Simple Health Tips: మంచి ఆరోగ్యం కోసం సింపుల్ హెల్త్ టిప్స్ మీకోసం!

Simple Health Tips | ఆరోగ్య‌మే మ‌హాభాగ్యం. కాబ‌ట్టి ఆరోగ్యం విష‌యంలో నిత్యం జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ ఉండాలి. ప్ర‌స్తుత కాలంలో ఏదో ఒక ఆరోగ్య స‌మ‌స్య వెంటాడుతూనే ఉన్న‌ది. కాబ‌ట్టి ప్ర‌తి రోజూ ఆరోగ్య గురించి కేర్ తీసుకుంటూ, ఆహార నియ‌మాలు పాటిస్తే త‌ప్ప‌కుండా మంచి ఆరోగ్యం మ‌న సొంతం అవుతుంది. ఇందులో భాగంగా కింద మ‌రికొన్ని Simple Health Tips అందించాము. వాటిని కూడా తెలుసుకొని పాటించండి.

అతిగా తాగితే Iron పెరిగే ప్ర‌మాదం

శ‌రీరంలో ఐర‌న్ సూక్ష్మ పోష‌కాలు ఎక్కువైనా మ‌నిషి మ‌ర‌ణం త‌థ్య‌మ‌ని యూకేకి చెందిన రుడాల్ఫ్ షుటీ ప‌రిశోధ‌న‌ల్లో తేలింది. మితిమీరి మ‌ద్యం తాగ‌డం వ‌ల్ల నియంత్ర‌ణ లేకుండా ఐర‌న్ సూక్ష్మ పోషకాలు శ‌రీరంలో కలుస్తాయ‌ని, కీల‌క అవ‌య‌వాల‌పై ఒత్తిడి పెంచి మ‌ర‌ణానికి దారితీస్తాయ‌ని తెలిపింది. ఏంజిలా ర‌స్కిన్ వ‌ర్సిటీకి చెందిన రుడాల్ఫ్‌, ఆఫ్రికా ఖండంలోని 877 మంది మ‌హిళ‌ల‌పై 9 ఏళ్ల పాటు చేసిన ప‌రిశోధ‌న‌ల్లో ఈ విష‌యాలు వెల్ల‌డించింది.

కొన్ని Health చిట్కాలు

కొబ్బ‌రి నూనెతో చేసిన వంట‌ల‌ను తింటే కిడ్నీల్లో ఏర్ప‌డే రాళ్లు క‌రుగుతాయి. ప్ర‌తిరోజూ మ‌ధ్యాహ్నం మ‌రియు రాత్రి భోజ‌నం అయిపోయాక కొద్దిగా బెల్లం తిన‌డం వ‌ల్ల జీర్ణ‌శ‌క్తి పెర‌గ‌డ‌మే కాకుండా శ్వాస‌నాళాలు, ఊపిరితిత్తులు, ఆహార‌నాళాలు శుద్దిప‌డి, ర‌క్తం వృద్ది చెందుతుంది. మ‌రియాల పొడిని ఒక స్పూన్ తేనెతో క‌లిపి తీసుకుంటే మంచి ఆక‌లి క‌లుగుతుంది. మ‌రియాల ర‌సం తాగితే క‌డుపు ఉబ్బ‌రం, gas problem నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

రాత్రివేళ Milk తాగితే!

ప్ర‌తి రోజూ రాత్రి ప‌డుకునే ముందు ఒక గ్లాసు పాలు తాగ‌డం వ‌ల్ల అనేక ప్ర‌యోజ‌నాలు దక్కుతాయి. ఒక గ్లాస్ పాల‌లో ఓ టీస్పూన్ తేనె, అర‌స్పూన్ ప‌సుపు, చిటికెడు మిరియాల పొడి, కొద్ది చుక్క‌లు నెయ్యి వేసి బాగా క‌లిపి తాగాలి. ఇలా క్ర‌మం త‌ప్ప‌కుండా చేస్తుంటే ఛాతిలో మంట‌, అజీర్తి త‌గ్గిపోతాయి. BP నియంత్ర‌ణ‌లో ఉంటుంది. మ‌ల‌బ‌ద్ధ‌కం స‌మ‌స్య త‌గ్గుతుంది. కొలెస్ట్రాల్ త‌గ్గుతుంది. ఈ విధంగా త‌యారు చేసుకున్న‌పాల‌లో Antifungal మ‌రియు యాంటీ బ్యాక్టీరియ‌ల్‌, యాంటీ ఇన్‌ఫ్ల‌మేట‌రీ గుణాలు ఉండి రోగ‌నిరోధ‌క‌శ‌క్తిని పెంచుతాయి. ఇన్సులిన్ స్థాయిలు కూడా క్ర‌మ‌బ‌ద్ధం అవుతాయి. జీవ‌క్రియ‌ల ప‌ని తీరు మెరుగ‌వుతుంది.

టూకీగా Arogya Rahasyalu

ఒక చిటికెడు మిరియాల పొడిని మ‌జ్జిగ‌లో వేసుకుని ప్ర‌తి రోజూ తాగుతుంటే అరుగుద‌ల క్ర‌మ‌బ‌ద్దం అవుతుంది. క‌డుపు నొప్పిగా ఉన్న‌ప్పుడు ఇంగువ‌ని నీటిలో క‌లిపి బొడ్డుమీద ఉంచాలి. క‌ళ్ళ‌క‌ల‌క వ‌చ్చిన‌ప్పుడు దూదిని ద‌నియాలు నానేసిన నీటిలో ముంచి క‌ళ్ల‌కు తుడుస్తే ఉప‌శ‌మ‌నం ప‌నిచేస్తుంది. కాలిన మ‌చ్చ‌ల‌కు honey రాస్తే మ‌చ్చ‌లు పోతాయి. కాళ్ళు చేతులు బెణుకుతుంటే ఉప్పుతో కాప‌డం పెట్ట‌డం. క్ర‌మం త‌ప్ప‌కుండా ధ‌నియాలు వాడుతుంటే అధిక రుతుస్రావం ఆగుతుంది. చంటి పిల్ల‌ల‌కు జ‌లుబు చేసిన‌ప్పుడు ముద్ద క‌ర్ఫూరం పొడి చేసి కొబ్బరి నూనెలో క‌లిపి గుండె, గొంతు, వీపు, ముక్కు, వీటి మీద ప‌ట్టించి స‌న్న‌ని వ‌స్త్రం మీద క‌ప్పాలి. దీని వ‌ల‌న లోప‌ల ఉన్న నిమ్ముని చాలా వ‌ర‌కు త‌గ్గిపోతుంది.

Leave a Comment