slim and fit సన్నగా, మల్లెతీగలా కనిపించాలని ఏ అమ్మాయికి మాత్రం ఉండదు. కానీ అలా కనిపించడానికి సరైన మార్గాన్ని ఎంచుకోకపోతే మాత్రం ఇబ్బంది తప్పదు. అతిగా వ్యాయామం, కడుపు మాడ్చుకోవడం వంటివేవీ ఫలితాన్ని ఇవ్వకపోగా ప్రతికూల పరిస్థితుల్ని తెచ్చిపెడతాయి. (slim and fit)మరేం చేయాలంటే..
అసలు రోజుకు మీరు ఎంత ఆహారం తీసుకోవాలి. ఎలాంటిది తీసుకోవాలన్నది ప్రాథమికంగా తెలుసుకోండి. అతిగా తినడం, అస్సలు తినకపోవడం రెండూ సరికాదు. మీకు ఇష్టం కదాని ఒకే తరహా ఆహారాన్నే పదేపదే తీసుకునే కంటే ఎప్పటికప్పుడు అన్ని రకాల పోషకాలూ అందేలా ఆహార ప్రణాళికను రూపొందించుకోవాలి. అలానే కాలేజీకి వెళ్లే సమయంలో ఎంత తీరికలేకున్నా సరే ఉదయం పూట అల్పాహారం తీసుకోవడం మానొద్దు. రోజు ప్రారంభంలో మీరు తీసుకునే ఆహారమే మిమ్మల్ని రోజంతా చురుగ్గా ఉంచుతుందని గుర్తుంచుకోండి.


మీ శరీర బరువును తగ్గించడానికి కాదు మీ చర్మాన్ని మరింత అందంగా కనిపించేలా చేయడంలోనూ నీళ్ల పాత్ర కీలకం. అధికంగా తీసుకున్న ఆహారాన్ని జీర్ణం చేయడంలో నీళ్లు ప్రధానంగా పనిచేస్తాయి. ఫలితంగా శరీరంలో వ్యర్థాలు పేరుకోవు. కొవ్వు సమస్య కూడా తగ్గుతుంది. ఉదయాన్నే లేచి వ్యాయామం చేయమంటే చాలా మంది అమ్మాయిలకు ఇబ్బందే. నడక, పరుగు లాంటివి నచ్చనప్పుడు ఇష్టమైన దాన్నే వ్యాయామంగా ఎంచుకుంటే మంచిది కదా.. అందుకే రోజూ నిద్రలేచాక ఓ పావుగంటైనా మీకు నచ్చిన పాటకు ఉత్సాహంగా, వేగంగా నృత్యం చేయండి. ఇలా చేస్తున్నప్పుడు 15 రోజులకోసారి మీ శరీర బరువును గమనించుకుంటూ ఉండండి. లేదంటే పాటలో ఫిట్నెస్ను అందించే జుంబా, సల్సా తరగతులకు హాజరైనా మంచిదే.


ప్రస్తుతం ఇంట్లోనే వర్కవుట్స్ సొంతంగా చేసుకోవడానికి యాండ్రాయిడ్ ఫోన్లలో కొత్త కొత్త యాప్‌లు కూడా వచ్చాయి. ఉదయాన్నే కాలేజీకి వెళ్లడం, సాయంత్రం అలసిపోవడం వంటి కారణాల వల్ల జిమ్‌కు వెళ్లే సమయం దొరకకపోవచ్చు. అలాంటి వారు స్మార్ట్ ఫోన్లో కొన్ని యాప్స్(fitness apps)ను ఇన్స్టాల్ చేసుకుంటే చాలా మంచిది. ఇంట్లో యోగా చేయడం, ఆసనాలు చేయాలనుకునే వారికి యోగా యాప్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. వాటి సహాయంతో డైలీ యోగాలు, ఆసనాలు చేసుకోవచ్చు. ఇంకా కొన్ని యాప్స్‌లో పదేళ్లకు పైగా టీచింగ్ అనుభవం ఉన్న ప్రొఫెషనల్స్ అందించిన కంటెంట్ ఈ యాప్‌లో ఉంటుంది. కొన్ని వందలకు పైగా వీడియోలు మీ ఫిట్నెస్ పెంచుకునేందుకు సహాయ పడతాయి.


- MLA Seethakka: తెలంగాణలో నీళ్లేవూ..నిధులూ లేవూ!
- Nelluri Nerajana Song lyrics:నెల్లూరి నెరజానా నీ కుంకుమల్లె మారిపోనా లిరిక్స్ | Oke Okkadu Movie
- surface tension: వర్షపు బిందువుల, Soap bubble, పాదరస బిందువులు గోళాకారంలోనే ఎందుకుంటాయి?
- Viscosity: రక్తం వేగాన్ని నియంత్రించుకోవాలన్నా, సముద్రంలో కెరటాలు తాకిడి తగ్గాలన్నా స్నిగ్థతే కారణం!
- Hands: అందమైన చేతుల తళతళా మెరవాలంటే ఇలా చేయండి!