Sitting On Floor | కూర్చునేటప్పుడు ఏదో ఒక ఆసనం వేసుకుని కూర్చోవాలని, కటిక నేలమీద కూర్చోకూడదని పెద్దలు చెబుతుంటారు. ఇంతకీ నేలపై కూర్చోవడం వల్ల ఏం జరుగుతుంది, అసలు నేలపై ఎందుకు కూర్చోకూడదో(Sitting On Floor) ఇప్పుడు తెలుసుకుందాం!.
నేలపై కూర్చోవచ్చా!
మనం మన ఇంటిలో కానీ, ఎక్కడైనా కానీ కూర్చోవాలంటే కుర్చీ, పీట, మంచం ఇలా ఏదో ఒక ఆసనాన్ని ఉపయోగించాలట. ఆసనం అనేది అనేక రకాలుగా చేయబడుతుంది. చెక్కతో తయారయ్యే పీట మొదలైన ఆసనాలు, ఈత ఆకు, తాటి ఆకు, జనపనార తదితర వనరులతో తయారయ్యే చాపలు, ఉన్ని, నూలు తదితరాలతో రూపొందించే వస్త్రాలు, దర్భాసనం, జింక చర్మం, పులి చర్మం, లోపంతో రూపొందిన ఆసనం ఇలా అనేకం ఉన్నాయట. కూర్చునేటప్పుడు(Sitting On Floor) వీటిల్లో ఏదో ఒక దానిపై కూర్చోవాలంట. అంతే తప్ప ఏ ఆసనమూ లేకుండా ఒట్టి నేలమీద కూర్చోకూడదట.
ఎందుకు కూర్చోకూడదంటే?
మన శరీరంలో నిరంతరం విద్యుత్ ప్రవహిస్తూ ఉంటుంది. అలాగే ఉత్పత్తి అయిన విద్యుత్ బయటకు పోతూ ఉంటుంది. ఉత్పత్తి అయ్యే విద్యుత్, వెలుపలికి పోయే విద్యుత్ సమతూకంలో ఉండాలంట. అందులో హెచ్చుతగ్గులు ఉంటే అనారోగ్య సమస్యలు వస్తాయట. ఒక ఆసనం మీద కూర్చోవడానికి మన శరీర ఉష్ణోగ్రత సమానంగా ఉంటుంది. ఇందుకు విరుద్ధంగా ఒట్టినేల మీద కూర్చున్నప్పుడు శరీరంలో ఉత్పత్తి అయ్యేదాని కంటే ఎక్కువ విద్యుత్ బయటకు పోతుందట.
యోగాసనం వేసేటప్పుడు చాప లేదా పులి చర్మాన్ని ఉపయోగించాలట. పులి చర్మం అంటే మళ్లీ పులిని ఎక్కడ చంపుతారని అనుకోమాకండి. ప్రస్తుతం జనరేషన్‌లో చాపలు, మ్యాట్లు వాడుతున్నారు కాబట్టి పులి చర్మంతో పనిలేదు లేండి. ఒట్టి నేలపై కూర్చోకూడదు అని శాస్త్రం చెప్తోందట. పూజ చేయడానికి, అన్నం తినడానికి, ప్రవచానికి, మామూలుగా కాలక్ష్యేపానికి, విశ్రాంతి తీసుకోవడానికి ఇలా రోజులో అనేక సందర్భాల్లో అనేక రకాలుగా కూర్చుంటాం. ఇది ఇలా ఉండగా!.
Sitting On Floor: కింద కూర్చుని తింటేనే మేలంట!
ప్రస్తుతం చాలా మంది డైనింగ్ భోజనానికి అలవాటుపడ్డారు. అయితే ఇది ఆరోగ్య రిత్యా సరైన విధానం కాదని వైద్యులు చెబుతుంటారు. పాతకాలంలో నేలమీద కూర్చుని భోజనం చేసే సంప్రదాయం ఉండేది. ఇలా చేయడం వల్ల అనేక ప్రయోనాలున్నాయి. నేలపై కూర్చుని భోజనం చేసే సమయంలో మనం సుఖాసనంలో కూర్చోవాల్సి వస్తుంది. సుఖాసనం అనేది పద్మాసనం లాంటిదే. పద్మాసనం కారణంగా శరీరానికి ఏ ప్రయోజనాలు చేకూరుతాయో, సుఖాసనంలో కూడా అవే ప్రయోజాలుంటాయి.

కింద కూర్చొని తినడం వల్ల ఆహారాన్ని చక్కగా స్వీకరించగలుగుతాం. ఈ ఆసనం ఏకాగ్రతను కూడా ప్రసాదిస్తుంది. రక్త ప్రసరణ దేహమంతటా సమాన రీతిలో ఉండేలా చూస్తుంది. తద్వారా శరీరానికి అదనపు శక్తి లభిస్తుంది. ఈ విదంగా భోజనం చేయడం వల్ల అధిక బరువు, మలబద్ధకం, గ్యాస్ తదితర ఉదర సంబంధిత సమస్యలు దరిచేరవు. ఈ ఆసనంలో కూర్చోవటం వల్ల నడుంనొప్పి నుంచి విముక్తి లభిస్తుంది.
పైన తెలిపిన రెండు వివరణలు ఆధారంగా ప్రస్తుతం ఉన్న కాలంలో కింద కూర్చోవడమే మేలు అని డాక్టర్లు కూడా చెబుతున్నారు. పరుగులు పెడుతున్న జీవితంలో నేల మీద కూర్చొని మాట్లాడే సమయం ఎవరికీ లేదు. కాబట్టి అందరూ సోఫాలు, కుర్చీలు, డైనింగ్ టేబుళ్లు , బెడ్లు మీద కూర్చుంటున్నారు. ఇలా తిన్నవెంటనే అలా వాటిపై వాలిపోతున్నారు. దీని వల్ల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. కాబట్టి సాధ్యమైనంత వరకూ కింద ఏదైనా పీట, చాప వేసుకొని కొద్ది నిమిషాలు కూర్చోవడమే ఆరోగ్యానికి మంచిది.