shiva ganga:శివుడు జ‌డ‌ల‌లో అంత పెద్ద గంగ ఎలా ఒదిగింది (స్టోరీ)

shiva ganga | క‌పిల‌మ‌హాముని కోపాగ్నికి బూడిద పోగులైన త‌న తాత‌ల‌ను త‌రింప‌జేయడానికి భ‌గీర‌ధుడు జ‌లాధి దేవ‌త‌యైన గంగాదేవిని త‌పస్సు చేసి మెప్పించి దివి నుండి భువికి దింపాడు. శివుడు త‌న జ‌టాజూటంలో గంగ‌ను ధ‌రించాడు, గంగ గంగాభ‌వాని అనిపించుకుంది. గంగ‌ను ఒద‌ల‌మ‌ని భ‌గీర‌ధుడు శివుణ్ణి ప్రార్థించాడు. శివుడు జ‌డ‌ల ముడి స‌డలించి గంగ‌(shiva ganga)ను కొద్దిగా ఒదిలాడు. గొప్ప‌వేగంతో గంగ చిమ్ముకొచ్చి న‌లుదిశ‌లా హిమాల‌యాల్లో పడింది. భ‌గీర‌థుడి వెంట గంగ ప్ర‌వాహంగా తూర్పు ముఖంగా వెళ్లింది.

shiva ganga:శివుడు జ‌డ‌ల‌లో అంత పెద్ద గంగ ఎలా ఒదిగింది

గంగ‌కు భాగీర‌థి అని పేరు వ‌చ్చింది. హిమాల‌యాల్లో ప‌డిన గంగ కొంత హిందూకుశ శిఖ‌రాల మీదుగా ప‌డ‌మ‌ర‌కు ఇందు న‌దిగా ప్ర‌వ‌హించింది. ఇందు న‌దినే సింధున‌ది అన్నారు. భ‌ర‌త ఖండానికి వాయువ్యంగా ఉన్న సింధున‌ది మూలంగా హిందూ దేశమ‌నే పేరు వచ్చింది. భ‌గీర‌థుడి వెంట మ‌హా వేగంగా వెళ్తున్న గంగ‌ను త‌న ఆశ్ర‌మం పాడ‌వ‌కుండా జ‌హ్నుమ‌హాముని తాగేశాడు. భ‌గీర‌థుడు జ‌హ్ను మునిని ప్రార్థించి గంగ‌ను విడుద‌ల చేయించాడు. జ‌హ్ను మ‌హా ముని చెవి నుండి గంగ వెలికి వ‌చ్చినందు వల్ల గంగ‌కు జాహ్న‌వి అనే పేరు కూడా వ‌చ్చింది.

త‌రువాత క‌పిలాశ్ర‌మం చేరి, భ‌గీర‌థుడి పిత‌రుల మీదుగా ప్ర‌వ‌హించి త‌రింప‌జేసి భ‌గీర‌థుడి ప్ర‌య‌త్నాన్ని ఫ‌లింప‌జేసింది. భ‌గీర‌ధుడు కూడా అంత గొప్ప త‌ప‌స్సు చేయ‌లేద‌ని గౌత‌ముణ్ణి మెచ్చుకొని గంగ ప్ర‌స‌న్నురాలై అదే విధంగా గౌత‌ముడి వెంట బ‌య‌లు దేరింది. దారి పొడ‌వునా గంగాదేవి అడుగు జాడ‌ల్లో ఎన్నో యేర్లు, వాగులు పుట్టాయి. గౌత‌మాశ్ర‌యం చేరుతూనే గంగా న‌దీ ప్ర‌వాహ‌మై గౌత‌ముడు దారి చూపుతూ ముందు న‌డుస్తూంటే, ఆవు మీది నుంచి జ‌ల‌జ‌లా పారి గ‌ల‌గ‌లా ప్ర‌వ‌హించి గౌత‌మి అని పేరు పొందింది.

మాయ‌దారి ఆవు దిగ్గున లేచి నాలుగ‌డుగులు వేసి, అలా పైకెగ‌సి ఆకాశంలో అదృశ్యం కాగా విఘ్నేశ్వ‌రుడు సాక్షాత్క‌రించాడు. విఘ్నేశ్వ‌రుడు గంగ‌కు న‌మ‌స్కరించి, అమ్మా! త‌న‌యుణ్ణి వింధ్య‌కు దిగువ నున్న భూభాగ‌మంతా సుభిక్షం కావాల‌ని యింత ప‌ని చేశాను. ద‌క్షిణ గంగ‌గా అవ‌త‌రించిన నీవు, గోవును బ్ర‌తికించి ఇచ్చినందు వల్ల గోదావ‌రి అని పేరు పొందుతావు! అని చేతులెత్తి మొక్కి అదృశ్య మ‌య్యాడు. గోదావ‌రి అనేక ఉప‌న‌దుల‌తో తూర్పుగా ప‌య‌నించి తూర్పు మైదానాల్ని స‌స్య‌శ్యామ‌లం చేసింది.

