూడా దెబ్బతీస్తుంది.
రక్త సరఫరాకు ఆటంకం!
దీంతో తగినంత రక్తం, పోషకాలు అందక కణజాలాలు, ఎముకలు క్రమంగా క్షీణించడం మొదలవుతుంది. ముఖ్యమంగా అప్పటికే రక్త సరఫరా తక్కువుగా జరిగే వెన్నెముక దెబ్బతిని. చివరికి నడుంనొప్పికి దారి తీస్తుంది. కొందరిలో ఎముకలూ క్షీణిస్తాయి. పొగ తాగడం వల్ల తీవ్ర నిస్సత్తువతో పాటు దెబ్బతిన్న భాగాలు నయం కావడం ఆలస్యమవుతుందనీ వైద్యులు భావిస్తున్నారు. ఇవి కూడా నొప్పి సమస్యలను మరింత తీవ్రం చేసేవే. అందువల్ల పొగతాగేవారు నొప్పులతో బాధపడుతుంటే ముందుగా ఆ అలవాటును మానెయ్యడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

రోగ నిరోధక శక్తి తగ్గుదల!
పొగ మూలంగా రోగ నిరోధక వ్యవస్థ దెబ్బతిని, ఆపరేషన్ తర్వాత ఇన్ఫెక్షన్ల ముప్పూ పెరుగుతుంది. అందువల్ల వీరికి కృత్రిమ మోకాలు వంటి పరికరాలను అమర్చడమూ కష్టమైన ప్రక్రియగా మారుతుంది. కాబట్టి పొగ అలవాటును మానెయ్యటానికి స్థిరమైన నిర్ణయాన్ని తీసుకుని, దానికి కచ్చితంగా కట్టుబడి ఉండటం అలవరచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇందుకు అవసరమైతే వైద్యుల సాయం కూడా తీసుకోవచ్చు. వ్యాయామం చేయటమూ మంచి ఫలితానిస్తుంది.
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్‌లెస్ మటన్ బిర్యానీ తయారీ