singareni colony incident: హైదరాబాద్‌లోని సైదాబాద్ హత్యాచారం కేసులో మరో కీలక ఆధారం దొరికినట్టు తెలుస్తోంది. నిందితుడు రాజు తప్పించుకునేందుకు అతని స్నేహితుడు సహకారం చేసినట్టు పోలీసులు గుర్తించారు. సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు సమాచారం. ఇదే సమయంలో రాజు కోసం పోలీసుల బృందాలు గాలిస్తున్నాయి.
హైదరాబాద్‌తో పాటు జనగామ, యాదాద్రి జిల్లాల్లో పోలీసులు గాలిస్తున్నారు. ఈ క్రమంలోనే నిందితుడి తల్లి, అక్కాబావలను సైతం పోలీసులు ప్రశ్నిస్తున్నారు. అయితే సైదాబాద్ లో తల్లిదండ్రులతో ఉంటున్న చిన్నారిపై కన్నేసిన రాజు నాలుగు రోజుల క్రితం కుర్కురే ఆశ చూపించి బాలికను తీసుకెళ్లాడు.
పాశవికంగా చిన్నారిని హత్యచేసి శవాన్ని (singareni colony incident)తన గదిలో ఉంచి తాళం వేసి బయటకు వచ్చాడు. బాలిక తల్లిదండ్రులు అతడిపై అనుమానం వ్యక్తం చేసినా పోలీసులు పట్టించుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. చిన్నారి కోసం పోలీసులు, తల్లిదండ్రులు, స్థానికులు అన్ని చోట్లా గాలిస్తున్నప్పుడు రాజు స్నేహితుడు అతడిని పక్కకు తీసుకెళ్లి ఇక్కడి నుంచి పారిపోవాలంటూ చెప్పినట్టు తెలిసింది.


బస్తీవాసులు రాజును వెంటనే గుర్తుపట్టకుండా ఉండేందుకు టోపీ, మాస్కు, తువ్వాలు, ఒక జత బట్టలతో కూడిన సంచిని ఇచ్చాడంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు. వీరి ఆరోపణలకు బలం చేకూర్చుతూ అక్కడున్న సీసీ కెమెరాలో రాజు, అతడి స్నేహితుడు వెళ్తున్న ఫొటోలను పోలీసులు సేకరించారు.
మరో ప్రక్క కొద్ది గంటల్లోనే నిందితుడుని పట్టుకున్నామంటూ మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో చేసిన వ్యాఖ్యలపై పోలీసులను ప్రశ్నిస్తుండగా, పోలీసులు మాత్రం రాజు ఆచూకీ ఇంకా లభించలేదని పది బృందాలతో గాలిస్తున్నామని తెలిపారు.
- Memory Improve: జ్ఞాపకశక్తి పెరగాలంటే ఏం చేయాలి?
- Walking Style: హంస నడకదాన్నా..! నువ్వు నడుస్తు ఉంటే నిలవదు నా మనసే!
- Amba Story: భీష్ముడిపై అంబ ఎలా పగతీర్చుకున్నది? పురాణ గాథ స్టోరీ
- Adivasi Homes: అరణ్యంలో ఆదివాసీల ఇల్లు కట్టుకోవడం చూస్తే ఇంజనీరింగ్ కూడా చాలడు!
- COPD: డేంజరా..! అంటే డేంజరే! అసలు ఏంటదీ సిఒపిడి?