SI Ch Chinna babu

SI Ch Chinna babu :మాన‌వ‌త్వం చాటిన ఎస్సై | Jaggaiahpet PS

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌

జ‌గ్గ‌య్య‌పేట ఎస్సై చిన్న‌బాబుకు అభినంద‌న‌ల వెల్లువ‌

SI Ch Chinna babu : Jaggayyapeta : మ‌తిస్థిమితం లేని 15 సంవ‌త్స‌రాల వ‌య‌స్స ఉన్న యువ‌కుడు కృష్ణా జిల్లా జ‌గ్గ‌య్య‌పేట బ‌స్టాండ్ లోనే ఉంటూ ఏమీ మాట్లాడ‌లేని స్థితిలో ఉన్నాడు. ఆ బ‌స్ స్టాండ్ లోనే నివాసంగా బ‌తుకును కొన‌సాగిస్తున్నాడు. ఈ యువ‌కుడు విష‌యాన్ని ప్ర‌పంచ మాన‌వ వినియోగ‌దారుల పిల్ల‌ల హ‌క్కుల మ‌రియు సేవా సంస్థ ఆంధ్ర‌ప్ర‌దేశ్ అధ్య‌క్షులు, సామాజిక కార్య‌క‌ర్త ప్ర‌పంచ ఆర్య‌వేశ్య మ‌హాస‌భ ఆంధ్ర రాష్ట్ర వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ జ‌గ్గ‌య్య‌పేట మాజీ మున్సిప‌ల్ కౌన్సిల‌ర్ చారుగుండ్ల ల‌క్ష్మీనారాయ‌ణ స్థానిక జ‌గ్గ‌య్య‌పేట ఎస్సై చిన్న బాబు దృష్టికి తీసుకెళ్లారు.

అక్కున చేర్చుకున్న ఎస్సై చిన్న‌బాబు

యువ‌కుడు ప‌రిస్థితిపై స్పందించిన ఎస్సై చిన్న‌బాబు మ‌తిస్థిమితం లేని ఆ యువ‌కుడిపై ప్రేమ‌ను చూపించారు. యువ‌కుడి వివ‌రాలు తెలుసుకునే ప్ర‌య‌త్నం చేశారు. మాసిన బ‌ట్ట‌లు తొల‌గించి, కేశ‌ఖండ‌న చేసి, త‌న జీపులోనే స్వ‌యంగా తీసుకెళ్లి నూత‌న వ‌స్త్రాలు బ‌హుక‌రించారు. అనంత‌రం జ‌గ్గ‌య్య‌పేట మ‌ట‌న్ మార్కెట్ వ‌ద్ద ఉన్న అనాధాశ్ర‌మంలో ఆ యువ‌కుడిని అప్ప‌గించి దాత‌ల స‌హాయం మేర‌కు మూడు పూట‌లా భోజ‌న వ‌స‌తి ఏర్పాటు చేశారు. ఎప్ప‌టిక‌ప్పుడు ఆ యువ‌కుడి యోగ‌క్షేమాల‌ను అడిగి తెలుసుకుంటున్నారు.
అదే విధంగా సామాజిక కార్య‌క‌ర్త శ్రీ‌నివాస‌రావు స‌హాయంతో ప‌లు సామాజిక మాధ్య‌మాల్లో ప్ర‌చుర‌ణ చేశారు. ఇదే సంద‌ర్భంలో యువ‌కుడు మేన‌త్త అన్ని చోట్లా వెతుకుతూ ఆచూకీ కోసం చూస్తూ సామాజిక మాధ్య‌మాల ద్వారా జ‌గ్గ‌య్య‌పేట పోలీసు వారి వ‌ద్ద త‌న మేన‌ల్లుడు ఉన్నాడ‌నే విష‌యం తెలుసుకుంది. వెంట‌నే జ‌గ్గ‌య్య‌పేట పోలీసు వారిని క‌లిసింది.

యువ‌కుడు నుంచి వివ‌రాలు అడిగే ప్ర‌య‌త్నం చేస్తున్న ఎస్సై చిన్న‌బాబు

కుటుంబం వ‌ద్ద‌కు చేర్చిన ఎస్సై !

వెంట‌నే ఎస్సై చిన్న‌బాబు అనాధ ఆశ్ర‌మం నుండి ఆ యువ‌కుడిని తీసుకువ‌చ్చి అత‌ని మేన‌త్త‌కు అప్ప‌గించారు. యువ‌కుడుని చూసిన మేన‌త్త సంతోషంతో కౌగిలించుకొని త‌న మేన‌ల్లుడు దొరికాడ‌ని ఆనందం వ్య‌క్తం చేసింది. మాన‌సిక స్థితి స‌రిగ్గా లేని ఆ యువ‌కుడు పేరు పాక‌ల‌పాటి సిద్ధార్థ‌. తండ్రి పేరు మ‌ధుబాబు, విజ‌య‌వాడ రాజీవ్ న‌గ‌ర్ లో ఉంటారు. చిన్న‌ప్ప‌టి నుండే మాన‌సిక స్థితి స‌రిగా లేక కుటుంబ క‌ల‌హాల‌తో త‌ల్లిదండ్రుల ప్రేమ‌ను నోచుకోలేక త‌ల్లికి దూర‌మై బ్ర‌తుకు వెళ్ల దీస్తున్నాడ‌ని ఎస్సైకి యువ‌కుడు మేన‌త్త తెల‌ప‌డంతో ఎస్సై చ‌లించిపోయారు.

ఎస్సైను అభినందిస్తున్న ప‌లువురు!

మ‌తిస్థిమితం లేని యువ‌కుడిపై మాన‌వ‌త్వం చూపి, త‌న కంటూ ఉన్న కుటుంబానికి చేర్చిన జ‌గ్గ‌య్య‌పేట ఎస్సై చిన్న బాబును ప‌లువురు ప్ర‌శంసిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఓ ఇంగ్లీష్ ప‌త్రిక కూడా క‌థ‌నం ప్ర‌చురించింది. టీచ‌ర్ గా ఉద్యోగం చేస్తున్న మేన‌త్త‌కు యువ‌కుడి బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించారు. ఇక‌పై తాను కూడా బాధ్య‌త‌లు తీసుకుంటాన‌ని హామీ ఇవ్వ‌డం సంతోషం వ్య‌క్తం చేశారు. సొంత ఖ‌ర్చుల‌తో వారికి దోమ‌తెర‌లు, దుప్ప‌ట్లు అందించారు. ఎస్సై చూపిన మాన‌వ‌త్వం, ప్రేమ‌కు జ‌గ్గ‌య్య‌పేట పోలీసు సిబ్బందితో పాటు ప‌లువురు ఉన్న‌తాధికారులు అభినందించారు.

Share Link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *