Pendurthi Murdered : వరుస హత్యలతో ఉలిక్కిపడ్డ విశాఖ! | Six of a family brutally murdered
Pendurthi Murdered : విశాఖపట్టణం : విశాఖ జిల్లా వరుస హత్యలతో గురువారం తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఒక కుటుంబంలో ఆరుగురు హత్యకు గురవ్వడం, మరో ప్రాంతంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందడంతో విశాఖ ప్రాంతం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. విశాఖ జిల్లా పెందుర్తి మండలం జుత్తాడలో దారుణం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగుర్ని కిరాతకంగా హత్య చేశాడు ఓ వ్యక్తి. నిందితుడ్ని అప్పలరాజుగా గుర్తించారు. పాత కక్షలతోనే ఆరుగుర్ని చంపినట్టు తెలుస్తోంది. చనిపోయిన వారిలో ఇద్దరు చిన్నారులు సైతం ఉన్నారు. నిద్ర మత్తులో ఉన్నవారిపై దాడి చేసినట్టు అనుమానిస్తున్నారు. అందరూ రక్తపు మడుగులో పడి ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లారు.


హత్యకు గల కారణాలు ఇవేనా?
హంతకుడు బత్తిన అప్పలరాజు కూతురు పార్వతిని బమ్మిడి విజయ్ కుమార్ ఒకరికొకరు ప్రేమంచుకు న్నారు. పెళ్లి చేసుకుంటానని చెప్పి బొమ్మిడి విజయ్ కుమార్ మోసం చేయడంతో 2018 సంవత్సరంలో విజయ్ కుమార్ పై పెందుర్తి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. బొమ్మడి విజయ కుమార్ విజయవాడకు చెందిన ఉషారాణిని పెళ్లి చేసుకుని విజయవాడ వెళ్లిపోయాడు.
బొమ్మిడి విజయ్ కుమార్, ఉషారాణిలకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే జుత్తాడ గ్రామంలో మాత్రం విజయ్‌కుమార్ తండ్రి బొమ్మిడి రమణ ఒక్కరే నివాసముంటున్నారు. ఎంపీటీసీ ఎన్నికల నేపథ్యం లోఇటీవల ఓటు వేయడానికి విజయ్ కుమార్ భార్య ఉషారాణి, తన సొంత అత్త, చిన్నత్త జుత్తాడ గ్రామంకు వచ్చి ఉన్నారు. బంధువుల వివాహం మరికొద్ది రోజుల్లో ఉండటంతో గ్రామంలోనే ఉండిపోయారు. బమ్మిడి విజయ్ కుమార్ తన పెద్ద కుమారుడుని తీసుకొని శివాజీ పాలెంలో ఉండిపోయాడు.


జుత్తాడ గ్రామంలో బొమ్మిడి విజయ్ కుమార్ తండ్రి రమణ, భార్య ఉషారాణి, ఇద్దరు పిల్లలు, అత్త, చిన్నత్త ఇంటిలో ఉన్నారు. తెల్లవారుజామున చిన్నత్త బయటకు వచ్చి వాకిలి కడుగుతుండగా బత్తిని అప్పలరాజు ఆమెపై కత్తితో దాడి చేసి చంపాడు. వెంటనే ఇంట్లోకి ప్రవేశించి విచక్షణారహితంగా ఇద్దరు చిన్న పిల్లలను విజయ్ కుమార్ భార్య, అత్త, మామలను కత్తితో నరికి చంపేశాడు. ఇంటి నుంచి బయటకు వచ్చి అరుగుపైన అరగంట సేపు కూర్చొన్నాడు. అనంతరం 100 కి కాల్ చేయడంతో పెందుర్తి పోలీసులు వచ్చి అరెస్టు చేశారు.
- Amba Story: భీష్ముడిపై అంబ ఎలా పగతీర్చుకున్నది? పురాణ గాథ స్టోరీ
- Adivasi Homes: అరణ్యంలో ఆదివాసీల ఇల్లు కట్టుకోవడం చూస్తే ఇంజనీరింగ్ కూడా చాలడు!
- COPD: డేంజరా..! అంటే డేంజరే! అసలు ఏంటదీ సిఒపిడి?
- Chintamani Natakam నిషేధంపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన AP High Court
- Grammarly For Education Get Started