singer durgavva కళాకారులకు పుట్టినిల్లు తెలంగాణ రాష్ట్రం. నిరుపేద, పేద, మధ్య తరగతి కుటుంబాల నుంచి ఇప్పటికే ఎంతో మంది కళాకారులు ప్రపంచానికి పరిచయం అయ్యారు. ఏదో రూపాయి కోసమో, ఆస్తులు సంపాదించుకోవడం కోసమో వారు కళను ఎంచుకోలేదు. సమాజంలో వారి వెనుకబడిన పరిస్థితుల మూలాలను బట్టి, ఆర్థిక స్థితిని బట్టి, ఆకలి కోసం కాలే కడుపు బట్టి, నిజ స్వాతంత్య్ర ఉద్యమాన్ని బట్టి వారు కళాకారులు అయ్యారు. అందులో భాగంగా మరొక కళాకారిణి బీమ్లా నాయక్ సినిమా ద్వారా ప్రపంచానికి తెలిశారు. ఆమె సింగర్ దుర్గవ్వ(singer durgavva).
సింగర్ దుర్గవ్వది మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం రొయ్యలపల్లి గ్రామం. అత్యంత నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన సింగర్ దుర్గవ్వది(singer durgavva) పొలం పనులు చేసుకుని బ్రతికే కుటుంబం. పొలం పనులకు వెళుతూ ఏరువాక పాటలు పాడే ఆమె అదే విధంగా జానపద పాటలు కూడా అద్భుతంగా పాడగలరు. జీవితంలో తన భర్త మధ్యలోనే కాలం చేయడంతో కొడుకు,కూతురు బంధువులతో జీవిస్తున్నారు. అయితే తన కుమారుడు దుర్గవ్వని పాటలు పాడమని ప్రోత్సహించాడు. అలా పాడిన జానపద పాటలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ungurame rangaina raamulaala సింగర్ దుర్గవ్వ పాడిన ఈ పాట యూట్యూబ్‌లో పెద్ద హిట్‌ను అందుకుంది. అలా కొన్ని పాటలు పాడటంతో ఆమెకు bheemla nayak సినిమా నుంచి ఫోన్ వచ్చింది.

మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఫోన్ చేసి దుర్గవ్వకు పాట పాడే అవకాశం ఇస్తున్నాం అని చెప్పారు. ఈ విధంగా భీమ్లా నాయక్ల్ లో adavi thalli maata song (అడవి తల్లి మాట) పాటే అవకాశం ఇచ్చారు. దీంతో ప్రస్తుతం దుర్గవ్వ పేరు మారుమ్రోగుతుంది. సింగర్ దుర్గవ్వ గురించి ఛానళ్లు తెలుసుకొని ఇంటర్వ్యూలు తీసుకుంటున్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఒక్క అవకాశంతో తన పేరు మారు మ్రోగడంతో సంతోషంతో ఉంది. అదే విధంగా పవన్ కళ్యాణ్ రుణం ఎప్పటికీ తీర్చుకోలేనని, ఇది నా అదృష్టమని నమస్కరిస్తుంది. ఇంకా మరిన్ని అవకాశాలు సింగర్ దుర్గవ్వ దగ్గరకు రావాలని ఆశిద్ధాం!.
- Panasakaya Biryani: పనసకాయ బిర్యానీ తయారీ నేర్చుకోండి!
- lord krishna stories: లార్డ్ కృష్ణ ఆలోచనకు సృష్టికర్తే మోకరిల్లాడు!
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!