స‌ప్తరుషులు, దేవ‌త‌లు గోదావ‌రిలో జ‌ల‌క‌మాడారు. గౌత‌ముణ్ణి ఎన్నో విధాల శ్లాఘించి అప‌ర భ‌గీర‌ధుడు అన్నాడు. గోదావ‌రి స‌ప్త గోదావ‌రిగా చీలి తూర్పు స‌ముద్రాన్ని చేరింది. గంగ గోదావ‌రి ప్ర‌వాహంగా మారుతున్న‌ప్పుడు, ఆమె న‌ల్ల‌ని వేణిభ‌ర‌ము విర‌జిమ్ముకొని ప‌డ‌మ‌టి క‌నుమ‌ల్లో చిక్కు ప‌డింది. విష్ణువు త‌న చేతి వ్రేళ్ళ‌తో ఆ చిక్కు విడ‌దీశాడు. కృష్ణ‌వ‌ర్ణుడైన విష్ణువు వ్రేళ్ల సందుల నుంచి కొప్పులోని నీరు జారుతూ కృష్ణ‌వేణి, కృష్ణాన‌ది అని పిలువ‌బ‌డుతూ మ‌రొక గొప్ప న‌ది ప్ర‌వ‌హించింది.

అలాగే గంగాజ‌లం ఆకాశంలో ఎగిరి, ద‌క్షిణంగా ఉన్న క‌వేర‌మ‌హ‌ముని ఆశ్ర‌మంలో క‌మండ‌లంలో ప‌డి, క‌న్య‌గా పెరిగి, ఆగ‌స్త్యుని వెంట అర‌ణ్యాల్లో విహ‌రిస్తూ, కావేరీ న‌దిగా మారి, అంద‌మైన జ‌ల‌పాతాల‌తో ద‌క్షిణ సీమ‌లో ప్ర‌వ‌హించింది. ఆ విధంగా గౌత‌మ‌హ‌ర్షి తెచ్చిన గంగ మ‌రొక మూడు గొప్ప న‌దులుగా ద‌క్షిణ భార‌త‌భూమిని సుభిక్షం చేసింది.గంగా, గోదావ‌రి, కృష్ణ‌, కావేరి అని న‌దుల పేర్లు చెప్పుకోవ‌డం ప‌రిపాటి అయింది. గౌత‌ముని ఆశ్ర‌మం తిరిగి క‌ళ‌క‌ళ లాడింది. గౌత‌ముడి కీర్తి కూడా వ్యాపించింది.

శివ‌-గంగ స్టోరీ

గంగ ప‌డ‌మ‌టి క‌నుముల‌కు ప్ర‌వ‌హించ‌డం అనేది అసంభ‌వ‌మైన‌ది గ‌నుక‌నే ఇంద్రుడు ఆ విధంగా ప‌రిహారం చెప్పాడేగాని, అసంభవాన్ని సాధించి సంభ‌వంగా మార్చిన గౌత‌ముడి గొప్ప‌త‌నాన్ని గుర్తించి క్ష‌మాప‌ణ వేడు కొన్నాడు. గౌత‌ముడికి మాత్రం సంతోషం లేక పోయింది. అదివ‌ర‌కే ఇంద్రుడు మోసం కార‌ణంగా అహ‌ల్య‌ను బండ‌రాయిగా ప‌డి ఉండ‌మ‌ని శ‌పించి, ఉత్త‌ర‌దేశం నుంచి వింధ్య దాడి ప‌డ‌మ‌టి చ‌రియ‌లో ఆశ్ర‌మం కట్టుకుని ఒంట‌రిగా ప్ర‌శాంతంగా త‌ప‌స్సు చేసుకుంటున్నాడు. గోదావ‌రి అవ‌త‌రణంలో ప‌డ‌మ‌టి క‌నుమ‌ల్లోని మునుల ఆశ్ర‌మాలు మ‌రింత శోభించాయి.

అత్రి మ‌హాముని త్రిమూర్తుల అంశల‌తో పుత్ర‌వంతుడ‌య్యాడు. అన‌సూయ అతిథుల‌కు నిర‌తాన్నం దానం చేస్తున్న‌ది. గౌత‌ముడి ఆశ్ర‌మం చుట్టురా కూడా స‌స్య‌స‌మృద్ది విశేషంగా ఉన్నా అహ‌ల్య లేని కొర‌త క‌నిపిస్తూనే ఉన్న‌ది. తొంద‌ర‌ప‌డి అహ‌ల్య‌ను శ‌పించినందుకు గౌత‌ముడు మ‌న‌స్సులో విచారిస్తున్న స‌మ‌యంలో విఘ్నేశ్వ‌రుడు క‌నిపించి, గౌత‌మా! త్వ‌ర‌లోనే విష్ణువు రాముడై త‌న పాదం మోపి, నీ భార్య‌ను మ‌నిషిగా చేస్తాడు. పాషాణి పునీత అవుతుంది. గోదావ‌రి అవ‌త‌ర‌ణానికి గాను, నీకు చాలా శ్ర‌మ ఇచ్చాను. గోదావరికి గౌత‌మి నామం చిర‌స్థాయిగా ఉంటుంది. అని అన్నాడు. గౌత‌ముడు ఆ మాట‌ల‌కు సంతోషంతో విఘ్నేశ్వ‌రా! అంతా నీ సంక‌ల్ప బ‌లం వ‌ల్ల‌నే క‌దా జ‌రిగింది. గోదావరి జలాలూ, విఘ్నేశ్వ‌రుని కృపా ఎల్ల‌కాల‌మూ ర‌క్షిస్తూ ఉంటాయి. అని అన్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *