Double Bedroom : సీఎం తీవ్ర అస‌హ‌నానికి గురైన వేళ‌!

Spread the love

Double Bedroom : సీఎం కేసీఆర్ కు అధికారులు కోపం తెచ్చిన అనుకోని సంఘ‌ట‌న ఒక‌టి ఆదివారం జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌తో ముఖ్య‌మంత్రి తీవ్ర అస‌హానానికి గుర‌య్యారు.


Double Bedroom : సిరిసిల్ల: తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదివారం సిరిసిల్ల జిల్లాలో ప‌ర్య‌టించిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో కేసీఆర్ తీవ్ర అస‌హనానికి గుర‌య్యారు. 12.36 నిమిషాల‌కు తంగెళ్ల‌ప‌ల్లి మండ‌లం మండేప‌ల్లికి చేరుకున్న సీఎం డబుల్ బెడ్‌రూం ఇళ్ల‌ను ప్రారంభించి ఆరుగురు ల‌బ్ధిదారుల‌కు ఓన‌ర్ షిప్ స‌ర్టిఫికెట్లు అంద‌జేశారు. అయితే ఈ గృహ‌ప్ర‌వేశాల కార్య‌క్ర‌మంలో ఓ ఇంటి గృహ ప్ర‌వేశానికి సిద్ధ‌మైన సీఎం కేసీఆర్ కు అధికారుల‌కు షాక్ ఇచ్చారు. వేద‌మంత్రాల మ‌ధ్య దంప‌తుల‌తో స‌హా కొత్త ఇంట్లోకి అడుగు పెట్టేందుకు సిద్ధ‌మ‌య్యారు. అయితే రిబ్బ‌న్ క‌ట్ చేద్దామ‌నుకునే స‌రికి క‌త్తెర లేకుండా పోయింది. అంద‌రూ క‌త్తెర..క‌త్తెర‌..ఎక్క‌డంటూ అటు ఇటూ చూడ‌టం మొద‌లు పెట్టారు. అయ్యో క‌త్తెర మ‌ర్చిపోయామా! అని అంద‌రూ క‌త్తెర కోసం వెతుకుతుంటే ఆగ్ర‌హానికి గురైన సీఎం కేసీఆర్ వెంన‌టే త‌న చేతితో రిబ్బ‌న్ పీకేశారు. దీంతో అక్క‌డున్న అధికారులు షాక్ అయ్యారు. అనంత‌రం రూ.21 కోట్ల‌తో నిర్మించిన న‌ర్సింగ్ కాలేజీ భ‌వ‌నాన్ని, ఇంట‌ర్నేష‌న‌ల్ స్కూల్‌, జిల్లా క‌లెక్ట‌రేట్ భ‌వ‌నాన్ని ప్రారంభించారు.

KCR vision Golden India: నాడు బంగారు తెలంగాణ నినాదం..నేడు బంగారు భార‌త్ నినాదం!

KCR vision Golden India| హైద‌రాబాద్: కేంద్రంపై పోరు విష‌యంలో త‌గ్గేదేలేంటున్నారు తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌. ఇన్నాళ్లూ బంగారు తెలంగాణ కోసం పాడుప‌డిన తాను ఇక‌పై బంగారు Read more

Land Grab Allegations : సీఎస్‌కు చేరిన ఈట‌ల ప్రాథ‌మిక నివేదిక‌

Land Grab Allegations : తెలంగాణ రాష్ట్రంలో 48 గంట‌ల్లో రాజ‌కీయం తీవ్రంగా వేడెక్కింది. అధికార ప‌క్షంలో ఉన్న మంత్రిపైన స్వ‌యంగా సీఎం కేసీఆర్ భూ క‌బ్జాల Read more

Vaccination : తెలంగాణ‌లో ఇంటి వ‌ద్ద‌కే వ్యాక్సినేష‌న్ | Pulse Polio మాదిరిగా CM Kcr ఆలోచ‌న‌!

Vaccination : తెలంగాణ రాష్ట్రంలో వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మంపై సీఎం కేసీఆర్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంటున్న‌ట్టు తెలుస్తోంది. దేశంలోనే ఆద‌ర్శ‌వంతంగా ఈ వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేయాల‌నే ఆలోచ‌న‌తో Read more

Telangana Political Waar : మంత్రి ఈట‌ల ఇబ్బందికి కార‌కులెవ్వ‌రు? | minister etela rajender

Telangana Political Waar : మంత్రి ఈట‌ల ఇబ్బందికి కార‌కులెవ్వ‌రు? | minister etela rajender Telangana Political Waar : తెలంగాణ రాష్ట్రంలో ఆరోగ్య శాఖ Read more

Leave a Comment

Your email address will not be published.