Shock to Congress Party | Komatireddy Rajagopalreddy Join BJP?|తెలంగాణలో కాంగ్రెస్‌కు షాక్ తగలనుందా? Hyderabad: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి షాక్‌లు మీద షాకులు తగులుతున్నాయి. బిజెపి పార్టీలో చేరేందుకు కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి సన్నహాలు చేస్తున్నారనేది సమాచారం. ఈ నేపథ్యంలో రాజ్‌గోపాల్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదని కూడా వ్యాఖ్యలు చేశారు. రాజజ్గోపాల్ రెడ్డి ఇలా మాట్లాడటానికి అసలు కారణం ఏమిటి? సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి టిపిసిసి పదవి రాకపోవడమేనా? అని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికే నష్టం వాటిల్లింది. హస్తం గుర్తు మీద గెలిచిన 12 మంది ఎమ్మెల్యేలు గులాబీ గూటికి చేరుకున్నారు. అయితే ఇదే వరుసలో మునగోడు ఎమ్మెల్యే కోమటరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి త్వరలో బీజేపీలో చేరుతానని ప్రకటించారని తెలుస్తోంది. టిఆర్ఎస్కు బిజెపి మాత్రమే ప్రత్యామ్నాయం అంటూ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ప్రజలు ఇప్పటికే బిజేపిని ఆహ్వానిస్తున్నారని, అందులో భాగంగానే దుబ్బాక ఉప ఎన్నికలోనూ, హైదరాబాద్ నగర జిహెచ్ఎంసి ఎన్నికల్లోనూ ఫలితాలను బట్టి అర్థమవుతుందని మీడియాకు రాజ్‌గోపాల్ రెడ్డి ఇటీవల తెలియజేశారు.
టిపిసిసి పదవిపైన నిరాశతోనేనా?
ఉత్తమ్ కుమార్ రెడ్డి టిపిసిసి పదవికి రాజీనామా చేసిన తర్వాత ఆ పదవిపై రెండు నెలలుగా పార్టీ నాయకులు నాకు కావాలంటే నాకు కావాలని పోటీపడుతున్నారు. ఇదే సమయంలో పార్టీ సీనియర్ నాయకులంతా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి పదవి కట్టబెట్టాలని అధిష్టానం ముందు ఒత్తిడి కూడా తీసుకొచ్చారు. ఇందులో భాగంగా వారం పాటు ఢిల్లీ మకాం మార్చారు. అనంతరం ఫైనల్ రేసులో టిపిసిసి పదవికి రేవంత్ రెడ్డి పేరు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరు వినిపించింది. నిజానికి గతంలోనే ఎమ్మెల్యే రాజ్‌గోపాల్ రెడ్డి బిజెపిలో చేరతారని ప్రచారం సాగింది.
కానీ సోదరునికి పీసీసీ చీఫ్ ఇస్తారని ఇన్ని రోజులు ఆగారా? అనే సందేహాలు వస్తున్నాయి. అయితే రాజ్‌గోపాల్ రెడ్డి స్వయంగా బీజేపిలో చేరుతానంటూ చెప్పడంతో కోమటిరెడ్డి వెంకటరెడ్డికి పిసిసి పదవి రాదనే సూచనలు చెప్పినట్టు అయ్యింది.
అయితే కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిఖ్యం ఠాకూర్ స్పందించారు. కాంగ్రెస్ పార్టీపై చేసిన వ్యాఖ్యలను తాను తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచే విధానాన్ని ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఖండించాలని అన్నారు. మొత్తానికి రాజ్‌గోపాల్ రెడ్డి వ్యాఖ్యలతో టిపిసిసి పదవి రేవంత్ రెడ్డికి ఒకే అయ్యిందా? అనేది స్పష్ట మవుతుంది.
ఇది చదవండి : కొడుకులను పోలీసులకు పట్టించిన తండ్రి!