skipping: రకరకాల వ్యామాలపై దృష్టి సారిస్తూ కొందరు తమ శరీర సౌష్టవాన్ని సంరక్షించుకుంటుంటే, ఇంకొందరు మాత్రం రోజూ ఒకే వ్యాయామాన్ని రోజు అనుసరిస్తూ తమ శరీరాన్ని Fitగా ఉంచుకుంటున్నారు. ఇది ఎలా సాధ్యం?.
శరీరం మొత్తానికి ఒకే Exercise. తాడాట(skipping)తో సాధ్యమవుతుందని ఫిట్నెస్ ఎక్సపర్ట్స్ సూచిస్తున్నారు. శరీరంలోని అవయవాల కదిలికను వేగవంతం చేయడంతో పాటు వాటి మధ్య సమన్వయానికి స్కిప్పింగ్ తోడ్పడుతుందట. రోజూ స్కిప్పింగ్ చేయడం వల్ల శరీరం ధీడత్వాన్ని సంతరించుకోవడంతో పాటు పూర్తి స్థాయిలో ఫిట్‌గా తయారవుతుంది. ఎముకలు గట్టిపడటంతో పాటు చర్మంపై ఏర్పడ్డ ముడతలు తొలిగిపోతాయి. స్కిప్పింగ్ చేసేటప్పుడు కొన్నిజాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి.
పాదాలకు రక్షణ లేకుండా స్కిప్పింగ్(skipping) చేయడం వల్ల అరికాళ్లకు నొప్పి కలుగుతుంది. దీంతో పాదాలలో పగుళ్లు ఏర్పడతాయి. ముఖ్యంగా కాంక్రీట్ నేలపై స్కిప్పింగ్ చేసే సందర్భంలో బూట్లు వేసుకోవడం మంచింది. బరువు తగ్గించడంలో స్కిప్పింగ్ కీలక పాత్ర పోషిస్తుంది. వార్మప్ చేయడం వల్ల శరీరం ఉల్లాసంగా ఉంటుంది. తొడలు, చేతులు, భుజాలు, Stomach భాగంలో ఏర్పడిన ఫాట్ నిల్వలు కరిగిపోయి కండరాలు పటిష్టంగా తయారవుతాయి.